సేవే లక్ష్యంగా ఇండియన్ సెంట్ నియల్ లయన్స్ క్లబ్ ప్రారంభం..

డల్లాస్‍లో ఫ్లవర్‍ మౌండ్‍ ఇర్వింగ్‍ ఇండియన్‍ సెంటెనియల్‍ లయన్స్ క్లబ్‍ను ఇంటర్నేషనల్‍ లయన్స్ క్లబ్‍ టీమ్‍ ప్రారంభించింది. ఈ క్లబ్‍ త్వరలో వివిధ సేవా కార్యక్రమాలను చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టెక్సాస్‍లోని ఇర్వింగ్‍లో ఈ కొత్త క్లబ్‍ని ఏర్పాటు చేసింది. ఈ క్లబ్‍ ప్రారంభోత్సవానికి ఇంటర్నేషనల్‍ డైరెక్టర్స్ హాజరయ్యారు. ఈ క్లబ్‍ త్వరలో బ్లడ్‍డ్రైవ్‍, డయాబెటిక్‍ అవేర్‍నెస్‍ క్యాంప్‍, 5కె రన్‍ లాంటి పలు సేవాల కార్యక్రమాలను చేపట్టనుంది. ఇంటర్నేషనల్‍ లయన్స్ క్లబ్‍లో భాగమైన లియో క్లబ్‍లో ప్రవాస చిన్నారులు సుమారు 50కి పైగా తమ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఈ క్లబ్‍ ద్వారా అమెరికాలోనే కాకుండా మాత•దేశంలో కూడా సేవలు అందించాలనే ఉత్సాహంతో ఉన్నామని తెలిపారు. మరోవైపు ఈ లయన్స్ క్లబ్‍లో 20కి పైగా చార్టర్‍ మెంబర్స్గా మొదలైందని వందలాది మంది సభ్యులు ఈ క్లబ్‍లో మెంబర్స్ అవుతారని ఆశిస్తున్నామని తెలిపారు. త్వరలోనే డయాబెటిక్‍ క్లినిక్‍, డెంటల్‍ క్లినిక్‍లను వలంటీర్లతో రన్‍ చేయాలని భావిస్తున్నట్లు లయన్స్ క్లబ్‍ సభ్యులు తెలిపారు. హిందూ కమ్యూనిటీతో పాటు అమెరి కన్‍ కమ్యూనిటీకి తమవంతు సహకారం అందిస్తామని తెలిపిన సభ్యలు మాత•దేశంలోని లయన్స్ క్లబ్స్తో అనుసంధానం చేసి పలు సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోర్డు సభ్యులు లక్ష్మి మందిగ, ప్రియ దినవహి, శ్రీధర్‍ శిద్దా, గౌతమ్‍కోట. డా. ఇస్మాయిల్‍ పెనుకొండ, మోహన్‍ దవులురి, బింధుమాధవి చింతా, క్రిష్ణవేణి మారిపల్లి, సుధీర్‍ నగర్‍, హరిచరణ్‍ ప్రసాద్‍, శాంతి గున్న, చిన్ని వెంక టేశ్వర్‍•, సుమన బాసాని, సుజాత చేబ్రోలు, పద్మజ గన్నవరపు, సత్యం కల్యాణదుర్గ్, సాయి సమీరా ఇల్లెందుల, సురేష్‍ ఖాజా, రవీందర్‍ కొమ్మెర, సుషీల్‍ పుప్పాల, క్రిష్ణవేణి పూత్రేవు తదితరులు పాల్గొన్నారు.

Review సేవే లక్ష్యంగా ఇండియన్ సెంట్ నియల్ లయన్స్ క్లబ్ ప్రారంభం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top