ఘనంగా వెంకటముఖి త్యాగరాజ ఆరాధనా

ఘనంగా వెంకటముఖి త్యాగరాజ ఆరాధనా
శ్రీ వెంకటముఖి త్యాగరాజ ఆరాధన మహ•త్సవం టెక్సాస్‍లోని ఫ్రిస్కో నగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ కార్యసిద్ధి మరకత ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దేవాలయం 2015లో అవధూత దత్త పీఠాధిపతులు శీశీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్థాపించారు.అప్పటి నుండి ఈ ఆరాధన మహోత్సవాలు క్రమం తప్పకుండా చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని పురందరదాసు పిళ్ళారి ఆరంభించారు. ఈ కార్యకమ్రంలో అనేక మంది సంగీత విధ్వాంసులు వారి శిష్యులతో కలసి వెంకట నాభి లక్షణ గీతాలు, సచ్చిదానంద స్వామి గీతాలను ఆలపించి సంగీత ప్రియులందరిని అలరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రవాస భారతీయ విద్యార్థి ప్రణవ్ అరుదైన గౌరవం
నేషనల్‍ జియోగ్రఫిక్‍ బి కాంపిటీషన్‍లో 14 సంవత్సరాల ప్రవాస భారతీయ విద్యార్థి ప్రణయ్‍ వరదా విజేతగా నిలిచారు . ఈ కార్యక్రమంలో అతను 50 వేల డాలర్ల స్కాలర్‍షిప్‍ను గెలుచుకున్నారు. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రణయ్‍ జయభేరి మోగించారు.ఈ అవార్దు దక్కించు కోవటం చాలా ఆనందంగా
ఉందని ప్రణయ్‍ అన్నాడు. గత సంవత్సరం రన్నరైన ప్రణయ్‍ ఈ సారి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మొదటి ట్రై బేకర్‍ ప్రశ్నలోనే తనవిజయాన్ని నమోదు చేసుకున్నారు.తరువాత రెండో స్థానంలో ధామస్‍ రైట్‍ను ప్రకటించారు. ఇతను 25 వేల డాలర్లు గెలుపొందారు. ఈ పోటీలో మరో విషయం ఏమిటంటే మూడో స్థానం కూడా భట్టఆరామ్‍ అనే తెలుగు విద్యార్థ్దికే రావటంతో ప్రవాసులందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విద్యార్థి 10 వేల డాలర్లు గెలుపొందాడు.

ఇర్వింగ్‍కు ఇక మహర్దశ
ఇర్వింగ్‍ మేయర్‍గా రిక్‍ స్టాప•ర్‍ ఎన్నికయ్యారు. టెక్సాస్‍ రాష్ట్రంలోని ఇర్వింగ్‍ నగరంలో బాధ్యతలు స్వీకరించారు. స్టాపర్‍ 1998 నుంచి 2012 వరకు ఇర్వింగ్‍ పట్టణానికి కౌన్సిల్‍ మెంబర్‍గా పనిచేశారు. కౌన్సిల్‍ మెంబర్‍గా విధులు నిర్వర్తిస్తూనే 2007-08 సంవత్సరంలో డిప్యూటీ మేయర్‍గా పనిచేశారు. అలాగే 2008-09లో మేయర్‍ ప్రొ టీమ్‍ మెంబర్‍గా విధులు నిర్వర్తించారు. వీటితో పాటు ప్లానింగ్‍ అండ్‍ డెవలప్‍మెంట్‍ కమిటీ, ఆడిట్‍ సభ్యులుగా మరియు చైర్మన్‍గా ఉన్నారు.అలాగే ఫైనాన్స్ కమిటీ, లెజిస్లేటివ్‍ కమిటీ, పబ్లిక్‍ వర్కస్ కమిటీ, కమ్యూనికేషన్స్కమిటీ, కమ్యూనిటీ సర్వీసెస్‍ కమిటీ మరియు రవాణా మరియు సహజ వనరుల కమిటీలలో అనేక హోదాలలో పనిచేశారు.అంతే కాకుండా 1988 నుండి ఇర్వింగ్‍లో నివసిస్తూ వ్యాలీ రాంచ్‍ అసోసియేషన్‍లో సభ్యుడుగా చేశారు.లోయ రాంచ్‍ అసోసియేషన్‍ మాస్టర్‍ బోర్డు డైరెక్టర్‍గా అధ్య••• బాధ్యతలు నిర్వహించారు.
అదే విధంగా ఇర్వింగ్‍ హెరిటేజ్‍ సొ•సైటీ అధ్యక్షుడిగా పనిచేశారు.రిక్‍ స్టాప•ర్‍ దక్షిణ డకోటాలో పుట్టి పెరిగారు. కొత్తగా మేయర్‍ గా బాధ్యతలు స్వీకరించటం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇర్వింగ్‍ నగరానికి అభివృద్దికి నా శాయశక్తులా కృషి చేస్తానన్నారు.ఈ కార్యకమ్రానికి ఇర్వింగ్‍ మేయర్‍పో టీం (ప్లేస్‍ 1) జాన్‍ సి డానిష్‍, డిప్యూటి మేయర్‍ ఇర్వింగ్‍ మేయర్‍ పో టీం (ప్లేస్‍ 2) అల్లన్‍ ఇ మేఘేర్‍, ఇర్వింగ్‍ మేయర్‍ ప్రో టీం(ప్లేస్‍ 3) డెన్నిస్‍ వెబ్‍, ఇర్వింగ్‍ మేయర్‍ ప్రో టీం (ప్లేస్‍ 4) ఫిల్‍ రిడ్లే,ఇర్వింగ్‍ మేయర్‍ ప్రో టీం (ప్లేస్‍ 5) ఆస్కార్‍ వార్డ్,ఇర్వింగ్‍ మేయర్‍ ప్రో టీం(ప్లేస్‍ 6) బ్రాడ్‍ ఎం లామోర్జీస్‍, ఇర్వింగ్‍ మేయర్‍ ప్రో టీం(ప్లేస్‍ 7) కైల్‍ టేలర్‍,ఇర్వింగ్‍ మేయర్‍ ప్రో టీం(ప్లేస్‍ 8) డబల్యూ ఎం డెవిడ్‍ ఫాల్మేర్‍ మొదలయిన సభ్యులు పాల్గొన్నారు

Review ఘనంగా వెంకటముఖి త్యాగరాజ ఆరాధనా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top