అట్లాంటా లో వైభవంగా గణేషుడి నిమజ్జనం

ది హిందూ టెంపుల్‍ ఆఫ్‍ అట్లాంటాలో వినాయక నిమజ్జనం వేడుక ఘనంగా జరిగింది. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాధుడు వందలాది మంది భక్తుల కోలాహాలం మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అటు గణనాధుడికి ప్రతిబింభంగా ఏనుగును తీసుకువచ్చారు. వినాయకుడి విశిష్టతను హిందువులు తమ పిల్లలకు తెలియజేశారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా హెలిక్యాఫ్టర్‍ ద్వారా వినాయకుడి ప్రతిమపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ది హిందూ టెంపుల్‍ ఆఫ్‍ అట్లాంటా ప్రెసిడెంట్‍ కుసుమ కొట్టె, వైస్‍ ప్రెసిడెంట్‍ శీలా లింగం, సెక్రెటరీ సుబ్బయ్య ఇమాని, జాయింట్‍ సెక్రెటరీ అరవింద్‍ గోలి, ట్రెజరర్‍ రవి కరి, జాయింట్‍ ట్రెజరర్‍ శ్రీరామ్‍ సురపనేనితో పాటుగా ఆలయ పూర్వ సభ్యులు కూడా పాల్గొన్నారు. మరోవైపు ఈ కార్యక్రమం పూర్తిగా వాలంటీర్స్ కమిటీ ఛైర్‍ పర్సన్‍ రవిచంద్రన్‍ నేత•త్వంలో జరిగింది.

Review అట్లాంటా లో వైభవంగా గణేషుడి నిమజ్జనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top