ఘనంగా వనభోజనాలు నిర్వహించిన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ

విజయవాడ అడుప-తెలుగుపత్రిక
అట్లాంటాలో నిర్వహించిన వనభోజనాలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. స్థానిక ప్రవాసాంధ్రులు వందలాదిగా ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. నిత్యం బిజీబిజీ లైఫ్‍తో ఉండే ప్రవాసాంథ్రులు వనభోజనాలు కార్యక్రమం సందర్భంగా అందరూ ఒకేచోట చేరి సంతోషంగా గడిపారు. చిన్నాపెద్ద అనే తారతమ్యం లేకుండా పలు ఆటపోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందుకు స్థానిక బుఫోర్డ్ డామ్‍ పార్క్ వేదికయింది. ఈ వనభోజనాలు కార్యక్రమంలో ATA,, TATA, TANA, NATA ,TDF, మరియు IFA సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపోటీల్లో చిన్నారులు, పెద్దలు పాల్గొని ఎంజాయ్‍ చేశారు. మరోవైపు వనభోజనం కార్యక్రమానికి వచ్చిన వారి కోసం పసందైన విందుభోజనం ఏర్పాటు చేశారు. ఈ వనభోజనాలు కార్యక్రమంలో పలు తెలుగు సంఘాలతో పాటు.. ఆటా ప్రెసిడెంట్‍ కరుణ ఆసిరెడ్డి, జార్జియా రీజినల్‍ ట్రాన్స్పోర్ట్ ఆథారిటీ డైరెక్టర్‍ జి. నరేందర్‍ రెడ్డిలు పాల్గొన్నారు. అటు ఈవెంట్‍ కోఆర్డినేటర్లుగా శ్రీధర్‍ నెలవెల్లి, కిషన్‍ తాళ్లపల్లి, తరుమల్‍ పిట్ట, సునిల్‍ గూటూర్‍ మరియు నందా చాట్లలు వ్యవహరించారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రశాంతి ఆసిరెడ్డి, సతీష్‍ చెటి, నందా చాట్ల, శశిధర్‍ నెలవెల్లి, కిషన్‍ తాళ్లపల్లి, అనిల్‍ బోడిరెడ్డి, తిరుమల్‍ పిట్ట, సునీల్‍ గూటూర్‍, వేను పిసికె. రాహుల్‍ చిక్యాల, రఘు బంద, సునీల్‍ కుంటూరు, సురేష్‍ వొలమ్‍లు పాల్గొనగా వలంటీర్లుగా నిరంజన్‍ పొద్దుటూరి, చాంకి పల్లా, శైలేందర్‍ ముదిరెడ్డి, రాజేశ్వర్‍ పొలాటి, అనిల్‍ నీలగిరి, అపర్ణ పొద్దుటూరి, జనార్ధన్‍ పన్నెల, శ్రీనివాస్‍ దుర్గమ్‍, శ్రీజన్‍ జోగినపల్లి, గణేష్‍ కసమ్‍, శ్రీని పర్స, వికాస్‍ నర్స, అభిలాష్‍ గంటా, ప్రణీత్‍ పార్నె, రమేష్‍ వెన్నెలకంటి, సాయి ప్రసాద్‍, మానస కండోజి, రాణి వాకిలి, లావణ్య జోగినపల్లి, అశోక్‍ మోతె, బాల నారాయణ, భాస్కర్‍ పిల్లి, నిహారిక పిల్లి, నితిన్‍ జలగం, కౌషిక్‍, వెంగల్‍, వెంకట్‍ గడ్డమ్‍, మహేందర్‍ బుస, వినోద్‍, వెంకట్‍ గొట్టమ్‍ తదితరులు పాల్గొన్నారు.

Review ఘనంగా వనభోజనాలు నిర్వహించిన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top