‘మన’ భావనను పెంచే వన భోజనం

మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం. ఇది అత్యంత శక్తివంతం మరియు మహిమాన్వితమైనది. స్నానం, అభిషేకం, అర్చన, ప్రదక్షిణ, దీపారాధన, అన్నసంతర్పణ.. ఇవీ ఈ మాస విశిష్టతలు. ఇవన్నీ పాపనివ•త్తికి మార్గాలు. శత•వులను జయించి, విజయలక్ష్మిని వరించటానికి చక్కటి సాధనం శుభప్రదమైన కార్తీక మాసమని అమరవాణి సందేశంలో వివరించారు.

‘అభిషేక ప్రియశ్శివః’ అనే రుషి వాక్యాన్ని అనుసరించి సూర్యకిరణం సోకే సమయానికి శివునికి అభిషేకం చేయాలి. మారేడు దళాలు శివుడు ఇష్టపడే పత్రాలు. ఈ పత్రాలతో చేసే శివార్చన కన్యాదాన ఫలితము నిస్తుంది. సహజంగా దేవాలయాలలో ‘కార్తీక దీపం’ ఏర్పాటు చేస్తారు. ఈ కార్తీక దీపాన్నే ‘ఆకాశదీపం’ అనీ అంటారు. రోజూ ఆకాశ దీపాన్ని దర్శించటం భక్తులు సర్వపాప విముక్తులు కావటానికి, ఆత్మా నందాన్ని పొందటానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనినే ‘పరంజ్యోతి దర్శనం’ అని కూడా అంటారు.
శివుని చరిత్రను వినటం, చంద్రశేఖరుని గుణాలను కీర్తించటం, నీలకంఠుని పాదాలను సేవించటం, దీపారాధన చేసి ఆ వెలుతురులో శివలింగాన్ని మనసారా ధ్యానించటం వల్ల జన్మ చరితార్థమవుతుంది. ప్రాతఃకాలంలోనే కార్తీక స్నానమాచరించాలి. శివ, విష్ణు ఆలయాలను నిర్మల హ•దయంతో దర్శించాలి. ఆలయ ప్రదక్షిణ చేయాలి. ఉదయం, సాయంత్రం ఎవరి ఇంటిలో వారు దీపారాధన చేసి, దేవాలయాలలో కూడా దీపారాధన చెయ్యాలి. శివాలయంలో దీపారాధనను కార్తీక మాసం చివరి వరకు ఎవరు చేస్తారో అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్వయంగా ప్రజ్వల రూపుడైన పరమేశ్వరుడే నుడివాడు.
పురాణ శ్రవణం.. వికాసవంతం
కార్తీక మాసాంతం వరకు నిత్యం ఆలయాలలో కార్తీక పురాణ ప్రవచనం నిర్వహించాలి. పురాణం వినటం ద్వారా ఆధ్యాత్మిక భావన కలిగి మనిషి వికాసవంతుడవుతాడు. అరిషడ్వర్గాలను జయించటానికి కార్తీక మాసమే సరైనది. అరిషడ్వర్గాలను మించిన శత •వులుండరు. తెనాలి రామక•ష్ణుడు రచించిన పాండురంగ మహత్మ్యంలో నిగమశర్మ ఒక పాత్రధారి. ఇతను కామవశుడౌతాడు. సకల వేద రహస్యాలు తెలిసినా కామంతో మదమెక్కి, పెద్దల మాట వినకుండా జీవనం కొనసాగే క్రమంలో ఆకలికి తట్టుకోలేక భక్తులు శివునికి సమర్పించిన నైవేద్యాలను దొంగతనంగా తీసికొని వెళ్లటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అక్కడ వున్న నైవేద్యాలు చీకట్లో కనపడకపోవటంతో ఒక వత్తిని పెద్దగా చేసి, నూనె పోసి వెలిగిస్తాడు. ఆ వెలుతురులో నైవేద్యాన్ని తీసికొనిపోతుండగా ఒక భక్తుని కాలికి తగిలి, ఆ భక్తుడు వేసిన బాణానికి పడిపోయి చనిపోతాడు. కేవలం శివాలయంలో దీపారాధన చేసినందుకు నిగమశర్మకు శివ సాయుజ్యం లభిస్తుంది.
మానసిక ప్రశాంతతనిచ్చే పంచాక్షరి
శంకరునికి అనేక పేర్లున్నాయి. అందరి కష్టాలను నివారించే ఓంకార నిధి పరమేశ్వరుడు. ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరి మంత్రం శారీరక రుగ్మతలను నివారించి, మానసిక ప్రశాంతతను పొందటానికి అవకాశం కల్పిస్తుంది. ఇక, ఇతిహాసాల ప్రకారం రుద్రాక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివుడు రుద్రాక్షధారి. అవి ఆయనకు ఎంతో ప్రీతికరమైనవి. ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మికత, మోక్షం పొందటానికి రుద్రాక్షలు ఎంతో ఉపక రిస్తాయి. శివుడు జ్ఞాన గంగను శిరసుపై ధరించాడు. అభిషేకంతో అలరింపజేస్తే శివుడు అనుగ్రహంతో జ్ఞానం పొందవచ్చు. సాలగ్రామ దానం చేస్తే కార్తీకమాసం విశేష ఫలితాన్నిస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామ•త ఫలరసాభిషేకాలు, లక్షమారేడు దళాలతో అర్చనలు చేయడం ద్వారా శివ సాయుజ్యం పొందవచ్చు.
మన’ భావనను పెంచే వన భోజనాలు
ప్రక•తి వనభోజనం కార్తీక మాసం పూజా విధుల్లో ముఖ్యమైనది. కార్తీక మాసంలో వన భోజనం ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి ఇవి దోహదపడతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి. వన భోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రక•తిలో మమేకమై అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం. ఆ తరువాత అందరూ కలిసి వండిన పదార్థాలను దేవునికి నివేదించి ఉసిరిక, అశ్వత్థ, బిల్వ తదితర వ•క్షాల నీడలో సామూహికంగా భోజనం చేస్తారు. ఇలా చేయడం వలన ఆయా వ•క్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వ•క్షం నుంచి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో పేర్కొన్నారు. ఉసిరి చెట్టునే ధాత్రీ వ•క్షం, ఆమలక వ•క్షం అంటారు. అందుకే ఈ వన భోజ నానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రీ వ•క్షాల నీడన అరటి ఆకుల్లో కానీ, పనస ఆకుల్లో కానీ పలు వ•క్ష జాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టుకింద భక్తితో భుజిస్తే ఆశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని వేద, పురాణాల వచనం. అంతకు మించిన మానసిక ప్రశాంతత మెండుగా లభిస్తుంది.
వన భోజనం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు, ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయతానురాగాలు పెంపొంది సామాజిక సామరస్యతకు, సమై క్యతకు దోహదం చేస్తుంది. ఆనందానికి సంకేతం పచ్చదనం. దాన్ని పంచుకుంటూ ఆనందాన్ని మనసులో నింపుకొంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో, న•త్య గీతాలతో ఆనందంగా గడుపుతారు. వనంలోకి వెళ్లి ఆ ఉసిరి చెట్టు కింద, తులసి బ•ందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రక•తి అన్రుగహాన్ని, పరమాత్మ అన్రుగహాన్ని పొంది ఇంటికి తిరిగి వచ్చే పక్రియనే వన భోజన పక్రియ అంటారు. వన భోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.
ఔషధ మొక్కలతో భోజనం
ఒకప్పుడు వన భోజనాలకు వెళ్లిన ప్రదేశంలో ఉన్న ఔషధ మొక్కలను ఉపయోగించి చేసిన వంటలను ఆరగించేవారు. ఏ చెట్ల కిందనైతే వన భోజనాలు వండుతున్నారో అవి కూడా ఆధ్యాత్మిక విశిష్టతను కలిగి ఉంటాయి. పాషాణఖేది అనే మొక్క ఆకును కొండ పిండి ఆకు అని అంటారు. దీన్ని పప్పులో వేసుకొని తింటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. మారేడు చెట్టు ఆకు, కాయలు జీర్ణక్రియను ఉత్తేజపరుస్తాయి. వేపచెట్టు గాలి శ్వాసకోశానికి, ఉసిరిక పప్పు లేదా పచ్చడి శ్వాసకోశ వ్యాధుల నివారణలో ఉపయోగపడుతాయి. భోజనం అనంతరం రేగిపండును, భోజన ప్రారంభంలో కానీ, భోజనానంతరం వెలగగుజ్జును తింటే ఎంతో ఆరోగ్య దాయకమని ఆయుర్వేద, ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
వన భోజనం.. ఆరోగ్య భోజనం
పచ్చని చెట్లు, చల్లని వాతావరణంలో ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి భోజనం చేయడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య భావనలు ఉన్నాయి. భారతీయ సంప్రదాయం ఏదైనా ఓ ఆచారాన్ని మనకి చెప్పిందంటే అందులో వైద్య రహస్యం, సామాజిక ప్రయోజనం, వేదాంత విశేషం ఇమిడి ఉంటాయి. అలా విధించిన ఆచారాల్లో ఒకటే ఈ కార్తీక మాస వనభోజనాలు. శ్రావణ, భాద్రపద మాసాల్లో కురిసిన వర్షాలకు నేల మీద ఎన్నెన్నో మొక్కలు పుట్టి కార్తీక మాసానికి గుర్తించగలిగిన ఎత్తుకు పెరుగుతాయి. వాతావరణ పరంగా కార్తీక మాసంలో ఇటు ఎండా, అటు వర్షం ఉండదు. చీకటిపడే వేళకి చలి ప్రారంభం కావచ్చునేమో గానీ, పగలు మంచు పడదు. చల్లగా ఉండే ప్రక•తికి ఈ మాసంలో వచ్చే ఎండ ఒక వింతగా, వనభోజనాలకు అనువుగా ఉంటుది. వనభోజనాలు చేసే టప్పుడు ప్రత్యేకించి ఆ ప్రదేశంలో లభించే కొన్ని ఔషధ మొక్కలను ఆహారంగా తీసుకుంటే అది ఆరోగ్యభోజనం అవుతుందని నిపుణుల మాట.
కార్తీకానికి మించిన మాసం లేదు…
కేశవునితో సమానమైన దేవుడు గానీ, వేదంతో సమానమైన శాస్త్రం గానీ, గంగతో సమానమైన తీర్థం గానీ లేనట్లు కార్తీకమాసానికి సమానమైన మాసం లేదని పురాణాలు చెబుతున్నాయి. పరమపావనమైన హరిహరా దులకు ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో స్నానార్చన జపాదులు, దీపదానాలు, వనభోజనాలు ఆచరించడం మంచిది. వనభోజనాలు కుల, మత విచక్షణ లేకుండా విభిన్న వ్యక్తుల మధ్య సామరస్యతను, మానసికోల్లాసాన్ని, ప్రశాం తతను ప్రసాదిస్తాయి. నగరాల్లో, పట్టణాల్లో ఉండేవారు ఉద్యోగస్తులైనా, విద్యార్థులైనా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని పిక్నిక్‍ పేరుతో సామూహికంగా భోజనాలు చేయవచ్చు. కానీ, కార్తీకమాసంలో అందరూ కలిసి ఏదో ఒక రోజున వనభోజనం చేస్తే ఎంతో ఆరోగ్యదాయకం. యువతీ, యువకులు, చిన్న పిల్లలు తోటల్లో సరదాగా ఆటపాటలతో గడపడం, పెద్దవారంతా కలిసి ఉసిరిక చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని, శివకేశవుల చిత్రపటాన్ని ఉంచి అభిషేకాలు నిర్వహించడం వంటివి పిల్లలలో ఆధ్యాత్మిక నైతికతను పెంచుతాయి. ఇక్కడ నిర్వహించే కొన్ని పూజల అనంతరం వండిన షడ్రసోపేతమైన పదార్థాలన్నింటినీ లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వరులకు నివేదించి హారతి సమర్పించాలి. ఆ తరువాత అందరూ కలిసి ఆ ఉసిరిక చెట్టు కింద విందారగించాలి.
ఆధ్యాత్మిక ప్రశాంతత…
ఇల్లు, వాకిలి విడిచి వనానికి వెళ్లిన మనిషికి ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది. కార్తీక మాసంలో ఇమిడి ఉన్న విశిష్టతల్లో వన భోజనాలు అందుకే ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. వనభోజనాలకు బయలుదేరే ముందు విష్ణుమూర్తికి ప్రతిరూపమైన ఉసిరి చెట్టుకు, లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిచెట్టుకు ఆధ్యాత్మిక కల్యాణం చేసి బయలుదేరాలి. వనభోజన ఆశీర్వాదాలతో కోరికలు తీరడం, పాపాలు తొలగిపోవడం జరుగు తుందనేది పెద్దల మాట. తులసి చెట్టు మానవుడిలో ఆధ్యాత్మిక సౌరభాలను పెంపొం దిస్తుంది. ఉసిరి, తులసి వంటి పవిత్ర వ•క్షాలు మనిషిలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

Review ‘మన’ భావనను పెంచే వన భోజనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top