శివాభిషేకం.. ఫలితం

శివుడు అభిషేక ప్రియుడు. ఏ పదార్థంతో చేసినా ఆయన అభిషేకానికి సంతుష్టడవుతాడు. మహా శివరాత్రి నాడు ఆయనను ఏయే పదార్థాలతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మన పెద్దలు చెప్పారు.
కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివ సాయుజ్యం లభిస్తుంది.
పలు రకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది.
వెండి ధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి.
నవ ధాన్యాలతో శివాభిషేకం చేస్తే ధన, భార్య, పుత్ర లాభం.
పటిక బెల్లపు పలుకులతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది.
ఉప్పుతో శివలింగాన్ని అభిషేకిస్తే సౌభాగ్యం చేకూరుతుంది.
విభూదితో చేసే అభిషేకం వల్ల సర్వ కార్యాలూ లాభిస్తాయి.
బెల్లపు పలుకులతో అభిషేకం చేస్తే అనురాగం, ఆప్యాయత వంటి అనుబంధాలు బలపడతాయి.
వెదురు చిగుళ్లతో అభిషేకం చేస్తే వంశవృద్ధి.
పాలాభిషేకంతో అభిషేకం చేస్తే కీర్తి, సిరి, సుఖం కలుగుతాయి.
మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో అభిషేకం చేస్తే దారిద్య్ర నాశనం.
ఉసిరికాయలతో అభిషేకం చేస్తే మోక్షం.
బంగారు పొడితో అభిషేకం చేస్తే మహా ముక్తి.
అష్టధాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి కలుగుతుంది.
మణులతో, వాటి పొడితో చేస్తే అహంకారం తొలగిపోతుంది.
పాదరసంతో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
ఆవు నెయ్యి, ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుంది
విశేషాల శివరాత్రి
శివుడి జన్మ నక్షత్రం ఆరుద్ర. చంద్రుడు ఈ నక్షత్ర యుక్తుడైనపుడు ఏటా మాఘ బహుళ (కృష్ణ) చతుర్దశి వస్తుంది. అదే మహా శివరాత్రి పర్వదినం.
శైవులు ధరించే విభూతి లేదా భస్మము తయారు చేయడానికి శివరాత్రి ఉద్ధిష్ట మైన రోజని అంటారు.
మాఘ కృష్ణ చతుర్దశి (మహా శివరాత్రి) నాడు ఉత్తర ధ్రువంలోని గ్రహ స్థానాలు అంతా బలమైనవిగా మారతాయి. ఇవి ఉత్ప్రేరకాలుగా పనిచేసి.. మనుషుల్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి సహాయ పడతాయి. అందుకే మహా శివరాత్రి మహా మహిమాన్వితమైనది.
మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తివంతమైన పురాతన సంస్క•త మంత్రాల యొక్క ప్రయోజనాల శక్తి మహా శివరాత్రి నాడు గొప్పగా పెరుగు తుంది.
శివుని నుంచే యోగ సంప్రదాయం ఆవిర్భవించింది. కాబట్టి మహా శివరాత్రి నాడు యోగ, ధ్యానం, తపస్సు వంటివి అభ్యాసం చేస్తారు.
ఏడాది పొడవునా ఏ పూజలూ చేయని వారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వ రుడిని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్టు అనేక పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు మహా శివరాత్రి పర్వదినాన్నే ఎంచుకుంటారు.
మహా శివరాత్రి నాడు శివుడిని జ్యోతి ర్లింగ రూపంలో సేవించాలని అంటారు. రోజంతా ‘‘ఓం నమ:శివాయ’’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
అధర్వణ వేద సంహితలో యుప స్తంభాన్ని పూజిస్తూ చేసే స్తుతిలో మొట్ట మొదటిసారి శివ లింగం గురించి ప్రస్తా వన జరిగిందని అంటారు. ఈ యుప స్తంభం లేదా స్కంభం ఆద్యంత రహిత మైనది. పరమాత్మ రూపమైనది. అటు వంటి లింగోద్భవం జరిగిన రోజు మహా శివరాత్రి.
మహా శివరాత్రికి ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు.

Review శివాభిషేకం.. ఫలితం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top