ప్రదిక్షణలు ఎందుకు చేస్తారు?

దేవుని ముందు కోరుకున్న కోర్కె బైటికి చెబితే తీరదా ?
భగవంతుడ్ని పూజించినవారు కోరుకొనే కోర్కె ఖచ్చితంగా ఎంతో బలీయమైనదై ఉంటుంది. అలాగే బహు కష్టమైనదీ, మానవసాధ్యం కానిదీ అయి ఉంటుంది. అటువంటి కోర్కె తీరిందంటే అది ఎంతో ఆనందించతగ్గ విషయం. ఆ కోరిక ధనం కావచ్చు, సుఖముకావచ్చు, పదవీకావచ్చు, చక్కని భర్తలేదా భార్యా ఏదైనా కావచ్చు. కోరుకున్న కోర్కెని బయటికి చెబితే విన్నవారు పైకినవ్వుతూ ఆనందంగా చెప్పినా లోలోన జరగకూడదని కోరుకోవచ్చు. అలాంటి కోర్కె జరగకుండా తీరకుండా మానవప్రయత్నం చేయచ్చు. పైకి కనిపించేదంతా నిజం కాదు. మీకు తెలియకుండానే మీకు శత్రువులుండవచ్చు. వారు మీ స్నేహితులే కావచ్చు, అందుకే చెప్పొద్దొంటారు.
మొట్టమొదటి సారిగా జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపీ గరీయసీ అన్నదెవరు?
శ్రీరామచంద్రుడు మానవావతారమెత్తి, పరిపూర్ణమైన మానవునిగా జీవించి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలను స్వయంగా అనుభవించిన తర్వాత తానే ఇలా చెప్పాడు తల్లీ, జన్మించిన ప్రదేశమూ స్వర్గముకన్నా ఉత్తమమయినవి అని, లక్ష్మణ విభీషణాదులతో లంకలో ప్రవేశించిన తరువాత లంకలోని ఐశ్వర్యమూ, వజ్రాల భవం తులను శ్రీరామునికి చూపించి, ‘ఆహా అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమైనది….. ఇక్కడే ఉండి పోవచ్చు గదా….’ అని శ్రీరామునితో అంటే, ఆ సమయాన శ్రీరాముడు మృదుమధురంగా ‘జననీ, జన్మభూమిశ్చ, స్వర్గాదపిగరీయసీ’ అని చెప్పాడు.
చిన్న పిల్లలు పక్క ఎందుకు తడుపుతారు ?
ఊహ తెలియని వయసులో ఏ విషయం గురించైనా చిన్నారులు భయపడడటం వలన, తల్లీ, తండ్రీ పోట్లాడుకోవటం చూడటం వల్లా, బాగా ఒత్తిడికి గురైనప్పుడు, అదే విషయం గురించి ఆలోచించటమువల్ల, అలాగే స్కూల్లో తోటి విద్యార్థులు ఆడుకొను బొమ్మలు తన దగ్గర లేవని బెంగ పెట్టుకోవటం వంటి వాటి వల్ల కూడా పక్క పడుపుతారు. కనుక పిల్లల మనసు తెలుసుకుని ఎప్పటికప్పుడు వారిని అర్థము చేసుకుంటూ వారికి ధైర్యమూ, ప్రేమారంగరిస్తే ఆ అలవాటు క్రమంగా మానేస్తారు. చిన్న తనంలోనే తల్లీ, తండ్రీ ప్రేమా వారికెంతో అవసరము.
విష్ణుసహస్ర నామం చదవటానికి ముందు రుద్ర మోచన చదవాలా ? వద్దా ?
విష్ణు సహస్రనామాన్ని మంత్రానుష్టానంగా చేయాలంటే రుద్రశాప విమోచనాన్ని గురువు ద్వారా మంత్రోపాసనతో స్వీకరించాల్సిందే, పూజకూ, పఠనంకూ, పారాయణమునకు ఈ నియమ నిబంధనలు ఏమీలేదు.
శివలింగం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు ?
శివునికి నిత్యపూజ జరగాల్సిందే. కావున చెయ్యగలిగితేనే శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. శివలింగానికి నిత్యము ఖచ్చితమైన సమయంలో అభిషేకమూ, నివేదన జరగాలి. అలా నిష్టగా చేసే పరిస్థితులు ఈ పోటీ ప్రపంచంలో లేవు. కాని శివలింగాన్ని అలా నిత్య పూజ చెయ్యలేనప్పుడు మహాశివుని ఆగ్రహానికి గురికావటం కన్నా, మీకు దగ్గరిలోని గుడిలో శివలింగాన్ని ఇచ్చివేయటం మంచిది.
గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు ?
‘ప్రదక్షిణం’లో ‘ప్ర’ అన అక్షరము పాపాలకి నాశనము….‘ద’ అనగా కోరికలు తీర్చమని, ‘క్షి’ అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ‘ణ’ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పర మేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణచేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా ! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.
రాహుకేతువులకి అప్రదక్షిణము చేయాలా ?
గ్రహాలకి రాజు సూర్యుడు అన్నీ గ్రహాల మధ్యన ఉంటాడు. చంద్రుడు ఆగ్నేయంగా ఉంటాడు. అంగారకుడు దక్షిణంగానూ, బుధుడు సూర్యునకు ఈశాన్యంగానూ, బృహస్పతి ఉత్తర దిక్కుగానూ ఉన్నారు. తూర్పున శుక్రుడుంటాడు. పశ్చిమ దిక్కున శనైశ్చరుడూ, నైఋతిలో రాహువూ, వాయువ్యంలో కేతువూ ఉంటారు. అయితే గ్రహాలన్నీ ఒకే విధంగా ఉంటే రాహుకేతువులు వేరుగా అప్రదక్షిణంగా తిరుగుతున్నట్టు ఉంటాయి. అయినా మనం ఆయా గ్రహాల పూజల ప్రకారమే చేయాలి.
భార్య, భర్తకు ఏ వైపుగా ఉండాలి ?
సర్వ కార్యాల్లోనూ భార్య భక్తకు ఎడవవైపునే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం ఎక్కడ చెప్పలేదు. పూజలు నిర్వహించేటప్పుడూ, దానధర్మాలూ చేసేటప్పుడు భార్య ఖచ్చితంగా భర్తకు ఎడమ వైపునే ఉండాలి.
కన్యాదానం, విగ్రహప్రతిష్ఠలప్పుడూ భార్య భర్తకుడివైపున ఉండాలి. బ్రహ్మదేవుడు పురుషుడ్ని కుడిభాగం నుంచీ, స్త్రీని ఎడమభాగం నుంచీ సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువు తన భార్య లక్ష్మి దేవిని ఎడమస్థానంలో పదిలంగా ఉంచుకున్నాడు. నిద్రావస్థలో కూడా భర్త భార్యపై కుడిచేతిని వేసి ఆ సమయంలోనూ రక్షణగా చూసుకుంటాడు. భర్త చేతి స్పర్శతో భార్య అంతమైన భద్రతని పొందుతూ సుఖంగా నిద్రిస్తుంది.

Review ప్రదిక్షణలు ఎందుకు చేస్తారు?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top