
డాక్టర్ రామ్ సహానీ
అందరూ ఒకలా ఉండరు. అందరిలో కొందరు భిన్నంగా
ఉంటారు. కొందరు తాము చేసే పనికే పరిమితం అవుతారు. ఇంకొందరు తమ వృత్తితో పాటు మరికొన్ని పనుల్లోనూ ఆరితేరుతారు. తమ ప్రతిభను చాటుకోవడానికి, సేవ చేయడానికి లభించే ఏ అవకాశాన్నీ వదులుకోరు. డాక్టర్ రామ్ సహానీ ఈ కోవకు చెందిన వ్యక్తే. భారతీయ సంతతికి చెందిన రామ్ సహానీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అట్లాంటా సమాజంలో చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన అక్కడి వివిధ సంఘాలు, కమిటీలకు తనకు చేతనైనంత సేవలను అ 3ందిస్తున్నారు. ఆయన జార్జియా సింధి సభకు ప్రెసిడెంట్. అలాగే, శివమందిర్ ఆఫ్ అట్లాంటాకు ప్రెసిడెంట్. జార్జియాలోని ఫిజికల్ థెరపీ అసోసియేషన్‌కు కోశాధికారి (ట్రెజరర్)గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న, ఆయన స్వయంగా ప్రాతినిథ్యం వహిస్తూ సేవలు అందిస్తున్న సంఘాలు, సంస్థలు, కమిటీలు చాలానే ఉన్నాయి. ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరి తలలో నాలుకలా వ్యవహరిస్తున్న డాక్టర్ రామ్ సహానీ ఇంతకీ ఎవరు? ఏం చేస్తుంటారు? ఆయన వృత్తి ఏమిటి?.
డాక్టర్ రామ్ సహానీ, పీటీ, డీపీటీ, ఓసీఎస్, ఎంబీఏ..
ప్రైమాకేర్ రిహాబిలిటేషన్ వ్యవస్థాపకులు. ఇది అట్లాంటా నార్తర్న్ సబర్బ్‌లోని గ్విన్నెట్ కౌంటీలో ఔట్ పేషంట్, ఆక్వాటిక్, ఫిజికల్, ఆక్యుపేషనల్ థెరపీ, వెల్నెస్ ప్రాక్టీస్ సేవలను అందిస్తోది. 2003లో డాక్టర్ రామ్ సహానీ ప్రైమాకేర్ రిహాబిలిటేషన్‌ను ప్రారంభించారు. ఇది మొదట్లో ఇక్కడ ఒక్కటే ప్రారంభం కాగా, ఆ తరువాత కాలంలో గ్విన్నెట్, ఫౌల్టన్ కౌంటీలలో ఏడు చోట్లకు విస్తరించి తన సేవలను అందిస్తోంది. భారత్‌కు చెందిన ఆయన… యూనివర్సిటీ ఆఫ్ బాంబే నుంచి 1986లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఫిజికల్ థెరపీ) చేశారు. 1999 నుంచి అమెరికన్ ఫిజికల్ థెరపీ అసోసియేషన్‌లో బోర్డు సర్టిఫైడ్ ఆర్థోపెడిక్ ఫిజికల్ థెరపీ సేవలు అందించారు. 2010లో ఫిజికల్ థెరపీలో ఆయన అందించిన సేవలకు గాను డాక్టరేట్‌ను పొందారు. 2003లో జార్జియా స్టేట్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్లో ఎంబీఏ గ్రాడ్యుయేషన్ చేశారు. డాక్టర్ రామ్ సహానీ అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యాప్తంగా- న్యూమరస్ కౌంటింగ్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహించారు. ఆర్థోపెడిక్‌లో ఆయన తన అనుభవాన్ని ఉపయోగించి తన సేవలను అందిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అలబామా, సీసీసీఈ నార్త్ జార్జియా కాలేజ్, జార్జియా స్టేట్ యూనివర్సిటీలో ఆయన అడ్జంక్ట్ ఇన్‌స్ట్రక్టర్‌గానూ వ్యవహరించారు. ఇంకా, అక్యూట్ కేర్ హాస్పిటల్లో క్లినికల్ డైరెక్టర్‌గా, ఎన్ఎన్ఎఫ్ యూనిట్లో రిహాబిలిటేషన్ కోఆర్డినేటర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గానూ సేవలందిస్తున్నారు. ఇదే హాస్పిటల్లో ఫిట్నెస్ అండ్ ఆక్యుపేషనల్ మెడిసిన్ పోగ్రామ్ డైరెక్టర్‌గానూ ఉన్నారు. ఆయన ఇప్పటికీ తన క్లినిక్‌లో పేషంట్లకు వైద్య సేవలందించడాన్ని దైవకార్యంగా భావిస్తుంటారు. ఆయన ప్రస్తుతం ఫిజికల్ థెరపీ అసోసియేషన్ ఆఫ్ జార్జియాకు ట్రెజరర్‌గా వ్యవహరిస్తున్నారు.
Review బహుముఖ ప్రజ్ఞాశాలి….