ఒకసారి శిష్యులు రమణ మహర్షిని` ‘నేను చేసే కర్మలకు నిజమైన పరిపూర్ణత రావాలంటే ఏం చేయాలి?’ అని అడిగారు.
‘ఏ తెలివితేటలతో పనిలేకుండానే యావత్తు ప్రాణికోటి జీవిస్తున్నా మనిషి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. తనకు వరంగా సంక్రమించిన తెలివితేటలను చేతులారా అజ్ఞానంగా మార్చుకుంటున్నాడు. మనం కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే బాహేంద్రియాలను సహాయ వస్తువులుగానే చూస్తున్నాం కానీ, వాటికి ఆధారంగా జ్ఞానేంద్రియాల రూపంలో ఉన్న భగవంతుడిని గమనించడం లేదు. వాటిని భగవంతుని ఆరాధనకు, ఆత్మసాక్షాత్కారానికి వినియోగిస్తే వచ్చే ఫలితాలు మరో రకంగా ఉంటాయి. కానీ, మనం అలా చేయడం లేదు. ఇది గుర్తించిన రోజు కర్తృత్వం పోయి మన కర్మలో కౌశలం వస్తుంది. అంటే మన కర్మలకు నిజమైన పరిపూర్ణత సిద్ధిస్తుంది’ అని రమణులు వారికి చెప్పారు.
నువ్వు.. నీ కర్మ

Review నువ్వు.. నీ కర్మ.