ప్రస్తుతం అత్యంత పెద్ద వయస్కుడైన అమెరికా అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన బైడెన్.. అత్యంత పిన్న వయసులోనే సెనేట్‍కు ఎంపికై కూడా నాడు రికార్డు సృష్టించారు. 1972లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికైన ఆయన.. ఆ తరువాత వరుసగా 1978, 84, 90, 96, 2002, 2008 సంవత్సరాల్లో మరో ఆరుసార్లు సెనేటర్‍గా గెలుపొందారు. ప్రతి ఎన్నికల్లోనూ సగటున 60 శాతం ఓట్లు సాధించారు. ఇక, డెలావర్ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన సెనేటర్‍గానూ బైడెన్ పేరుతో రికార్డు ఉంది.
2020 ఎన్నికల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన ఏకైక అధ్యక్షుడిగా బైడెన్ నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 77,920,048 ఓట్లు లభించాయి.
2009లో యూఎస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టడానికి రాజీనామా చేసిన సమయానికి నాల్గవ అంత్యంత సీనియర్ సెనేటర్‍గా నిలిచారు.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసే అవకాశం బైడెన్‍కు తన మూడో ప్రయత్నంలో లభించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1992 తరువాత డొమొక్రాట్లకు దక్కని జార్జియాలో బైడెన్ విజయబావుటా ఎగురవేశారు. ఇక్కడి విజయంతో ఎలక్టోరల్ కాలేజీలో ఆయన బలం మరింత పెరిగింది.
మధ్య తరగతి అనేది అన్ని చోట్లా కీలకమే. ఆ కుటుంబం నుంచే వచ్చానని చెప్పుకోవడానికి, ఆయన జీవితానుభవాలు అందుకు ఉపకరించాయి. అందుకే ఆయనకు అమెరికాలో ఒక కుటుంబపరమైన వ్యక్తిగా అరుదైన గౌరవం దక్కింది. ఈ క్రమంలోనే ఆయన ‘మిడిల్ క్లాస్ జో’గా ప్రసిద్ది పొందారు.
Review ఏడుసార్లు సెనేటర్.