ఆస్టిన్ హిందూ టెంపుల్ లో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు..

గురుపౌర్ణిమ….. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురుపౌర్ణమి లేదా వ్యాసపౌర్ణమి అని అంటారు. ఇదే రోజున వ్యాసమహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచి భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
ఆస్టిన్‍లో గురుపౌర్ణమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. స్థానిక ఆస్టిన్‍ హిందూ దేవాలయ ప్రాంగణంలోని గురుమందిర్‍లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జూలై 6 నుంచి మూడు రోజుల పాటు గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు సాయిబాబాకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ శ్రీ సాయి సేవలో తరించారు. దీంతో ఆస్టిన్‍ హిందూ దేవాలయం సాయినామస్మరణతో మార్మోగిపోయింది.

Review ఆస్టిన్ హిందూ టెంపుల్ లో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top