అప్రమత్తులమై వుండాలి

శ్లో।। అపరాధో న మే-స్తీతి నైతద్ విశ్వాసకారణమ్ ।
విద్యతే హి నృశంసేభ్యః భయం గుణవతామపి ।।
– సారంగధర
‘‘నేను ఏ అపరాధం చేయలేదు. నాకు ఎవరూ కష్టం కల్గించరు’’ అని భావించరాదు. ఎందుకంటే దుర్మార్గులు మంచివాళ్లకి భయం కల్గిస్తూనే వుంటారు.
సాధు మహాత్ములైన వ్యక్తులెందరు హత్యకు గురికాలేదు – అమాయక ప్రజలెందరు టెర్రరిస్టుల ఘాతుకానికి బలి కాలేదు!?
వాస్తవం ఏమంటే, అందరి ఆలోచనలు, స్వభావాలు ఒకేరీతిగా వుండవు. సనాతన ధర్మంలో ‘‘సర్వే భవన్తు సుఖినః’’ అని కాంక్షించారని, కాబట్టి ప్రపంచమంతా ఆవిధంగానే ఆలోచిస్తుందని తలవటం అమాయకత్వమే. (ఘోరీని 17 సార్లు క్షమించిన పృథ్వీరాజు, చైనా కుతంత్రాన్ని కనిపెట్టని నెహ్రూ ఇందుకు ఉదాహరణలు) మంచిని వ్యతిరేకించే అసురశక్తులు ఎప్పుడూ వుంటూనే వుంటాయి. అట్టి రాక్షస శక్తుల ఎడల అప్రమత్తంగా వుండమని హెచ్చరిక. సహనం లేని విదేశీ మతాల కారణంగా మన దేశం ఎన్నో కష్టనష్టాలకు గురైంది. మననుంచి ఏ కవ్వింపు లేకపోయినా, సరి హద్దుల్లో శత్రుదేశసైనికుల ఆగడాలు కూడా ఈ శ్లోకార్థానికి అన్వయించు కోవచ్చు.
యుద్ధాన్ని కూడా కొన్ని ధర్మ సూత్రాల ప్రకారం చేసే మనకు, అధర్మయుద్ధం మాత్రమే తెలిసిన, విదేశీయుల రాక్షసమాయలు అర్థం కాలేదు. ఇలా ఊహించక పోవడం వల్లనే మనం పరాధీనులమయ్యాం. శివాజీ మహరాజ్ వంటి కొద్దిమందే ఆ విదేశీయుల కుతం త్రాలను అర్థం చేసుకొని విజయం సాధించారు.
అమాయకత్వాన్ని వదిలి, అసుర శక్తులపై విజయం సాధించే ఛత్రపతులుగా తయారుకావాలని అ•తరార్థం.
-బి.ఎస్.శర్మ

Review అప్రమత్తులమై వుండాలి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top