బఫెట్ టాప్ టెన్ టిప్స్

ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడైన వారెన్‍ బఫెట్‍ కొన్ని సలహాలిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషించే డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చుపెట్టాలి, దేనిపై వెచ్చించాలి, పెట్టుబడులు ఎలా పెట్టాలి, అంచనాలు ఎలా వేసుకోవాలి, వాటిని ఎలా అందుకోవాలి? వంటి వాటిపై చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చారు. అవి..
1. పొదుపు: ఖర్చుచేయగా మిగిలింది పొదుపు చేయడం కాదు.. పొదుపు చేయగా మిగిలింది ఖర్చుపెట్టాలి.
2. ఖర్చులు: నీకు పెద్దగా అవసరంలేని వస్తువు కొంటే, త్వరలోనే నీకువసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది.
3. సంపాదన: ఒక్కరి ఆదాయం మీదే ఆధారపడకుండా సెకెండ్‍ ఇన్‍కం సోర్స్ కోసం పెట్టుబడి పెట్టాలి.
4. పెట్టుబడులు: కోడిగుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టుకుని పట్టుకెళ్లడంలా కాకుండా.. విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి.
5. అంచనా: నిజాయితీ అనేది చాలా ఖరీదైంది.. అది చీప్‍ పీపుల్‍ నుంచి ఆశించకు.
6. రిస్క్చేయడం గురించి: ఎప్పుడూ రెండు కాళ్లూ ముంచి నది లోతెంతో చూడకు..
7. అవాంతరాలు ఎదురైనప్పుడు మూడు అవకాశాలుంటాయి. అది ఒకటి మళ్లీ పునరుత్తేజంతో ముందుకెళ్లేలా చేస్తుంది… మిమ్మల్ని నాశనం చేస్తుంది.. లేదా అది మరింత బలవంతుడిగా తీర్చిదిద్దుతుంది.
8. గతం ఓ చిత్తు కాగితం: ప్రస్తుతం అనేది న్యూస్‍ పేపర్‍, భవిష్యత్‍ ఒక క్వశ్చన్‍ పేపర్‍ గతం నుంచి బయటకొచ్చి వర్తమానాన్ని నియంత్రించుకుంటూ భవిష్యత్‍ను భద్రం చేసుకోవాలి.
9. మన చిన్నతనంలో
పెన్సిల్స్ వాడాం: కాని ఇప్పుడు పెన్నులు వాడుతున్నాం ఎందుకు? చిన్నతనంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవచ్చు: కాని ఇప్పుడు అది కుదరదు.
10. మనకళ్లు ముందే ఎందుకున్నాయో తెలుసా: వెనుక చూడడం కంటే మనకు ముందు చూపు చాలా ముఖ్యం గనుక.

Review బఫెట్ టాప్ టెన్ టిప్స్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top