అమెరికా ప్రథమ మహిళ మిలానియా ట్రంప్ అధికారిక చిత్రపటాన్ని శ్వేతసౌధం విడుదల చేసింది. వైట్‍హౌస్ కిటికీ ముందు దిగిన ఈ ఫోటోలో మిలానియా నలుపు రంగు బట్టలు ధరించి.. చేతులు కట్టుకుని కన్పించారు. ‘‘ప్రథమ మహిళగా దేశానికి సేవ చేయడం గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లోనూ అమెరికా ప్రజల తరపున నా వంతు బాధ్యతలు నిర్వర్తిస్తాను’’ అని ఫొటో విడుదల సందర్భంగా మిలానియా ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే మిలానియా అధికారిక ఫొటోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అమెరికా తొలి మహిళ అందంగా, హుందాగా ఉందని ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. వైట్‍హౌస్ కిటికీ ముందు నిలబడి ఫొటో దిగడం 1990లో స్కూల్లో దిగే చిత్రపటాల సెట్టింగ్‍లా ఉందని విమర్శిస్తున్నారు. మరికొందరేమో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ఇంట్లో మిలానియా ఫొటో దిగారంటూ కామెంట్లు చేస్తున్నారు.
సాధారణంగా దేశాధ్యక్షుడు సతీమణి ఆయనతో పాటే వాషింగ్టన్‍లోని వైట్‍హౌస్‍లో ఉంటారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికై మూడు నెలలు గడిచినా.. మిలానియా మాత్రం ఇంకా మాన్‍హట్టన్‍లోని తన నివాసంలోనే ఉంటున్నారు. తన కుమారుడు బారన్ ఈ ఏడాది స్కూల్ పూర్తయ్యే వరకు మిలానియా అక్కడే ఉంటారని ట్రంప్ గతంలోనే ప్రకటించారు.
అయితే అమెరికా ప్రథమ మహిళ అధికారిక ఫొటో వివాదాస్పదమవడం ఇది తొలిసారి కాదు. 2009లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ఆయన సతీమణి మిషెల్‍అధికారిక ఫొటోలో స్లీవ్‍లెస్ డ్రెస్‍లో కనిపించడం చర్చనీయాంశమైంది
ఫస్ట్ లేడీ అధికార ఫోటో విడుదల

Review ఫస్ట్ లేడీ అధికార ఫోటో విడుదల.