ఇంటర్‍నెట్‍లో టెలివిజన్ కార్యక్రమాలను చూసే యువత సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని, రానున్న కాలంలో ఇది ఇంకా అధికమయ్యే వీలుందని ఆన్‍లైన్ టీవీ ఛానెళ్ల స్ట్రీమింగ్ వేదిక యప్‍టీవీ వ్యవస్థాపకుడు, ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఉదయ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సంస్థ నూతన ప్రచారకర్తగా మహేష్‍బాబును నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఏ పరికరంలోనైనా టీవీ చూసేందుకు అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యక్రమాలు ప్రసారం అయిన తర్వాత వారం రోజులపాటు ఎప్పుడైనా చూసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మన దేశంలో వీక్షకులు రూ.99, విదేశాల్లో వారైతే 15-20 డాలర్ల వరకూ చెల్లించి దాదాపు 300 వరకూ దక్షిణాసియా ఛానెళ్లను, 5,000 వరకూ సినిమాలను చూసేందుకు అవకాశం ఉందన్నారు. కొత్త సినిమాలు విడుదలైన 4 వారాల తర్వాత ‘పేపర్ వ్యూ’ ద్వారా విదేశాల్లో ఉన్నవారికి అందుబాటులోకి తెస్తున్నట్లు సిఈఓ ఉదయ్ రెడ్డి తెలిపారు.
యప్‍టీవీకి ప్రచార కర్తగా మహేష్‍బాబు

Review యప్‍టీవీకి ప్రచార కర్తగా మహేష్‍బాబు.