బాబా నీ రూపం అద్భుతం

అందరి అంతరాల్లో సర్వాంతర్యామిగా కొలువై ఉండే బాబా లేనిచోటు ఈ లోకంలో ఎక్కడుంది?
సరిగ్గా మధ్యాహ్న వేళకు షిర్డీ వీధుల్లో ఇంటింటికి ఏదో రూపంలో భిక్షకు వెళ్తారు..
ఉదయం, సాయంత్రం వేళల్లో సేవకుడి రూపంలో లెండీ వనంలోని మొక్కలకు నీళ్లు పోస్తారు.
ఎవరైనా భక్తుడు బాధతో అర్థిస్తే ఆర్తిగా అక్కున చేర్చుకుని స్వాంతన కలిగిస్తారు.
ఎవరైనా భక్తులు ప్రేమతో ‘సాయీ..’ అని పిలిస్తే ‘ఓయీ..’ అంటూ పలుకుతారు.
మరెవరైనా సహాయం కోరితే పరుగున వెళ్ళి చేయూతనిస్తారు.
అలసిసొలసిన భక్తులకు ఆపన్నహస్తం అందించి సేద దీరుస్తారు.
ఒకటా.. రెండా.. ఒకే సమయంలో వేనవేల రూపాల్లో భక్తజన బాంధవుడై పిలిస్తే పలుకుతారు.
భక్తులంతా ఆయన బంధుగణమే.. జగమంతా ఆయన స్వస్వరూపమే..
పరమేశ్వర స్వరూపమై అవతరించి ఈ నేలను పావనమొనర్చిన బాబా గురించి చెప్పడానికి అక్షరాలేం సరిపోతాయి?
ఆయన అవతార ప్రాశస్త్యాన్ని దర్శించడానికి వేయి కనులైనా చాలవు కదా!.
అయినా.. ఒక చిన్న ప్రయత్నం చేసింది ‘సాయివిద్య ఫౌండేషన్‍’.
శ్రీ సాయి సచ్చరిత్రలోని అద్భుత ఘట్టాలకు అద్దం పట్టే బాబా చిత్రాలను ఏర్చికూర్చి అద్భుతమైన ఆల్బమ్‍ను రూపొందించింది.
వీటిని చూడటంతోనే సచ్చరిత్రలోని సన్నివేశాలు కళ్లకు కడతాయి.
బాబా చిన్ముద్ర రూపం చిరకాలం మదిలో పదిలంగా ఉండిపోతుంది.
అంతర్జాతీయ నాణ్యత ముద్రణ ప్రమాణాలతో బాబా ఆశీర్వాదంతో రూపుదిద్దుకున్న ఈ ఆల్బమ్‍ను సొంతం చేసుకోవడం అంటే.. బాబాను మీ వాడిని చేసుకోవడమే.

Review బాబా నీ రూపం అద్భుతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top