దేవాలయాలు మన సంస్క•తీ సంప్రదాయాలకు ప్రతిబింబాలు. అవి మనకు సంస్కారాన్ని నేర్పే పాఠశాలలు. జీవితంలో శృతి… లయ సమంగా ఉండేలా చూసే ఆధ్యాత్మిక సంగీత సాగరాలు. దేశం కాని దేశం… అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అట్లాంటా రాష్ట్రం. ఎక్కడా మన ఆనవాళ్లు లేవు. మన సంస్క•తి, సంప్రదాయాలను ప్రతిఫలించే గుర్తులే లేవు. చిన్న గుడి ఉంటే బాగుంటుంది కదా ?……అనే ఆలోచన అక్కడ ఉంటున్న మన తెలుగు వారికి అనిపించింది.
సరిగ్గా ముఫ్పై అయిదు సంవత్సరాల క్రితం మొగ్గ తొడిగిన ఈ ఆలోచన… నేటికి ఆధ్యాత్మిక పుష్పమై… గొప్ప పరిమళాలను వెదజల్లుతోంది. అట్లాంటాలోని సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన వైష్ణవాలయం, శివాలయం తెలుగు వారి వైభవ చిహ్నాలుగావెలుగొందుతున్నాయి. 35 సంవత్సరాల క్రితం అట్లాంటాలోని కొందరు మిత్రులు మనకూ ఇక్కడ ఒక గుడి ఉంటే బాగుంటుందనే ఆలోచన చేశారు. ఆలయాలు మన సంస్క•తీ సంప్రదాయాలను గురించి, ఆచార వ్యవహారాల గురించి మన పిల్లలకు, మన భావితరాలకు అవగాహన కలిగిస్తాయని, అది మన భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేస్తుందనే సంకల్పమే వారిని ముందుకు నడిపించింది. అలా ఆలోచనతో మొదలైన ఆచరణ… వారు ఊహించని విధంగా ఇంతింతై… వటుడింతై అన్నట్లుగా ఆవిష్క •తమైంది. ఈ దేవాలయ ప్రాంగణం అబ్బుర పరుస్తోందని వారిలో ఒకరైన శ్రీ కృష్ణమోహన్ అంటారు. ఉదయమే వేంకటేశ్వర సుప్రభాతం… అనంతరం దేవీదేవతలకు శాస్త్రోక్తంగా పూజలు.. వేద కర్మలు.. భక్తితో తలవంచే పూలకొమ్మలు.. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంలో తన్మయులై వినమ్రంగా కనిపించే శ్రీనివాసాయ మంగళమ్।। అంటూ వినిపించే మంద్ర స్వరపు ఆధ్యాత్మిక శ్లోకాలు అట్లాంటాలోని ఈ దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే హృదయాన్ని తాకుతాయి. మరో ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. భౌతిక ఆలోచనలన్నీ మనసు నుంచి తొలగిపోతాయి. పవిత్రమైన ప్రదేశంలో ఉన్నామనే భావన నరనరాల చైతన్యాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంది. ఈ రోజు ఈ ఆలయ ప్రాంగణంలో కనిపించే ఆధ్యాత్మిక వైభవాన్ని చూస్తే ఇది కలా… వైష్ణవ మాయా అనిపిస్తుందని అందరూ అంటుంటారు. అయితే ఇది ముమ్మాటికీ కకాదు. కచ్చితంగా వైష్ణవ మాయే! ఎందుకంటే భగవత్ మార్గదర్శకత్వం లేకుంటే.. దారి చూపకుంటే ఇది సాకారమయ్యేది కాదని ఇక్కడి వారి అభిప్రాయం. చిన్న ఆలోచన… 12 ఎకరాల సువిశాల ఆలయ ప్రాంగణంగా మారడం అంటే మాటలు కాదు. అది ఆలోచన చేసిన వ్యక్తుల్లోని గొప్పదనానికి, సంకల్పశక్తికి ప్రతీక. 12 ఎకరాల ఈ ఆధ్యాత్మిక ప్రాంగణంలో వైష్ణవాలయం, శివాలయం అమెరికాలో మన హిందూ సంప్రదాయ చిహ్నాలని వారు గర్వంగా చెబుతారు.
నిత్యం శాస్త్రోక్తంగా పూజలు, శ్రద్ధాభక్తులతో కనిపించే భక్తులు, ఆగమోక్తంగా, దీక్షగా పూజాతంతులు నిర్వహించే పురోహితులు, వేదోక్తంగా జరిగే శాస్త్రపఠనం. ఎక్కడా ఏ లోటూరాకుండా నిరంతరం ఆలయాన్ని పర్యవేక్షించే ధర్మకర్తలు.. ఈ ఆలయ వైభవాన్ని రోజురోజుకూ మరింత ఇనుమడింప చేస్తున్నాయి. భక్తులు ఆలయ అభివృద్ధికి ఇస్తున్న సహాయ సహకారాలు, ఆలయ అభివృద్ధిపై వారు చూపిస్తున్న శ్రద్ధ, ఆసక్తి తమలో మరింత ఉత్తేజాన్ని నింపుతున్నాయని ధర్మకర్తలు అంటున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తారు. స్వామికి మనం ఇతోధికంగా, భక్తి శ్రద్ధలతో కైంకర్యాలు సమర్పిస్తే స్వామి మనల్ని మరింత ఇతోధికంగా కరుణిస్తారు.
భట్టార్ గారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు. వైదిక హ•మాలు, లౌకిక హ•మాలు, సహస్ర దీపోత్సవం, సహస్ర కలశాభిషేకం తదితర కార్యక్రమాల నిర్వహణకు ఆలయ ధర్మకర్తల మండలి శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భారతదేశంలోని వివిధ నగరాల నుండి పెద్ద సంఖ్యలో పండితులు, పౌరోహితులు రానున్నారు. వారి వేదఘోషలతో ఈ పదకొండు రోజులు దేవాలయ ప్రాంగణం మార్మోగనుంది. మన తెలుగువారు, భారతీయులు ఈ రజతోత్సవాలకు తమ బంధుమిత్రులతో వచ్చి, ఆలయ ప్రాంగణంలోని దేవీదేవతల్ని దర్శించుకోవాలని, శుభాలు పొందాలని, పద్మావతీ వేంకటేశ్వరులు, పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు పొందాలని ఆలయ ధర్మకర్తలు కోరుతున్నారు. ఇటువంటి అవకాశం, అదీ విదేశాల్లో మళ్లీ మళ్లీ లభించదని, ఇదంతా స్వామి వారి కృపగా భావించి ఆలయ అభివృద్ధికి అంతా సహకరించాలని వారు కోరారు
Review కలయో వైష్ణవ మాయో...