సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం.
కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు
చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.

‘‘కాలు జారితే తీసుకోవచ్చు కానీ,
నోరు జారితే తీసుకోలేము’’
మనం నిత్య జీవితంలో మాటలు మాట్లాడే విషయంలో ఎంత జాగ్రత్త• ఉండాలో ఒక్క వాక్యంలో చెప్పే సామెత ఇది. మాటలు లేకుండా రోజు గడవదు. అలా అని అసలు మాట్లాడ కుండా రోజు గడపలేం కూడా. కాబట్టి అటు వంటి విలువైన మాటల్ని ఆచితూచి వాడాలని ఈ సామెత చెబుతుంది. ఏదైనా మాట జారితే దాన్ని వెనక్కి తీసుకోలేం కదా! ఒక్కోసారి మాటలు చేసే గాయాలు జీవితాంతం గుర్తుండి పోతాయి. అందుకే మన పెద్దలు అంటుం టారు.. ‘కత్తితో చేసిన గాయం కొన్నాళ్లకు మానిపోతుంది. మాటతో చేసే గాయం ఏనాటికీ మానిపోదు’ అని. ఉదాహరణకు అవతలి వారి పొరపాటు లేకున్నా, మీరు ఎవరినైనా పరుషంగా దూషించారనుకోండి. అది అవతలి వారి మదిలో ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అలాగే, ఒక్కోసారి మాటలు ఘర్షణకు కూడా దారి తీస్తుంటాయి. కాబట్టి మనం మాట్లాడే మాటల్ని ఆచితూచి మాట్లాడాలి. ఒక్కోసారి అనవసర పట్టింపులకు పోవడం వల్ల మన మాటలు అవతలి వారిని గాయపరిచే ఈటెలుగా మారిపోతాయి. అటువంటి పరిస్థితి రాకుండా నోటిని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలనే హెచ్చరిక వంటిది ఈ సామెత. కొందరు దురుసుగా మాట్లాడతారు. కొందరు అర్థం లేకుండా మాట్లాడతారు. ఇంకొందరు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మరికొందరు నోటికి అడ్డూ అదుపూ లేనట్టు మాట్లాడతారు. ఇవన్నీ చేటు తెచ్చేవే. ఒక్క నోటిని అదుపులో పెట్టుకుంటే అన్నీ చక్కబడతాయి. మన వ్రవర్తన బాగవుతుంది. మన వ్యక్తిత్వానికి గౌరవం పెరుగుతుంది. మన మాటకు విలువ పెరగా లంటే మనం మాట్లాడే మాటలు విలువైనవిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విచక్షణ లేకుండా మాట్లాడకూడదు. మాట మృదువుగా ఉండాలి. సున్నితంగా ఉండాలి. ఎంతటి క్లిష్టమైన భావన నైనా అత్యంత సున్నితంగా, తేలికగా చెప్పడానికి మనకు మంచి భాష ఉంది. మన తేట తెలుగులో ఉన్నంత అందమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరే భాషలోనూ లేదు. అందుకే మాటలు తూకంలో తూసినట్టు, ఆచితూచి, ఎంచి మాట్లాడాలి. ఎవ రైనా ఏదైనా చూపించి, ‘ఎలా ఉంది?’ అని అడిగారనుకోండి. ‘చండాలంగా ఉంది’ అన డానికి, ‘ఫర్లేదు.. ఇంకా అలా ప్రయత్నించి
ఉంటే ఇంకా బాగుండేదేమో..’ అనడానికి చాలా తేడా ఉంది. మీరు మొదటి మాటకే కట్టుబడి ఉంటే, భవిష్యత్తులో మరెవరూ ఏ విషయం లోనూ మీ అభిప్రాయాన్ని కోరడానికి, తెలుసు కోవడానికి ప్రయత్నించరు. అందుకే నోరు జారకూడదని చెప్పడానికే ఈ సామెతను ఉప యోగిస్తుంటారు.

Review సామెత కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top