అట్లాంటా తెలుగు సంఘం ఆధ్వర్యం లో సంక్రాంతి సంబరాలు

అమెరికాలో ఈ ఏడాది మకర సంక్రాంతి వేడుకలు పలుచోట్ల ఘనంగా జరిగాయి. వీటిలో భాగంగానే, అట్లాంటా తెలుగు సంఘం (తామా) నేత •త్వంలో జనవరి 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మౌంటైన్‍ వ్యూ హైస్కూల్‍ ఆవరణలో అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంక్రాంతి సంప్రదాయాలకు అనుగుణంగా ముగ్గుల పోటీలు, ఫ్రీ మెహెందీ, చిన్నారులకు ఆర్ట్ కాంపిటేషన్‍ వంటి కార్య క్రమాలు ఎంతో వేడుకగా, ఉత్సాహంగా జరిగాయి. టాలీవుడ్‍ కళాకారులు, డాన్స్ స్కూల్స్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. నేపథ్య గాయని నూతన మోహన్‍, గాయకుడు శ్రీకాంత్‍ సందుగు ఆలపించిన మధురమైన పాటలకు సభికులు మైమరిచిపోయారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునికత మేళవింపుగా పసందుగా న •త్య, గాన ప్రదర్శనలు జరిగాయి.
ఈ సంక్రాంతి వేడుకలకు విచ్చేసిన వారికి కేఫ్‍ బాహర్‍ (బిర్యానీ అండ్‍ గ్రిల్‍) నోరూరించే రుచులతో ఆహారాన్ని అందించారు. మనోజ్‍ తాటికొండ, వెంకీ గద్దె, రాజేష్‍ తాడికమల్ల, సుబ్బారావు మద్దాలి, రాజు మండ పాటి, ఇన్నయ్య ఎనుముల తదితర ప్రముఖులు మరియు వాలెంటీర్లు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయ డంలో తమ వంతు బాధ్యతలను చక్కగా నిర్వ హించి ఆహుతుల మన్నలను అందుకున్నారు.

గేటర్‍ అట్లాంటా తెలుగు అసోసియేషన్‍ ఆధ్వ ర్యంలో జనవరి 20వ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఎస్‍ కన్వెన్షన్‍ సెంటర్‍ (స్కైలాండ్‍ బిజినెస్‍ సెంటర్‍) ఈ వేడుకల కోసం అందంగా ముస్తాబుకాగా, తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో సంక్రాంతి సంబరాలు అంబరమంటాయి. పతంగులను ఎగురవేయడంతోబాటుగా ముగ్గుల పోటీలను వైభవంగా నిర్వహించారు. చిన్నారులకు మురిపంగా భోగిపళ్లు పోయడం ఆహుతులకు పరమానందం కలిగించింది. అలాగే, పిల్లల కోసం నిర్వహించిన చిత్రలేఖనం చూపరులను ఆకర్షించింది.
తెలంగాణ కాంగ్రెస్‍ కమిటీ సెక్రటరీ, ఏఐసీసీ సభ్యులు మరియు అమెరికా ఓవర్సీస్‍ అబ్సర్వర్‍ బొద్దిరెడ్డి ప్రభాకర్‍ , నేపధ్య గాయకులు వేణు శ్రీరంగం, కథానాయకి ప్రియా, సింగర్‍ కేపి వంటి ప్రముఖులు అందజేసిన శుభాశీస్సులు ఈ కార్యక్రమాలకు వన్నెతెచ్చాయి.కాగా, గ్రేటర్‍ అట్లాంటా అసోసి యేషన్‍ నిర్వాహక సంఘం సభ్యులు శంకర్‍ గండ్ర, నవీన్‍ రెడ్డి, స్వప్న కశ్వ , సత్యా కర్నాటి, శిరీష గోపాలం, వెంకట్‍ రెడ్డి, నిరంజన్‍ పొద్దుటూరి, పద్మాకర్‍ రెడ్డి, జె.సీ, బిందు గోపాలం, ఉదయ ఈటూరు వంటి ప్రము ఖుల నేత•త్వంలో ఈ సంక్రాంతి సంబ రాలు ఎంతో వైభవో పేతంగా జరిగాయి.

Review అట్లాంటా తెలుగు సంఘం ఆధ్వర్యం లో సంక్రాంతి సంబరాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top