ధైర్యం గల బిచ్చగాడు

ఒకానొకప్పుడు ఒక గ్రామంలో శౌనకుడు, అభిప్రారి అనే యిద్దరు సాధువులుండేవారు. వారు వాయుదేవుని పూజించేవారు. ఒక మధ్యాహ్నం వారు భోజనానికి కూర్చునే సమ యంలో ఎవరో తలుపు తట్టారు. ఒక బాలుడు ఆకలితో ఉన్నందు వల్ల ఆహారం యిమ్మని అడిగాడు.

‘‘ఇది సమయం కాదు’’ అన్నారు వాళ్లు. ఆ బాలునికి వారు అలా అనడం కొత్త కాదు. చాలామంది అలాగే అంటూ ఉండడం వల్ల అతనికి అలవాటయింది. కాని ఆ బాలునికి ఆశ్చర్యం కలిగింది. ఒక సాధువు యొక్క ఆశ్రమంలో యిటువంటి నిరాశ ఎదురవడం వింతగా అనిపించింది. మళ్లీ యింకొక సారి ఆహారం యిమ్మని ప్రార్థించాడు. ‘‘అయ్యా! మీరు ఏ దేవుని ఆరాధిస్తారు?’’ అని అడిగాడు. వారిలో ఒకరు, ‘‘నీకు మర్యాద తెలియ నట్లుంది సరే. మేము వాయుదేవుని ఆరా ధిస్తాము’’ అని బదులు చెప్పాడు.

‘‘అయితే మీరు ఒక విషయం తెలుసు కోవాలి. గాలి వల్లే ప్రపంచం నిర్మించ బడింది. ఆ గాలిలోనే కలిసిపోతుంది. కనపడే ప్రదేశం లోను, కనపడని ప్రదేశంలోను గాలి చొచ్చుకుని ఉంది.’’ అన్నాడు. సాధువు, ‘‘అది మాకు తెలుసు. నువ్వు కొత్తగా ఏమీ చెప్పలేదు’’ అన్నాడు. ‘‘మీరు యీ ఆహారం ఎవరి కోసం తయారు చేశారు? తెలుసు కోవచ్చా?’’ ప్రశ్నించాడు బాలుడు.

‘‘తప్పకుండా, మేము ఆరాధించే దేవుని కోసం’’ అన్నాడు. ‘‘గాలి అంతటా నిండి ఉంది కాబట్టి నాలో కూడా నిండి ఉంది. ఎందుకంటే నేను కూడా యీ విశ్వంలో ఒక భాగమే కనుక. ఆ వాయుదేవుడే యీ ఆకలితో ఉన్న శరీరంలో ఉండి, మీ ఎదుట నిలబడి ఉంది. ఆహారాన్ని అతుగుతూంది. ‘‘అవును, నువ్వు చెప్పింది యదార్థం’’ అన్నాడు సాధువు. ‘‘అలాగయితే నాకు ఆహారం యివ్వననడం, మీ ఆరాధ్యదేవు డైన వాయుదేవునికి కూడా ఆహారం యివ్వనన డమే కదా? అతని కోసమే కదా మీరు ఆహా రాన్ని తయారు చేసింది?’’ అన్నాడు బాలుడు.

సాధువులు సిగ్గుతో తల దించుకున్నారు. తరువాత ఆ బాలుని గౌరవించి, ఆహారాన్ని యిచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు.
అప్పుడు ఆ సాధువులకి అర్థమయింది. వారు భౌతిక శరీరాన్ని చూసి అలా అన్నారు. అంతకంటే ముఖ్యమైనది ఆ శరీరంలో ఉండే ఆత్మ. అది ముఖ్యం అని వారికి అర్థమయింది.

Review ధైర్యం గల బిచ్చగాడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top