అమెరికాలో తెలుగోడి ఘనత..

తక్కువ ఖర్చుతో ఉప్పునీటిని తాగునీటిగా మార్చవచ్చని అమెరికాలోని ఓ హైస్కూలు విద్యార్థి నిరూపించాడు. ఈ ఆవిష్కరణతో పెద్ద పెద్ద కంపెనీలు, యూనివర్సిటీల ద •ష్టిని ఆకర్షించిన ఆ విద్యార్థి పేరు చైతన్య కారంచేడు.. భారత సంతతికి, అందులోనూ తెలుగువాడు కావడం విశేషం! అమెరికాలోని పోర్ట్లాండ్‍లో చైతన్య తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. స్థానిక జెసూట్‍ హైస్కూల్‍లో చదువుతున్నాడు. సైన్స్ ఎక్స్పెరిమెంట్‍లో భాగంగా ఈ వినూత్న పద్ధతిని కనుగొన్నాడు. ప్రపంచంలో తాగునీటి సమస్యను లేకుండా చేయాలనే ఆలోచనే తనకీ సూ••ర్తినిచ్చిందని చైతన్య చెబుతున్నాడు. ‘‘ఈ విశ్వంలో 70 శాతం నీరే ఉన్నా.. భూమ్మీద ఉన్న ప్రతీ ఎనిమిది మందిలో ఒకరికి పరిశుభ్రమైన తాగునీరు దొరకడం లేదు. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న నీటిలో ఎక్కువ శాతం సముద్రపు నీరే! ఈ ఉప్పునీటినే తాగునీరుగా మారిస్తే సమస్య తీరిపోతుంది కదా అనుకున్నాను. అయితే, ఇప్పటికే ఈ తరహా పరిశోధనలు జరిగాయి. పరిష్కారమూ దొరికింది.
కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనికి చవకైన, తేలికైన పరిష్కారం కోసం చేసిన ప్రయత్నమే ఈ ఆవిష్కరణ’’ అని చెప్పాడు. సాధారణంగా సముద్రపు నీటిలో కేవలం పది శాతం పూర్తిస్థాయిలో ఉప్పుతో నిండిపోయిందని, మిగతా 90 శాతం ఫ్రీ గానే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఇప్పటి దాకా జరిగిన పరిశోధనలు మాత్రం కేవలం ఈ పది శాతం నీటిని మంచినీటిగా ఎలా మార్చాలనే ఆలోచనతోనే జరిగాయి తప్ప మిగతా 90 శాతాన్ని పట్టించుకోలేదని చైతన్య వివరించాడు. ఉప్పు నీటితో పూర్తిగా కలిసిపోయిన నీటిని వదిలేసి మిగతా నీటిపై ద •ష్టిపెట్టడంతో తనకీ పరిష్కారం లభించిందని తెలిపాడు. ఈ ఆవిష్కరణకుగానూ చైతన్య యూఎస్‍ ఏజెన్సీ ఫర్‍ ఇంటర్నేషనల్‍ గ్లోబల్‍ డెవల్‍పమెంట్‍ నుంచి 10 వేల డాలర్ల రివార్డును అందుకున్నాడు. ఎంఐటీ నిర్వహించిన ఇంటర్నేషనల్‍ సైన్స్ ఫెయిర్‍లో ఈ ప్రాజెక్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. కాగా, ఈ పరిశోధన పెద్ద ఎత్తున కొనసాగించడానికి అవసరమయ్యే ఆర్థిక సాయం అందిస్తామంటూ పెద్ద పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయట!

ఇండియన్‍ అమెరికన్‍ మూర్తికి ఉద్వాస
అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్‍ జనరల్‍ పదవి నుంచి భారత సంతతి వైద్యుడు డాక్టర్‍ వివేక్‍ మూర్తిని డొనాల్డ్ ట్రంప్‍ ప్రభుత్వం తొలగించింది. ఆ స్థానంలో అమెరికాకు చెందిన వ్యక్తిని నియమించుకుంది. బరాక్‍ ఒబామా హయాంలో డాక్టర్‍ వివేక్‍ మూర్తిని అమెరికా సర్జన్‍ జనరల్‍గా నియమించారు. వివేక్‍ మూర్తిని రాజీనామా రాజీనామా చేయాలని అమెరికా ఆరోగ్య, మనవసేవల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. మూర్తి కమిషన్డ్ కోర్‍ సభ్యుడిగా మాత్రం సేవలు అందిస్తారని ప్రభుత్వం పేర్కొంది. తనను గౌరవించి ఉన్నత పదవి ఇచ్చి గౌరవించినందుకు క •తజ్ఞతలు చెబుతూ మూర్తి ఫేస్‍ బుక్‍ లో పోస్ట్ చేశారు. అమెరికా లాంటి దేశానికి ఆరోగ్య విషయాలు చూసుకోవాలని అధ్యక్షుడు అడిగే వరకు ఎదదగడం ఇండియాకు చెందిన ఒక పేద రైతు మనవడికి చాలా గౌరవమని మూర్తి పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం వలస వచ్చిన తన కుటుంబాన్ని ఆదరించి, సేవ చేసే అవకాశం కల్పించి
నందుకు అమెరికాకు రుణపడి ఉంటానని చెప్పారు.

మిస్‍ టీన్‍ యూనివర్స్ 2017- శ్రిష్టీ కౌర్
ప్రపంచ వ్యాప్తంగా అందగత్తెలందరినీ దాటుకుని భారత్‍కు చెందిన శ్రీష్టి కౌర్‍ ‘మిస్‍ టీన్‍ యూనివర్స్-2017’గా నిలిచింది. సెంట్రల్‍ అమెరికన్‍ కంట్రీ నికరాగువా రాజధాని మానగువాలో జరిగిన అందాల పోటీల్లో 25 మంది పాల్గొనగా వారందినీ వెనక్కినెట్టి శ్రీష్టి అందాల కిరీటాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ‘బెస్ట్ నేషనల్‍ కాస్ట్యూమ్‍’ బహుమతి కూడా గెలుచుకుంది. నొయిడాకు చెందిన శ్రీష్టి.. ప్రస్తుతం లండన్‍ స్కూల్‍ ఆఫ్‍ ఫ్యాషన్‍లో విద్యనభ్యసిస్తోంది. గతేడాది మిస్‍ టీన్‍ తైరా ఇంటర్నేషనల్‍ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ పోటీల్లో ఏకంగా 29 మంది పోటీదారుల్ని దాటేసి మరీ టైటిల్‍ విజేతగా నిలిచింది. 15 నుంచి 19 ఏళ్ల లోపు వారికి నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొని టైటిల్‍ను సొంతం చేసుకుంది.

ఫోర్బ్స్ సూపర్‍ సాధకుల్లో 53 మంది భారతీయులు
ఒలింపిక్‍ పతక విజేత సాక్షి మాలిక్‍, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‍, బాలీవుడ్‍ నటి ఆలియా భట్‍ సహా 53 మంది యువ భారతీయులు ఫోర్బస్ సూపర్‍ కార్యసాధకుల జాబితాలోచోటు సంపాదించారు. అతి చిన్న వయసులోనే ఆవిష్కరణల సరిహద్దులను చెరిపివేస్తున్న ఔత్సాహిక పారిశ్రామికుల్లో 30 మంది ఆసియాకు చెందిన వారే ఉన్నారు. పది విభాగాల్లో ఒక్కో విభాగానికి 30 మంది చొప్పున 30 ఏళ్ల లోపున్న 300 మంది స్పూర్తిదాయకులైన యువ పారిశ్రామికుల పేర్లను ఫోర్బస్ ప్రకటించింది. వినోదం, ఆర్థికం, వ్యవస్థీక•త మూలధనం, రిటైల్‍, సామాజిక పారిశ్రామికులు, వాణిజ్య సాంకేతికత తదితర రంగాల నుంచి ఫోర్బస్ వీరిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో చైనా 76 మందితో ప్రథమ స్థానంలో ఉండగా, భారత్‍ రెండో స్థానంలో నిలిచింది. భారత్‍ తరఫున 52 ఏళ్ల తరువాత జిమ్నాస్టిక్స్లో పాల్గొన్న 23 ఏళ్ల దీపా కర్మాకర్‍ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. పతకం సాధించకపోయినప్పటికీ తన మొదటి ప్రయత్నంలోనే నాలుగో స్థానం పొందిన దీపా ఇతరులకు స్పూర్తిదాయకంగా నిలిచిందని ఫోర్బస్ పేర్కొంది. ఇప్పటివరకూ ప్రోడునోవా వాల్ట్ను విజయవంతంగా ప్రదర్శించిన ఐదుగురు జిమ్నాస్టిక్‍ క్రీడాకారుల్లో దీపా ఒకరని ప్రశంసించింది. మరో భారతీయ మహిళా అథ్లెట్‍ సాక్షి మాలిక్‍ తీవ్ర ప్రతిబంధకాల మధ్య దేశానికి కాంస్య పతకాన్ని సాధించారని ఫోర్బస్ తెలిపింది. బొళ్లంత్‍ ఇండస్ట్రీస్‍ వ్యవస్థాపకుడు, హైదరాబాద్‍కు చెందిన 25 ఏళ్ల శ్రీకాంత్‍ బొళ్ల ఉత్పత్తి, ఇంధన రంగం విభాగంలో సూపర్‍ కార్యసాధకుడుగా స్థానం పొందారు. గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబంలో అంధునిగా జన్మించిన శ్రీకాంత్‍ ఎంఐటీలో విద్యనభ్యసించిన మొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి అని ఫోర్బస్ పేర్కొంది. ఎంఐటీ అనంతరం భారత్‍ వచ్చిన శ్రీకాంత్‍ హైదరాబాద్‍లో బొళ్లంత్‍ ఇండస్ట్రీస్‍ను స్థాపించి పర్యావరణ ప్యాకింగ్‍లో వికలాంగులకు ఉపాధిని, శిక్షణను అందిస్తున్నారు. ఇక 24 ఏళ్ల బాలీవుడ్‍ నటి ఆలియా భట్‍ ఇప్పటికే 20 సూపర్‍హిట్‍ సినిమాల్లో నటించారని ఫోర్బస్ తెలిపింది. అలాగే భారతదేశపు మొదటి పారాలింపిక్‍ స్విమ్మర్‍ శరత్‍ గైక్వాడ్‍ (25), షీ సేస్‍ వ్యవస్థాపకురాలు త్రిషా శెట్టి (26), ఫీడింగ్‍ ఇండియా సంస్థను స్థాపించిన అంకిత్‍ కవాత్రా (25) యాప్‍ డెవలపర్‍ సోదరులు సంజయ్‍ (15), శ్రావణ్‍ కుమరన్‍ (17) ఈ జాబితాలో ఉన్నారు. కాగా అరబ్బులలో సౌదీ రాజు అల్వలీద్‍ బిన్‍ తలాల్‍ అత్యంత సంపన్నుడని ఫోర్బస్ తెలిపింది.

అట్లాంటాలో ఘనంగా ఉగాది సంబరాలు
అమెరికాలో ఉగాది సంబరాలు మిన్నంటాయి. శ్రీ హేవళంబి నామ సంవత్సర ఆత్మీయ ఉగాది ఉత్సవాలు ఆట్లాంటాలోని టాంబెర్ట్ స్కూల్లో అంగరంగవైభవంగా జరిగాయి. అట్లాంటా తెలుగు వారి సంఘం ‘తామా’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు వందలాది తెలుగువారు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన తానా సభ్యులు… ఉగాది వేడుకలను ప్రారంభించారు. అంతకుముందు ‘‘తామా’’, ‘‘అమ•తవర్షిణి’’ ఆధ్వర్యంలో సాహితి సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పలువురు పిల్లలు, పెద్దలు పాల్గొని కథలు, స్వీయ రచనలు ప్రదర్శించారు. ఉగాది సంబరాలలో భాగంగా ప్రముఖ కళాకారులు ప్రదర్శించిన న•త్యాలు, నాటకాలు, పాటలు, పలు శ్లోకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీవల్లి శ్రీధర్‍ దర్శకత్వం వహించిన ‘‘తామా’’ వారి పెళ్లి సందడి నాటకం అతిథులని ఆనంద పరవశంలో ముంచాయి. దాదాపు మూడు వందల కళాకారులు పాల్గొన్న ఈ సాంస్క •తిక కార్యక్రమం వచ్చిన అతిథుల్ని అందరిని మంత్రముగుల్ని చేసింది. అనంతరం పండితులు ఫణికుమార్‍ శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది సంబరాల•కు వచ్చిన తెలుగు వారందరూ శ్రద్ధగా ఆలకించారు. అనంతరం తమతమ రాశిఫలాల వివరాలను ఆసక్తిగా విన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా శత పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. వివిధరకాల వంటకాలు ఉగాది సంబరాలకు వచ్చిన ఆతిధులందరికీ మహదానందం పంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంబరాలలో చివరిగా గాయనిగాయకులు సుమంగళి, ధనుంజయ్‍లు తమ పాటలతో హ•రెత్తించారు. పాత, కొత్త పాటలతో పాటు.. మెలోడీ పాటలు పాడి ఉర్రూతలూగించారు.

ఓర్పు, సహనానాకి మారుపేరు హిల్లరీ క్లింట
అమెరికాలోని డెట్రాయిట్‍లో కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‍ రచించిన ‘‘చెదిరిన శ్వేత సౌధ స్వప్నం – హిల్లరీ క్లింటన్‍ ఒక పరిచయం’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తానా మాజీ అధ్యక్షుడు డా. బండ్ల హనుమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖులు, డా.ముక్కామల అప్పారావు పుస్తకాన్ని ఆవిష్కరించి.. కంప్యూటెక్‍ చైర్మన్‍ కంచర్ల రామకృష్ణకు యార్లగడ్డ రచించిన పుస్తకాన్ని అంకితమిచ్చారు. తెలుగు భాష సంరక్షణ కోసం, అమెరికాలో ఉండే తెలుగు వారి కోసం.. రేపటి పౌరుల కోసం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‍ రచించిన ఈ గ్రంధం అద్భుతమైనదని వ్యాఖ్యానించారు. ఇలాంటి జీవన పరిచయ గ్రంధాలను రచించిన యార్లగడ్డకు ఆయన శుభా కాంక్షలు తెలిపారు. హింది-తెలుగు భాషల మధ్య వారధిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‍
ఇప్పటికే పేరు తెచ్చుకున్నారని డా. ముక్కామల అన్నారు. యార్లగడ్డ తన రచనలతో భారత్‍-అమెరికా దేశాల మధ్య సాహిత్య సారధిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఇలాంటి రచనలు మరెన్నో రచించి జాతికి అంకితమివ్వాలని కోరారు. హిల్లరీ క్లింటన్‍ అమెరికా ప్రథమ మహిళగా, న్యూయార్క్ నగర సనేటర్‍గా.. అలాగే బరాక్‍ ఒబామా హయాంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు పొందారని రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‍ అన్నారు. ప్రభుత్వంలో కానీ, కుటుంబంలో కానీ ఎలాంటి సమస్యలు వచ్చిన ఒక భారతీయ మహిళ వలే ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారని కొనియాడారు. భారతీయ మహిళలకు ఉండే ఓర్పు, సహనం, సంయమనం హిల్లరీ క్లింటన్‍కు ఉన్నా యన్నారు. అయితే తాను రాసింది రాజకీయ రచన కాదన్న యార్లగడ్డ.. చారిత్రక, సామాజిక నేపథ్యంలో రాసినట్లు వెల్లడించారు. మన తెలుగు భాష, సంస్క•తి సంప్ర దాయాలు, సాహిత్య అంశాలను మేలవించిన గ్రంధమని ఆయన తెలిపారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‍ రచించిన ఈ పుస్తకా విష్కరణ కార్యక్రమానికి అమెరికాలోని పలు సంఘాల అధ్యక్షులు, తెలుగు సాహితీ వేత్తలు పాల్గొన్నారు.

Review అమెరికాలో తెలుగోడి ఘనత...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top