టైటానిక్ న్యూస్

వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్‍ ఓడను చూడాలని అనుకునే వారికి ఓ ప్రైవేట్‍ సంస్థ అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. వచ్చే ఏడాది మేలో చేపట్టనున్న ఈ సాహసయాత్ర ద్వారా పర్యాటకులను అట్లాంటిక్‍ మహాసముద్రంలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది బ్లూ మార్బుల్‍ అనే సంస్థ. 2018 మే నెలలో చేపట్టే ఈ సాహస యాత్రలో పర్యాటకులను సుమారు 4వేల మీటర్ల లోతున ఉన్న టైటానిక్‍ ఓడ వద్దకు తీసుకెళ్లనుంది. ఇందుకోసం ఇప్పటికే టికెట్లను కూడా విక్రయించింది ఈ సంస్థ. అయితే ఒక్కో టికెట్‍ ధరను 1,05,129 డాలర్లు.. (రూ.68 లక్షలు)గా నిర్ణయించింది. ఈ సాహసయాత్ర తొలిదశకు సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి కూడా. సుమారు 8 రోజుల పాటు సాగే ఈ యాత్ర కెనెడా నుంచి మొదలవుతుంది.

Review టైటానిక్ న్యూస్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top