కార్తీక వ్రత విధులు

కార్తిక సమో మాసో న క •తేన సమం యుగంశ్రీ
వేద సద •శం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్శీశ్రీ
కార్తీక మాసంతో సమానమైన మాసం, క•త యుగంతో సమమైన యుగం, వేదానికి సరి తూగే శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవు. ఇదీ స్కాంద పురాణంలోని పై శ్లోకానికి అర్థం. శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసమిది. ఉపవాస నిష్టలకూ, నోములకూ, వ్రతాలకూ ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్ర మైన నెలగా పరిగణించే మాసమిది.
ఈ నెల రోజులూ ప్రతి రోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రాతఃకాల స్నానా లకు ఎంతో విశిష్టత ఉంది. స్నానం పూర్తయిన తరువాత దీపారాధన చెయ్యాలనీ, రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల దగ్గర దీపాలు పెట్టడం ఉత్తమమనీ పెద్దలు చెబుతారు. మాసాలలో అసమానమైనదిగా పేరొందిన కార్తీక మాసంలో ఎన్నో పర్వదినాలున్నాయి. ఈ నెలలో ఆచరించ దగిన అనేక పూజలనూ, వ్రతాలనూ పూర్వులు నిర్దేశించారు. వీటితోపాటు ఆహార నియ మాలనూ, పాటించాల్సిన విధులనూ కూడా బోధించారు. వాటి గురించి…
కార్తీకంలో పర్వదినాలు, సాధారణ దినాలు
కార్తీక స్నానారంభం, ఆకాశదీపం (అక్టోబరు 28), భగినీ హస్త భోజనం (అక్టోబరు 29), నాగుల చవితి (అక్టోబరు 31), నాగ పంచమి (నవంబరు 1), భాను సప్తమి (నవంబరు 3), బ్రహ్మపుత్రా పుష్కరాలు (నవంబరు 5), చిల్కు ద్వాదశి, తులసి వ్రతారంభం, ప్రదోష వ్రతం, శని త్రయోదశి (నవంబరు 9). వైకుంఠ చతుర్దశి (నవంబరు 10), కార్తీక పౌర్ణమి, గురునానక్‍ జయంతి, పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి (నవంబరు 12), బాలల దినోత్సవం (నవంబరు 14), సంకష్టహర చతుర్ధి (నవంబరు 15), బ్రహ్మపుత్ర నదీ పుష్కరాల సమాప్తం (నవంబరు 16), వ•శ్చిక సంక్రమణం (నవంబరు 17), ఝూన్సీ లక్ష్మీబాయి జయంతి, ఇందిరాగాంధీ జయంతి (నవంబరు 19), ఉత్పన్న ఏకాదశి (నవంబరు 22), తిరుచానూరు పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవం ప్రారంభం (నవంబరు 23), ధన్వంతరి జయంతి (నవంబరు 24).
కార్తీకంలో పఠించదగిన స్తోత్రాలు
వామన స్తోత్రం, మార్కండేయక •త శివ స్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం, శ్రీ క •ష్ణాష్టకం, సూర్య స్తుతి, గణేశ స్తుతి, దశావతార స్తుతి, దామోదర స్తోత్రం, అర్ధ నారీశ్వర స్తోత్రం, లింగాష్టకం, బిల్వా ష్టకం, శివషడక్షరీ స్తోత్రం, శ్రీ శివ స్తోత్రం, శివా ష్టకం, మ•త్యుంజయ మహామంత్ర జపం, శ్రీ విష్ణు స్తోత్రం, శివ పంచాక్షరీ స్తోత్రం, తులసీ కవచం, తులసీ షోడశ నామావళి
కార్తీకంలో చేయదగిన వ్రతాలు
శ్రీ తులసీ ధాత్రీ సహిత దామోదర వ్రతం, ఉమాసహిత శంకర వ్రతం, శ్రీ శివ సోమవార వ్రతం, క్షీరాబ్ధి ద్వాదశీ వ్రతం, కేదారేశ్వర వ్రతం, శ్రీ రాధా దామోదర వ్రతం, వ•షోత్సర్జనం, జ్వాలా తోరణం, అర్ధనారీశ్వర వ్రతం, కార్తికేయ వ్రతం, విష్ణు త్రిరాత్ర వ్రతం, చాతుర్మాస్య దీక్షా విరమణ, బలిపూజ.
కార్తీకంలో చేయాల్సిన పూజలు
శివారాధనం, కేశవారాధనం, శక్త్యుపాసనం, గణేశార్చనం, సూర్చార్చనం, సవత్స గోపూజనం, వ•షభ పూజ, అశ్వత్థ చూజ, వట పూజ, తులసి పూజ, ధాత్రీ పూజనం, గంగాది నదీపూజనం, జలస్థాన పూజనం.
కార్తీకంలో చేయదగిన పనులు
కార్తీక ఆకాశ దీపం, వివిధ దానాలు, సాల గ్రామ దానం, కన్యా దానం, కార్తీక పురాణ పఠనం, శ్రవణం, ఉపవాసం, భూశయనం, బ్రహ్మచర్యం, శ్రీహరి కమలార్చనం, సహవ్రతు లతో కలిసి వన భోజనం, తీర్థ యాత్రలు, కార్తిక నిత్య దీపారాధనం, సవత్స గోదానం, సువర్ణ తులసీ వ •క్ష దానం, ఉపవాసం, నక్తం (పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చెయ్యడం), ఏక భుక్తం, అయాచితం, విప్ర పూజన.
కార్తీకంలో చేయకూడని పనులు
పరనింద, గురు నింద, పర ద్రోహం, మాదకద్రవ్య సేవనం, తైలాభ్యంగనం, వ్రత భ్రష్టులతో సంభాషణం, బహిష్ఠులతో సంభా షణం, తల్ప శయనం, పరాన్న భోజనం, ఇత రుల ఎంగిలి పదార్థాల్ని తినడం, గణ భోజనం, గణికా భోజనం, పాచిపోయిన ఆహారం తినడం.
కార్తీకంలో తినదగినవి
ధాన్యం, యవలు (బార్లీ), జొన్నలు, గోధు మలు, కంద, సముద్రపు ఉప్పు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పనస, మామిడి, కొబ్బరి, కరక్కాయ, పిప్పళ్ళు, జీలకర్ర, శొంఠి, ఒక విధమైన ఉసిరిక, నూనెతో చెయ్యని వంట కాలు, బెల్లం తప్ప చెరకు నుంచి వచ్చే మిగిలిన పదార్థాలు.
కార్తీకంలో విడిచి పెట్టాల్సినవి
ప్రాణుల శరీర భస్మం, చర్మంతో చేసిన పాత్రల్లో నీరు, నిమ్మపండు, దానిమ్మపండు, యజ్ఞ ప్రసాదం కానిది, విష్ణువుకు నైవేద్యం కాని ఆహారం, మాడిన అన్నం, మసూరములు, మాంసం- వీటికి ‘ఆమిషములు’ అని పేరు. వాటిని విడిచిపెట్టాలి. వీటితోపాటు ద్విదళ ధాన్యాలు, అవిసె, గుగ్గిళ్ళు, లవణం, ఆన• •కాయ, కళింగ ఫలం, బహు బీజ ఫలాలు, నిర్బీజములైన ముల్లంగి, ఎర్ర ముల్లంగి , గుమ్మడి కాయ, చెరుకుగడ, కొత్త రేగు, ఉసిరిక, చింతకాయ, తేనె, పొట్లకాయ, వంగ, ఉల్లి, వెల్లుల్లి, తెల్ల ఆవాలు.

Review కార్తీక వ్రత విధులు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top