అమెరికా విదేశాంగ మంత్రి ‘టిల్లర్‍సన్‍

డొనాల్డ్ ట్రంప్‍ తన విదేశాంగ మంత్రిగా ప్రఖ్యాత చమురు సంస్థ ఎగ్జన్‍మొబిల్‍ మాజీ సీఈవో రెక్స్ టిల్లర్‍సన్‍ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. విదేశాంగ విధానంలో ఏ మాత్రం అనుభవం లేని టిల్లర్‍సన్‍కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‍ పుతిన్‍తో పాటు యూరేసియా. గల్ఫ్ దేశాధినేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా పుతిన్‍తో బంధం ఆయన ఎన్నికను సెనేట్‍ ఆమోదించడంలో అవరోధంగా మారే అవకాశముంది. ఎందుకంటే రష్యా చమురు ప్రాజెక్టుల్లో ఎగ్జన్‍మొబిల్‍కు వాటాలున్నాయని, విదేశాంగ మంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే అవకాశముందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పైగా ఉక్రెయిన్‍ వివాదం నేపథ్యంలో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను టిల్లర్‍సన్‍ తీవ్రంగా వ్యతిరేకించారు. అదేసమయంలో ట్రంప్‍ నిర్ణయం తనకెంతో గౌరవ కారణమని టిల్లర్‍సన్‍ వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే ఈ పదవికి రిపబ్లికన్‍ సీనియర్‍ నేతలు మిట్‍ రోమ్నీ, రూడీ గులియానీ, బాబ్‍ కార్కర్‍లు పోటీపడినా ట్రంప్‍ అనూహ్యంగా టిల్లర్‍సన్‍ను ఎంపిక చేశారు. ఆయన నియామకంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‍ హర్షం వ్యక్తంచేసింది. పుతిన్‍తో సత్సంబంధాలు నెలకొల్పుతానంటూ ట్రంప్‍ ఎన్నికల ప్రచారంలోనే స్పష్టం చేశారు. ఆ దిశగానే టిల్లర్‍సన్‍ను నియమించారని విశ్లేషకులు చెబుతున్నారు.

Review అమెరికా విదేశాంగ మంత్రి ‘టిల్లర్‍సన్‍.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top