కొత్తపదాలు : స్వయం ప్రకాశం, పరిభ్ర మించు, యుగం, శకం, నవగ్రహాలు.
నక్షత్రాలు, రాసుల గురించి ఇదివరకు తెలుసుకున్నారు. అంతరిక్షంలో సూర్యుడు ముఖ్య మైన గ్రహం అని కూడా నేర్చుకున్నారు. సూర్యుడు స్వయం ప్రకాశం గల గోళం సూర్యుని వల్ల వెలుతురు, వేడివచ్చి జీవరాసులు బ్రతుకగలుగు తున్నాయి. సూర్యుడి చుట్టూ కొన్ని గోళాలు తిరుగుతున్నాయి. వీటిని గ్రహాలంటారు. సూర్యు నితో కలిసి ఇవి తొమ్మిది. వీటినే నవగ్రహా లంటారు.
అవి : 1. సూర్యుడు, 2. చంద్రుడు, 3. కుజుడు, 4. బుధుడు 5. గురుడు (బృహస్పతి) 6.శుక్రుడు 7.శని, 8. రాహువు 9. కేతువు.
భూమి గూడా సూర్యుని చుట్టూ తిరుగు తున్నందువల్ల అదీ ఒక గ్రహం అయినప్పటికీ, మనం భూమిపై ఉన్నందువల్ల మనకు భూమికాక, మిగిలినవే నవగ్రహాలు. రాహువు, కేతువులు కాక, మిగిలిన ఏడు గ్రహాల పేర్లతో ఏడే వారాలు ఏర్పడ్డాయి.
1. సూర్యుడు (రవి) – ఆదివారం
5. గురుడు – గురువారం
2. చంద్రుడు – సోమవారం
6. శుక్రుడు – శుక్రవారం
3. కుజుడు – మంగళవారం
7. శని – శనివారం
4. బుధుడు – బుధవారం
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. తన చుట్టూ తాను ఒకసారి భూమి తిరగడానికి గల కాలాన్ని ఒక రోజు అంటారు. అలా తిరిగేటప్పుడు భూమిలో సగం సూర్యుడికి ఎదురుగా, మిగిలిన సగభాగం వెనకగా ఉంటుంది. ఎదురుగా ఉన్నప్పుడు వెలుతురు వలన పగలు, ఒక రాత్రి కలసి ఒకరోజు అవుతుంది. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఒకసారి అలా తిరగటానికి పట్టే కాలం సుమారు ఒక నెల. ఈ విధంగా నెల ఏర్పడుతుంది. భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి వచ్చే కాలాన్ని సంవత్సరం అంటారు. ఈ విధంగా పగలు, రాత్రి, రోజు, నెల, సంవత్సరం ఏర్పడుతున్నాయి.
తెలుగు సంప్రదాయంలో అరవై సంవత్సరాలు ఉన్నాయి. ఇవి ఒకదాని తరువాత ఒకటి చొప్పున వస్తూ అరవై పూర్తయినప్పుడు, మళ్లీ మొదటి సంవత్సరం నుండి ప్రారంభం అవుతాయి.
Review తెలుగు సంవత్సరాలు – శకాలు, యుగాలు.