‘డీసీఎల్’ క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్!

జులై 4…. అమెరికా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండిపెండెన్స్ కప్‍ పేరుతో డల్లాస్‍ క్రికెట్‍లీగ్‍ యూత్‍ క్రికెట్‍ టోర్నమెంట్‍ నిర్వహించింది. జులై 1 నుంచి జులై 3 వరకు జరిగిన ఈ టోర్నమెంట్‍లో టెక్సాస్‍ క్రికెట్‍ అకాడమి జట్టుతో పాటు యూఎస్‍లోని ఇతర రాష్ట్రాల జట్లు కూడా పాల్గొన్నాయి. స్థానిక మినెర్వ బాంక్వెట్స్లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‍ని ఐసిసి కన్సల్టెంట్‍ మరియు కోచ్‍ పీటర్‍ వెల్లింగ్స్, ప్లేనో నగర మేయర్‍ ప్రొటెం రిక్‍గ్రాడి, ఫనేషియాకు చెందిన షబ్నమ్‍ మొడ్గిల్‍సహా తదితరులు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు.
గెలిచిన జట్లకు టోర్నీ కప్స్ అందజేశారు. మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నమెంట్‍కు నేషనల్‍లైఫ్‍గ్రూప్‍, ఎక్ట్యూట్‍న్యూయార్క్లైఫ్‍, యుఎప్‍వైడ్‍, స్విచ్‍, ఇంటెల్లీ సాప్ట్టెక్నాలజీస్‍ స్పాన్సర్‍గా నిలిచాయి. ఇక మీడియా పార్టనర్లుగా ఫనేషియా పీకాక్‍ రెస్టారెంట్‍, మినెర్వ బాంక్వెట్స్ సహకారం అందించారు.
డల్లాస్‍ క్రికెట్‍లీగ్‍ గత 15 ఏళ్లుగా కృషి చేస్తోంది. 2003లో తొలుత జూని యర్స్తో ప్రారంభమై…… కాల క్రమేణా ఇంటర్మీడియేట్‍, అడ్వా న్సెడ్‍ టీంలుగా రూపొందిస్తూ వస్తోంది. ప్రతి సంవత్సరం టోర్నమెంట్లు నిర్వహిస్తుంది. 2014-17 సంవత్సరాలలో జాతీయ స్థాయి పోటీలను కూడా డీసిఎల్‍ నిర్వహించింది. డల్లాస్‍ క్రికెట్‍ లీగ్‍లో ప్రస్తుతం పాకిస్తాన్‍ క్రికెట్‍ టీం మాజీ వైస్‍కెప్టెన్‍ ఆసిఫ్‍ ముజితబా కోచ్‍గా వ్యవహరిస్తు న్నారు. క్రికెట్‍కు అనువైన మైదానం ప్లేనో, రసెల్‍క్రిక్‍ మైదానంలో క్రికెట్‍పోటీలు నిర్వహిస్తుంది డిసిఎల్‍ క్రికెట్‍కి సంబంధించి ఆసిఫ్‍ ముజితబాతో పాటుగా ఉదయ్‍పూసర్ల, కుల్జిత్‍ సింగ్‍నిఝార్‍, సంపూర్ణ రామకృష్ణలు బాలబాలి కల విభాగంలో వారికి క్రికెట్‍ ఆటలో మెలకువలు, శిక్షణను అందిస్తూ యువతరాన్ని మంచి క్రికెట్‍ ఆట
గాళ్లుగా తయారుచేస్తున్నారు. క్రికెట్‍ ఆట పట్ల అంకితభావంతో అండర్‍ట్వంటీ ఫైవ్‍పోటీలు, వీకెండ్‍లో మ్యాచ్‍లు నిర్వహిస్తోంది.
2003లో ప్రారంభమైన డిసిఎల్‍ 2008 వరకు ఏడాదికి మూడు టోర్నమెంట్లకే పరిమిత మైంది. ఆ తర్వాత 2009 నుంచి ఏడాదికి 8 నుంచి 10 టోర్నమెంట్లు నిర్వహిస్తూ టెక్సాస్‍ రాష్ట్రంలోని క్రికెట్‍ అభిమానులు, క్రికెట్‍ ఆటపై మక్కువ ఉన్న వారికి కోచింగ్‍ ఇస్తూ వారిని మంచి క్రికెటర్లుగా తయారు చేసింది. ఇక 2016లో నెలకో టోర్నమెంటు, ఈ ఏడాదిలో అప్పటికే 8 టోర్నమెంట్లు నిర్వహించింది. డిసిఎల్‍ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో టెక్సాస్‍ రాష్ట్రాన్ని ‘‘క్రికెటెక్సాస్‍’’గా తయారు చేస్తామని డీసిఎల్‍ పేర్కొంది. క్రికెట్‍ ఆటలో టెక్సాస్‍స్టేట్‍…. మేటి అనేవిధంగా ఇక్కడి జట్టుని తయారు చేస్తామని డిసిఎల్‍ సభ్యులు తెలిపారు. నేర్చుకునే వారికి మంచి శిక్షణ ఇవ్వడంతో పాటు… టోర్న మెంట్లు నిర్వహిస్తూ క్రికెట్‍ ఆటకే వన్నె తెచ్చే మేటి ఆటగాళ్లుగా తయారు చేసి ఇటు అమెరికా… అటు ఇండియాకు మంచి పేరు తీసుకువచ్చేలా తయారు చేస్తామన్నారు. అయితే తాము చేస్తున్న కృషికి అందరూ తోడ్పాటు నందించాలని కోరుతోంది. తమ పిల్లలకు ఏ ఆటపై ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని వారికి వాటిపై శిక్షణ ఇప్పించా లంటోంది. అంతేకాదు భావితరానికి క్రీడా సంస్క•తి తెలియాలంటే ఇప్పటి నుంచే ప్రతి ఆటను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న డిసిఎల్‍… లివ్‍ అండ్‍ లెట్‍లివ్‍ అనే (బతికి బతి కించడం) అనే భావన పెంపొం దించడం ద్వారా చక్కటి పునాది అవుతుందని అంటోంది డిసిఎల్‍.

Review ‘డీసీఎల్’ క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top