డల్లాస్ లో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు..

అమెరికాలోని డల్లాస్‍ నగరం ప్లేనోలోని కపర్డి షిర్డి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా జరి గాయి. అఖిల భారతీయ శ్రీ స్వామి సమర్థ్ గురుపీఠ్‍, త్రయంబకేశ్వర్‍ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ గురుపౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. గురుపౌర్ణమి సంద ర్భంగా తల్లిదండ్రులు వారి పిల్లల అభివృద్ధి, ముఖ్యపాత్ర అంశంపై గురుపీఠం పలు సూచనలు చేసింది. పిల్లలకు మొదటి గురు వులు తల్లిదండ్రులేనని తెలిపారు. అమెరికా లాంటి దేశంలో నివసిస్తూ భారతీయ సంస్క•తిని మరవకూడదని సూచించారు. పిల్లల ఎదుగుదల, భవిష్యత్తుకు బంగారు బాట వేసేది కేవలం తల్లిదండ్రులేనని వారే మార్గ దర్శకులని చెప్పారు.
మూడేళ్ల చిన్నారుల నుంచి 17 ఏళ్ల పిల్లల వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు బాబా దేవాలయంలో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నామని….యోగా, చిత్రలే•నం, నీతికథలు బోధించి పిల్లల్లో మనోవికాసం పెంపొందేందుకు దోహదపడు తాయని తెలిపారు. ఈ సందర్భంగా జరిపిన పలు పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఇక ‘‘గ్లోబల్‍ వాల్యూ ఆడెడ్‍ ఎడ్యుకేషన్‍ తరగతులు’’ నిర్వహించడం ద్వారా చిన్నారులు మరింత ఉత్తేజంగా తయారవు తారని…., ఈ వాల్యూ ఆడెడ్‍ ఎడ్యుకేషన్‍ క్లాసులలో పాల్గొనాలను కునేవారు ఈ క్రింది అడ్రస్‍ని సంప్రదించాలని కోరారు.

Review డల్లాస్ లో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top