సేవకు మరు పేరు.. ఏ వన్ హోంకేరే

వృద్ధులు, వికలాంగులు.. సమాజంలో అత్యధికంగా నిరాదరణకు గురయ్యేది వీరే. ఇటువంటి వారిని చేరదీసి, వారి సంరక్షణకు బాధ్యత వహిస్తోంది ‘ఏ వన్‍ హోమ్‍ కేర్‍’. వృద్ధులు, వికలాంగులకు ఈ సంస్థ ఆశ్రయం కల్పించడమే కాదు.. వారికి పని చేసుకునే అవకాశం కల్పిస్తుంది. బాధితులు కోరుకుంటే.. వారిని వారి వారి మత ప్రాంతాల సందర్శనకు తీసుకువెళ్తారు. అమెరికాలోని నా పర్యటనలో భాగంగా ఈ సంస్థను సందర్శించడం జరిగింది. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వారికి అక్కడ అందిస్తున్న సేవల్ని చూశాక.. వాటిని మీతో పంచుకోవాలనే చిన్న ప్రయత్నమిది.

ఈ సంస్థని నడిపిస్తున్నది భారతీయులు, అందు లోనూ తెలుగు వారు కావడం విశేషం. తన విశిష్ట సేవలతో ‘ఏ వన్‍ హోమ్‍ కేర్‍’ సంస్థ ఎంత గొప్పగా ప్రాచుర్యం పొందిందంటే.. మనం ఎలాంటి సేవలు కోరుకుంటున్నామో.. మనం ఎక్కడైతే సుఖంగా, ప్రశాంతంగా ఉంటామని అనుకుంటామో.. అది ఏ వన్‍ హోమ్‍ కేర్‍ అయి తీరుతుంది. ఈ సంస్థలో చేరిన వారిని సిబ్బంది కంటికి రెప్పలా చూసు కుంటారు. ఇక్కడ చేరిన వారు ఏ దేశానికి చెందిన వారైతే వారికి ఆ దేశానికి చెందిన, భాషకు చెందిన సంరక్షులను తోడుగా నియమిస్తారు. మనో వేదనను అంత సులభంగా మరొకరితో పంచుకోలేం. కానీ, దాన్ని పంచుకోనిదే మనసులోని భారం తగ్గదు. అటువంటప్పుడు అవతలి వ్యక్తితో భాషా సంబంధమైన సమస్య ఏర్పడితే ఇక మన మనసు లోని మాటను ఎలా, ఎవరికి చెప్పుకోవాలి. ఏ వన్‍ హోమ్‍ కేర్‍లో అటువంటి ఇబ్బంది ఉండదు. నేను అక్కడికి వెళ్లగానే.. నా భాష గురించి తెలుసు కుని అదే భాష వచ్చిన వారిని నాకు గైడ్‍గా నియ మించారు. దాంతో నా సమస్య దూదిపింజలా ఎగిరిపోయింది. ఈ విధమైన సేవలందిస్తున్న కారణంగానే ఈ సంస్థ మంచి గుర్తింపు పొందింది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని జార్జియా రాష్ట్రంలో రెండు వేల సంవత్సరంలో ఏ వన్‍ హోమ్‍ కేర్‍ సంస్థను ఏర్పాటు చేశారు. జార్జియా రాష్ట్రంలోనే ఇది మంచి సంస్థగా పేరొందింది. వందల మందికి సేవ లందిస్తూ, మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థకు ఎన్నో అవార్డులు లభించాయి.
వృద్ధులు, వికలాంగుల పట్ల ఈ సంస్థ సంరక్ష కులు చూపే ప్రేమ, ఆప్యాయతలను నేను ప్రత్య క్షంగా చూసినప్పుడు నాకు కలిగిన ఆశ్చర్యా నందాలను అక్షరాల్లో చెప్పలేను. ఇది ఓ కుటుం బంగా ఉంటుంది. మీకు ఎవరైనా తెలిసిన వృద్ధులు, వికలాంగులు ఉంటే, వారిని ఇక్కడ చేర్పించడానికి వంద శాతం సిఫార్సు చేయవచ్చునని నేను అక్కడి సేవల్ని ప్రత్యక్షంగా చూసి చెబుతున్నాను. ఎవరిని చేర్పించాలనుకుంటున్నారు? ఎందుకు చేర్పిం చాలని అనుకుంటున్నారు? వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అనేది సంస్థ ఫోన్‍ నంబర్‍కు ఫోన్‍ చేసి చెబితే చాలు.. ఇక మిగతా సంగతంతా సంస్థ నిర్వాహకులే చూసుకుంటారు. అయితే, సంస్థ తరపున ఒక దరఖాస్తును నింపాల్సి ఉంటుంది.
ఈ సంస్థలో వృద్ధులు, వికలాంగుల సేవ, సంరక్షణకు నియమితులైన సిబ్బంది పూర్తిగా అంకిత భావం గలవారు. సేవా గుణంలో సాటిలేని వారు. ఇక్కడ చేరిన వారి ఇష్టా యిష్టాలను ముందే తెలుసుకుని అందుకు అను గుణంగా సేవలు అందించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ పని చేయడానికి నియమితులైన ప్రతి సంరక్షకుడి కుటుంబ నేపథ్యాన్ని ముందే తెలుసు కుంటారు. ఆ తర్వాతే వారిని బాధ్యతల్లోకి తీసు కుంటారు. సుశిక్షితమైన శిక్షణ పొందిన వారు కావడంతో కంటికి రెప్పలా చూసు కుంటారు.
మీకు తెలిసిన లేదా మీ వారెవరైనా వృద్ధులు, వికలాంగులు ఉంటే.. వారిని చేర్పించాలను కుంటే అందుకు అనువైనది ఏ వన్‍ హోమ్‍ కేర్‍. ఎందుకంటే.. నేను ప్రత్యక్షంగా ఇక్కడి సేవల్ని పరిశీలించిన అనంతరం నమ్మకంగా చెబుతున్న మాట ఇది.
-ప్రశాంత్‍, హైదరాబాద్

Review సేవకు మరు పేరు.. ఏ వన్ హోంకేరే.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top