భళా…. ఐఎఫ్ఏ ఫ్రీడమ్ మేళ

‘స్వాతంత్య్రం’ అంటేనే సంతోషం. ఏ దేశ స్వాతంత్య్ర దినం ఆ దేశం వారికి ఆనందకరమైనది. అమెరికాలోని ఇండియన్‍ ఫ్రెండ్స్ ఆఫ్‍ అట్లాంటా (ఐఎఫ్‍ఏ) భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అటువంటి ఆనందాన్నే అనుభవించింది. ఆటపాటలతో సందడి చేసింది. ఐఎఫ్‍ఏ అట్లాంటాలో ఆగస్టు 15 సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో అతి పెద్ద ఫ్రీడమ్‍ మేళాను నిర్వహించింది. ఈ సందర్భంగా అందరూ ఆనందంగా గడిపారు. అట్లాంటాలోని లిలీబుర్న్ పార్కులో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. గత స్వాతంత్య్ర దినోత్స వాల మాదిరిగానే ఈసారీ ఫ్రీడమ్‍ మేళా-2017కు అందరి అంచనాలకు మించిన స్పందన లభిం చింది. అట్లాంటాలో ఉన్న భారతీయులందరినీ భాష, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ఈ మేళా ఏకం చేసింది. అందరూ ఒకచోట కలిసి స్వాతంత్య్ర దినోత్సవ సంబరం అంబరమంటేలా నిర్వహించుకున్నారు. భారత్‍ – అమెరికా మధ్య ఉన్న సంబంధం, అనుబంధాన్ని చాటేలా ఈ వేడుకను నిర్వహించడం మరో విశేషం. భారతీయ త్రివర్ణ పతాక ఆవిష్కరణకు.. అమెరికన్‍ పతాకంతో అమెరికన్లను స్వాగతిస్తూ చేసిన ఏర్పాట్లు మొత్తం కార్యక్రమానికే హైలైట్‍గా నిలిచాయి.
ఈ ఫ్రీడమ్‍ మేళాకు ముఖ్య అతిథులుగా గౌరవ స్టేట్‍ సెనేటర్లు జడ్సన్‍ హీల్‍, కర్ట్ థాంప్సన్‍, హౌస్‍ ఆఫ్‍ రెప్రజెంటేటివ్స్ బ్రెండా లోపెజ్‍, పామ్‍ పార్‍•క, టాడ్‍ జోన్స్, అట్లాంటాకు చెందిన భారతీయ కాన్సుల్‍ నగేష్‍ సింగ్‍, ఇండియన్‍ క్రికెటర్‍ పార్థివ్‍ పటేల్‍, హీరోయిన్‍ యామినీ భాస్కర్‍, శ్రావణి గొరిపర్తి తదితర అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ జెండాతో పాటు అమెరికన్‍ పతాకాలను జాతీయ గీతాలను ఆలపిస్తూ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‍ మొత్తం కార్యక్రమానికే హైలైట్‍గా నిలిచింది. దాదాపు వెయ్యి మంది ఇందులో పాల్గొన్నారు. వీరంతా తమ తమ రాష్ట్రాలను ప్రతిబింబించే చిహ్నాలు, జెండాలను ప్రదర్శిస్తూ పరేడ్‍లో పాల్గొన్నారు. ఇక, అనేక సేవా సంస్థలు సైతం ఈ పరేడ్‍లో పాల్గొని ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టించాయి. క్రికెటర్‍ పార్థివ్‍ పటేల్‍, హీరోయిన్లు యామిని భాస్కర్‍, శ్రావణి గొరిపర్తి ప్రత్యేకంగా అలంకరించిన జీప్‍ నుంచి అందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పరేడ్‍లో పాల్గొన్నారు. పరేడ్‍ అనంతరం ఐఎఫ్‍ఏ ఇండిపెండెన్స్ కప్‍ విజేతలకు భారత క్రికెటర్‍ పార్థివ్‍ పటేల్‍ బహుమతులను అందచేశారు. ఎంసిస్‍ మొన్టీ, ఐశ్వర్య శ్రీధరన్‍, శ్రీనివాస్‍ కృష్ణ ఈ వేడుకకు హోస్టులుగా వ్యవహరించారు. వివిధ నృత్య అకాడమీలు దాదాపు 20కి పైగా సాంస్క•తిక ప్రదర్శనలను ప్రదర్శించాయి. ఐఎఫ్‍ఏ చరిత్రలో మొదటిసారిగా ఫ్రీడమ్‍ మేళా- 2017 సందర్భంగా ఇతర రాష్ట్రాల్లోని స్పాన్సర్లకు మద్దతునిచ్చింది. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‍ ప్రేమ్‍ రెడ్డి, డాక్టర్‍ మల్లారెడ్డి, కె.కె.రెడ్డి, హరినాథ్‍ పొలిచెర్ల, తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్‍ ఆఫ్‍ డల్లాస్‍ తదితర సంస్థలు , వ్యక్తులు ఈ వేడుకకు హుందాతనాన్ని తెచ్చారు.
ఇక, ఫ్రీడమ్‍ మేళా సందర్భంగా చిన్నారుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. వారి కోసం ఒంటె సవారీలు, పోనీ సవారీలు, బంగీ జంప్‍ వంటివి నిర్వహించారు. తినుబండారాల స్టాల్స్ పిల్లలు, మహిళలతో కిటకిటలాడాయి. సాయి నృత్యాలయ ఆధ్వర్యంలో ప్రదర్శించిన హనుమాన్‍ చాలీసా నృత్యం వేడకకు అందాన్ని తెచ్చింది. ఇంకా వస్త్రాలు, భారతీయ వంటకాలు, ఆభరణాలు, మెహిందీ స్టాల్స్ వంటివి ఆకట్టుకున్నాయి.
ఐఎఫ్‍ఏ వ్యవస్థాపక సభ్యులు సునీల్‍ సవిలి. అలిల్‍ బోధిరెడ్డి, శ్యాం మల్లవరపు, సాయిరామ్‍ పాములపాటి, కిరణ్‍ గోగినేని. శ్రీనివాస్‍ పెద్ది, శ్రీకాంత్‍ ఉప్పల, ఐఎఫ్‍ఏ ఎగ్జి•క్యూటివ్‍ బృందం సభ్యులు కిషన్‍ తాళ్లపల్లి, లక్ష్మి తేసం, ప్రియా రత్నం, అబయ్‍ రాధా, శ్వేతా ధావన్‍, దీపాశర్మ, జమాల్దీన్‍ మస్తాన్‍ఖాన్‍, శ్రీదేవి రంజిత్‍, సంజీవ్‍ ఆకుల, అరుణ్‍ దర్పల్లి, సురేష్‍ వోళ్ల, గిరిధర్‍ కోటగిరి, నిరంజన్‍ పొద్దుటూరి, రవి బాలసుబ్రమణ్యన్‍, హెటల్‍ మెహతా తదితరులతో పాటు 200 మందికి పైగా వలంటీర్లు, స్పాన్సర్లు పాల్గొన్నారు.
పటేల్‍ బ్రదర్స్, సువిధ గ్రోసరీస్‍, ఝులక్‍ కంపెనీ, ఆర్పిన్‍ ఇంక్‍, ఈఐఎస్‍ టెక్నాలజీస్‍, రాపిట్‍ ఐటీ, ఇన్ఫో స్మార్ట్ టెక్నాలజీస్‍, యునికార్న్ టెక్నాలజీస్‍, ఎస్‍ కన్వెన్షన్‍ సెంటర్‍ సోప్త్పత్‍ సిస్టం, ఎల్‍ఎల్‍సీ, ఎస్‍డీకే ఇన్సూరెన్స్, నార్త్ అట్లాంటా విమెన్స్ కేర్‍, అడ్డా స్పోర్టస్, బార్‍, ఎవెన్యూ సొల్యూషన్స్, ఇంకా ఇతర స్పాన్సర్లు ఫ్రీడమ్‍ మేళా 2017కు సహకారం అందించారు. ప్రత్యేక ఆకర్షణలతో రూబీ బ్యూటీ పార్లర్‍ మేళాను ద్విగుణీకృతం చేసింది. వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఐఎఫ్‍ఏ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Review భళా…. ఐఎఫ్ఏ ఫ్రీడమ్ మేళ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top