వైట్‍హౌస్‍ ‘జిల్‍’ జిగేల్‍ ఫస్ట్లేడీ.. వెరీ పవర్‍ఫుల్‍

నిన్నటి వరకు ఆమె అగ్రరాజ్యం అమెరికాకు సెకండ్‍ లేడీ. ఇప్పుడిక ఫస్ట్ లేడీ. సాధారణంగా భర్త ఉన్నత పదవిలో ఉన్నపుడు భార్య కూడా ఆ హోదాను అందుకుంటూ నలుగురి దృష్టిలో పడాలని అనుకుంటుంది. కానీ జో బైడెన్‍ అమెరికా ఉపాధ్యక్షుడిగా కొనసాగినంత కాలం తెరవెనుకే ఉంటూ భర్తకు వెన్నుదన్నుగా నిలిచారామె. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్టుగా ఇటు దేశ రెండో మహిళగా కొనసాగుతూనే.. అటు తన నిరాడంబరత్వాన్ని చాటుకున్నారామె. ఇక తనకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిని కూడా కొనసాగించారు. అంతేనే.. ఈ రొమ్ము క్యాన్సర్‍పై అవగాహన పెంచుతూ, దాని నివారణ కోసం ఎంతగానో కృషి చేశారు ఈ ‘గ్రేట్‍ టీచర్‍’.
ఇప్పుడు భర్త అమెరికా అధ్యక్షుడయ్యారు. మరి, తన వ్యవహారశైలిలో కానీ, ఇతరత్రా ఏమైనా మార్పులు వస్తాయా? అంటే ఇసుమంత కూడా రావని ఖరాఖండీగా చెబుతున్నారామె. ఆమే.. జో బైడెన్‍ భార్య జిల్‍. భర్త అమెరికా అధ్యక్షుడైన నేపథ్యంలో
ఆమె పంచుకున్న అంతరంగమిది..

ఓ భార్యగా, ఇల్లాలిగా, తల్లిగా.. ఇలా విభిన్న కోణాల్లో జిల్‍ బైడెన్‍ ఓ పరిపూర్ణ మహిళ. సామాజిక కార్యకర్తగా, నాయకురాలిగా తనదైన ముద్ర వేశారు జిల్‍. అటు ఇంటినీ, ఇటు తనకు ప్రాణప్రదమైన వృత్తినీ సమన్వయం చేసుకుంటూనే నేటి మహిళలందరికీ వర్క్ – లైఫ్‍ బ్యాలెన్స్ పాఠాలు నేర్పుతున్నారీ ఫస్ట్ లేడీ. 21వ శతాబ్దపు ఫస్ట్ లేడీ (ఫ్లోటస్‍)గా తనదైన ముద్ర వేయబోతున్న 69 సంవత్సరాల పవర్‍ఫుల్‍ లేడీ జిల్‍ది విశిష్ట వ్యక్తిత్వం. మరి, ప్రథమ మహిళ హోదాలో శ్వేతసౌధంలోకి అడుగు పెట్టబోతున్న జిల్‍ బైడెన్‍కు హృదయ పూర్వక అభినందనలు చెప్పే ముందు ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటో చదివేద్దాం..
అర్థాంగి అంటే భర్త జీవితంలో అర్ధ భాగం కావడమే కాదు.. అతడి ప్రతి అడుగులోనూ తోడునీడగా నిలవాలని అంటారు.

ఈ మాటలు కాబోయే అమెరికా ఫస్ట్ లేడీ జిల్‍ బైడెన్‍కు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. జో బైడెన్‍తో ఏడడుగులు నడిచిన క్షణం నుంచే ఆయన మొదటి భార్య పిల్లలకు తల్లయ్యారు జిల్‍. తనకెంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే ఇటు అమెరికా రెండో మహిళగా మొన్నటి వరకు తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించారు. ఇక తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భర్తకు ప్రతి అడుగులోనూ తోడుంటూ జీవిత భాగస్వామి అంటే ఎలా ఉండాలో అసలు సిసలు అర్థాన్ని చాటారామె. చివరకు భర్త గెలుపును మనసారా ఆస్వాదించారు. ఆ ఆనందంలోనే భర్త విజయాన్ని సెలబ్రేట్‍ చేసుకుంటూ, ‘ఆయన మనందరి కుటుంబాలకు కాబోయే అధ్యక్షుడు’ అంటూ ట్వీట్‍ చేశారు జిల్‍. ఇక, ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఎవరు ముందు ప్రపోజ్‍ చేశారు? జిల్‍, బైడెన్‍ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారా? అటు వృత్తినీ, ఇటు సామాజిక కార్యక్రమాల్లో మమేకమై ఎలా జీవితంలో సమన్వయాన్ని సాధించారు?.. శ్వేతసౌధంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ పవర్‍ఫుల్‍ లేడీ గురించి, జో-జిల్‍ అందమైన ప్రేమకథ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు.

Review వైట్‍హౌస్‍ ‘జిల్‍’ జిగేల్‍ ఫస్ట్లేడీ.. వెరీ పవర్‍ఫుల్‍.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top