ఆరోసారి ప్రపోజ్‍ ఓకే చేశారు..

జిల్‍ తను చదువుకునే రోజుల్లోనే తన కాలేజీలోనే చదివే ఫుట్‍బాల్‍ క్రీడాకారుడు బిల్‍ స్టీవెన్‍సన్‍ను 1970లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, జిల్‍ విల్మింగ్టన్‍లోని ఓ స్థానిక సంస్థకు మోడలింగ్‍ చేయడాన్ని స్టీవెన్‍సన్‍ తప్పుబట్టడంతో ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ క్రమంగా తగ్గిపోయాయి. దీంతో కలిసి ఉండలేమంటూ 1975లో వీరిద్దిరూ
విడాకులు తీసుకున్నారు. ఒక సందర్భంలో జో బైడెన్‍ సోదరుడు ఫ్రాంక్‍ ద్వారా జో – జిల్‍లకు పరిచయం ఏర్పడింది.

వీరిద్దరికి వయసులో తొమ్మిది సంవత్సరాల వ్యత్సాసం ఉంది. అంటే.. జో కంటే జిల్‍ తొమ్మిది సంవత్సరాలు చిన్నవారు. అప్పటికే జో బైడెన్‍ సెనేటర్‍గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్రాంక్‍ ఏర్పాటు చేసిన బ్లైండ్‍ డేట్‍లో జోను కలిసిన జిల్‍.. ఆయన ఆహార్యానికి (వస్త్రధారణ) ఫిదా అయిపోయారట. ఆ వెంటనే ఇంటికి వెళ్లి, ‘అమ్మా! నాకు తగిన జంటిల్మెన్‍ దొరికాడమ్మా’ అని చెబుతూ తెగ సంతోషపడిపోయారట జిల్‍. అయితే జో చేసిన ప్రేమ ప్రతిపాదనను జిల్‍ అంత తొందరగా అంగీకరించ లేదు. కనీసం ఆరోసారి కానీ ఆయన ప్రపోజ్‍కు అంగీకరించలేదని
చెబుతారు జిల్‍. ఇలా తమ ప్రేమ బంధాన్ని 1977లో పెళ్లి పీటలు ఎక్కించారు జో-జిల్‍. వీరి అన్యోన్యతకు గుర్తుగా ఆష్లే అనే కుమార్తె జన్మించింది.

నా నంబర్‍ నీకెలా దొరికింది?
1975, శనివారం.. సడన్‍గా బైడెన్‍ నుంచి జిల్‍కు ఫోన్‍ వచ్చింది. ఆశ్చర్యపోతూ ఆ కాల్‍ రిసీవ్‍ చేసుకున్న జిల్‍.. ‘నీకు నా నంబర్‍ ఎలా దొరికింది?’ అని అడిగారు. అదే బైడెన్‍తో తాను మాట్లాడిన తొలి మాట అని జిల్‍ చెబుతారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఫిలడెల్ఫియాలో ‘ఏ మ్యాన్‍ అండ్‍ ఏ విమెన్‍’ సినిమాకు వెళ్లారు. అది తమ ఫస్ట్ డేట్‍ అని జిల్‍ చెబుతారు. చివరకు 1977లో న్యూయార్క్లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 1981లో ఆష్లే జన్మించింది.

అమ్మ ప్రేమను పంచి.
జిల్‍తో ప్రేమ, పెళ్లికి ముందే జో బైడెన్‍కు నైలియా హంటర్‍తో వివాహమైంది. వీరిద్దరికీ జోసెఫ్‍ బైడెన్‍ 3, రాబర్ట్ హంటర్‍ బైడెన్‍, నవోమీ క్రిష్టియానా హంటర్‍.. అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. కుమార్తె నవోమీ.. ఏడాది వయసులో ఉన్నపుడు జరిగిన కారు ప్రమాదంలో తల్లి నైలియా హంటర్‍తో పాటు దుర్మరణం పాలయ్యారు. అయితే, జో ప్రేమ ప్రతిపాదనను అంగీకరించే క్రమంలో జోసెఫ్‍, రాబర్ట్లకు (జో మొదటి భార్య పిల్లలు) మరోసారి అమ్మను దూరం కానివ్వను అని ప్రమాణం చేసి మరీ జిల్‍ తన అమ్మ మనసును చాటుకున్నారు. ఈ క్రమంలో తన కుమార్తె ఆష్లేతో సమానంగా జో మొదటి భార్య పిల్లలకు కూడా ఆమె అమ్మ ప్రేమను పంచారు జిల్‍. అయితే జోసెఫ్‍ బైడెన్‍ బ్రెయిన్‍ క్యాన్సర్‍ కారణంగా 2015లో మరణించారు. ఈ మరణం జో బైడెన్‍ కుటుంబంలోని ఎంతో విషాదాన్ని సృష్టించింది. ఏడాది వయసున్న కుమార్తె నీలియా చనిపోయినపుడు జో బైడెన్‍ తీవ్రమైన విషాదంలో కూరుకుపోయారు. ఆ కుంగుబాటు నుంచి జిల్‍ తనను మామూలు మనిషిని చేసిందని బైడెన్‍ గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఆమె తన జీవితంలోకి రావడం ద్వారా తన జీవితాన్ని ఆమె తిరిగి ఇచ్చిందని
బైడెన్‍ తరచూ చెబుతుంటారు.

Review ఆరోసారి ప్రపోజ్‍ ఓకే చేశారు...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top