ఒక్కో పాత్ర.. ఒక్కో విచిత్ర కథ

మహా భారతంలో అష్టాదశ (18) పర్వాలు ఉన్నాయి. వాటిలో నాలుగవది విరాట పర్వం. ఇది అత్యంత హాస్యరసంగా ఉంటూనే అనంతమైన ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించే పర్వం. అందుకే తిక్కన విరాట పర్వం గురించి రాస్తూ.. ‘ఇది హ•దయానికి ఆహ్లాదం కలిగించేది’గా పేర్కొ న్నాడు. ఈ పర్వం ఒక అంతర్నాటకం వంటిది. ఈ నాటకంలోని పాత్రలు, పాత్రధారులు మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతారు. ఈ పర్వంలో పాండవులు మారు రూపాలతో వ్యవహరిస్తారు. అందుకే ఇది విచిత్ర కథావ•త్తంతో కూడిన
పర్వం.
ఈ అంతర్నాటకంలో వారంతా మారు పేర్లతో వ్యవహరిస్తారు. ఇతిహాస వస్తువులోని పాత్రలు, సన్నివేశాలు కథా కథనంలో భాగంగా కనిపించినా, అంతరార్థంలో అవి నిగూఢమైనవి. ప్రతి పాత్ర ఆధ్యాత్మిక సాధనను ధ్వనింపజేసే ప్రతీ కాత్మక సందేశాన్ని అందిస్తాయి. అవి కావ్యగత తత్వానందాన్ని ఆస్వాదింపజేసి బ్రహ్మానందాన్ని పొందే ఆధ్యాత్మిక సాధనామార్గాన్ని ఆవిష్క రిస్తాయి. ఈ పర్వంలో పాండవులు మారు వేషా లతో ఎంతో హాస్యాన్ని స•ష్టిస్తారు. ముఖ్యంగా బ•హన్నలగా అర్జునుడు పోషించిన పాత్ర ఎంతో విషయ జ్ఞానాన్ని చాటుతుంది.
కథలోకి వెళ్తే..
మత్స్యదేశాన్ని పాలించే విరాటుడి కొలువులో పాండవులు ఏడాది పాటు సేవలు చేస్తూ అజ్ఞాత వాసం గడపడం విరాటపర్వ ప్రధాన ఇతివ•త్తం. పాండవులంటే ముక్తిసాధన శక్తులు.
కుంతీదేవి యముడి అనుగ్రహంతో ధర్మ రాజును పుత్రుడిగా పొందింది. ధర్మరాజంటే యమ నియమాది అష్టాంగయోగంతో వెలిగే ధర్మప్రకాశం.
భీముడు వాయుపుత్రుడు. అంటే కుంభక ప్రాణాయామ యోగంతో సాధకుడు పొందే నిర్భయస్థితి. భీముడు అంటే భయం లేనివాడు అని అర్థం. అర్జునుడు ఇంద్ర తనయుడు. ‘రుజ’ శబ్దం నుంచి ‘అర్జున’ శబ్దం పుట్టిందని, అర్జునుడు రుజువర్తనుడని తాత్వికులు చెబుతారు.
మాద్రి అశ్వినీ దేవతల వల్ల నకుల సహ దేవుల్ని కన్నది. ఆ దేవతలు అద్వైత పరమాత్మ వ•త్తులకు ప్రతీకలు.
పాండవ పత్ని ద్రౌపది. ఆమె పేరు క•ష్ణ. సాధకుడి మనసులోని ముక్తి కామనకు ప్రతీకగా ఆమెను వేదాంతులు భావిస్తారు. ఆమె పంచ పాండవుల భార్య. అలా ఆమె పాండవపత్ని కావడానికి పంచేంద్రోపాఖ్యానం కారణం.
పంచసాధనలకు ప్రతీకలు.. పంచ పాండవులు
పాండవుల పుట్టుకను బట్టి ఒకే ఇంద్రుడు అయిదు రూపాలు దాల్చాడని అర్థమవుతోంది. ఆ విషయాన్నే ఈ ఉపాఖ్యానం చెబుతోంది. ఇంద్రుడు మనసుకు ప్రతీక. పాండవులు అంటే అష్టాంగయోగ సాధన, అభయసాధన, రుజువర్తన సాధన, ఐహిక భోగవిరక్తి సాధన, జ్ఞానప్రకాశ సాధన అనే పంచసాధనలు. ఒక మనసే ఈ అయిదు సాధనల్ని గ్రహించిందని అంతరార్థం. విరాట్‍ అంటే వివిధ రూపాలతో ప్రక•తిలో ప్రకా శించే పరబ్రహ్మ తత్వం. విరాటరాజు ఆ తత్వానికి ప్రతీక అయితే, ఆ తత్వాన్ని ముక్తి సాధనాలైన సాత్విక శక్తులు సేవిస్తాయి.
పంచ పాండవులు.. ఐదు లక్షణాల ప్రతీకలు
పాండవులు శమీవ•క్షంపై తమ ఆయుధాలు దాచారు. శమి అంటే శమం. అంటే ఇంద్రియ నిగ్రహం. ఆయుధాలు తామస వ•త్తులు. ఇంద్రియ నిగ్రహంతో తామసవ•త్తులు బయటపడకుండా గుప్తంగా అణచి ఉంచడంగా భావించాలి.
అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరు కంకుభట్టు, బ్రాహ్మణ సన్యాసి. విరాటుణ్ని స్నేహవ•త్తితో సేవిం చాడు. భీముడు వలలుడు. అంటే వంటల వాడు, మల్లుడు. లాక్షణికంగా వ, బ లకు భేదం లేదు. గనుక బలలుడు. తన శక్తి సంపదను రాజుకు సమర్పించుకుని ధర్మరక్షణకు తోడ్పడ్డాడు.
అర్జునుడు బ•హన్నల. స్త్రీపురుష లక్షణాలు లేకపోవడమన్నది పరమాత్మతత్వం వంటిది. నాట్యాచార్యుడిగా, యుద్ధభూమిలో సంహారశక్తిగా కర్మాచరణంతో రాజును సేవించాడు.
నకులుడు అశ్వశిక్షకుడు. పేరు దామగ్రంథి. అశ్వాలు ఇంద్రియాలకు ప్రతీకలు. ఐహిక భోగ విరక్తి వ•త్తిని గట్టిగా ముడివేసి బిగించడం దామ గ్రంథి సాధన.
సహదేవుడు తంత్రీపాలుడిగా గోరక్షకుడిగా వ్యవహరించాడు. గోరక్షణమంటే ఇంద్రియ వ•త్తులను రక్షించి సాధన సాగించడం.
ద్రౌపది మాలిని పేరుతో సైరంధ్రి వేషం ధరిం చింది. రంధ్రం – లోపాన్ని, సీ- నాశనం చేసేది సైరంధ్రి అని ఒక వ్యుత్పత్తి. తనకు ఎదురయ్యే చెడు సంఘటనలను ఎదుర్కొంది. దౌష్ట్యాన్ని నాశనం చేసింది.
ఇలా విరాటపర్వంలో అన్ని సంఘటనలను, సన్నివేశాలను ఆధ్మాత్మిక ద•ష్టితో వ్యాఖ్యానించ వచ్చు. విరాటపర్వం చతుర్థ పర్వమే కాదు, చతు ర్విధ పురుషార్థ ఫలప్రదం కూడా.

Review ఒక్కో పాత్ర.. ఒక్కో విచిత్ర కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top