ఎంత కఠినమైనా ఈశ్వరకృపతో సాధ్యం.

చెల్లాయి
సాయి నివేదితకు …..
కొనియాడ వలెనన్న కోర్కి యేకాని
భాషలోవలనట్టి పలుకులే లేవు;
తెలిసికోవలెనన్న దీక్షయే కాని
బుద్ధి కంతటి స్పుబోధమే లేదు;
వర్ణింప వలెనన్న వాంఛయే కాని
కవితకంతటి భావ గరిమయే లేదు.
శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, ఏకాంతసేవ

భగవంతుణ్ణి గూర్చి వర్ణిస్తూ వేంకట పార్వతీ శ్వర కవులు పై వాక్యాలను పలుకుతారు. •ష్ట్రవ ••ఎవ శ్రీఱఅవ• ••అ, ••••ఱ•ఱ••శ్రీ•, •వ •జూజూశ్రీఱవ• •శీ •వ••తీఱ•వ •శీ•తీ •ఱ••వతీశ్రీ• శ్రీశీఙవ. నీ అందమైన ఉత్తరాలు, అంతకంటే అందమైన ఫొటోస్‍ నీ నుండి అందుతున్నాయి. ఆప్యాయతలను వెదజల్లుతూ, స్వాతి చినుకుకన్న స్వచ్ఛమైన నీ హృదయం భావ వీణాతంత్రులపై ఆలపించే సంగీతం నీ ఉత్తరాల్లో వీనుల విందు చేస్తూంది. నేను సంగీతాన్ని విన గలనే గాని సాగిలబడ్డ నా గుండె వీణియ తీగలు సంగీతాన్ని వెలువరించలేవు. నీకు వినపడేదల్లా – నా జీవన వృక్షం ‘వసంతం’ కోల్పోయి, శిశి రంలో రాల్చుకున్న ఎండుటాకుల గలగలలు. ‘వసంత’ వాత్సల్యజలం వాడిన వృక్ష శాఖలకు వసంతాలను కానుకగా పంపుతూ, లతాంతాం లను విరబూయిస్తుందేమో! వీ.•ష్ట్రఱశ్రీ. ణవస్త్రతీవవ సంపాదించావు. •శీ• ష్ట్ర•ఙవ తీవ•శ్రీశ్రీ• •వ•శీఎవ వీ•••వతీ శీ• •ష్ట్రఱశ్రీశీ•శీజూష్ట్ర•. నీ జీవితంలో ఆధ్యాత్మికతలు జీవన శిఖరాలకు ఎగబ్రాకు తున్నాయి. •శీఅస్త్రతీ••• నీ జీవన నాడులో వినూత్న చైతన్యధారలు పారుతున్నాయి. అవి నీ జీవితంలో అనురాగమందిరాలు నిర్మిస్తాయి. ఆనందమందా రాలు వెదజల్లుతాయి. జీవితాన్ని నిశితంగా ఒక శాస్త్రవేత్తలా విశ్లేషించే సామర్ధ్యం – నీకు అల వడింది. లేకపోతే శాశ్వత సత్యాలు, అశాశ్వత జీవితంలో అంత సులభంగా చేజిక్కవు. అర్థం కావు.

ఉదాహరణకు ఠాగూర్‍ ‘గీతాంజలి’ గురించి ప్రఖ్యాత రచయిత ‘చలం’ మాటలను కొన్ని యథా తథంగా రాస్తున్నాను.
‘‘…ధనం పోగుజేసుకోవడమూ, దాంతో తిండినీ, స్త్రీని కొని అనుభవించటమూ, తన సోదరులపై అధికారమూ ఆశయంగా పెట్టుకుని ఎన్ని పై ఆడంబరాలు మోస్తే అంత ఘనుణ్ణి అనుకునేవాడికి –
‘నేను కోరకుండానే నాకిచ్చిన నిరాడంబరమైన గొప్ప వరాలు –
ఆకాశమూ, కాంతీ, ఈ దేశం, జీవితం, మనస్సు, వీటికి నన్ను అర్హుణ్ణి చేసి, అత్యాశవల్ల కలిగే ఆపదలనించి రక్షిస్తున్నావు’.
అని అంటే ఏం తెలుస్తుంది. వీటన్నిటినీ తన సుఖాలకు ఉపకరణాలనుకుంటున్న మానవుడికి? ఈశ్వరుణ్ణి తొలగించి ఆ పీఠంపై …. ని ప్రతిష్ఠించి ఆమె ముందు తనలోని ఉన్నతమైన విలువల్ని నిత్యమూ బలి సమర్పణ చేస్తున్న ఈ భక్తులకి ‘నా అపజయాల నుంచి బహుమానంగా నేను సంపాయించిన హారాలతో నిన్ను అలంకరిస్తాను’ అన్న మాటలు వుత్త ప్రేలాపన క్రింద ధ్వనించవా?’’
ఆధ్యాత్మికానుభూతి, ఈశ్వరానురాగం, అమృతమయమని పూర్తిగా మరచిపోయినారు. ఈ లోకాన్ని మించిన సత్యం వుందనే తెలీదు.
ఐశ్వర్య మదంతో మత్తెక్కి మాయలోపడ్డ ఈ అల్పమేధస్సులకు ఆ సత్యం బహిర్గతం కాదు. ఈ దృశ్య ప్రపంచమే సత్యం. దాన్ని మించింది లేదు. అనుకుని వారు తిరిగి మృత్యువు పాలబడ తారు. అంటోంది కఠోపనిషత్తు.
‘బలహీనులకీ, బద్దకస్తులకీ ఏ మాత్రం అంద రానిది ఆత్మ సాక్షాత్కారం’ అంటోంది ముండకోప నిషత్తు.
సమస్తమూ అర్పించి అప్రమత్తత లేని దీక్ష వల్ల తప్ప, సాధ్యంకాని ఈ ఆధ్యాత్మిక సాధనకి మహా యోధులే అర్హులు. లోకాలు జయించవచ్చు. ప్రబలకీర్తిని తెచ్చుకోవచ్చు. సర్వ విద్యల్ని సాధించ వచ్చు కాని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు.
••అవ ఎ••• •••వ ఖీఱతీవ ఱఅ శీతీ•వతీ •శీ స్త్రవ• •ఱస్త్రష్ట్ర•్ణ
‘కాంతి కావలిస్తే నిప్పు పట్టుకోవాలి’ అన్నారు జలాలుద్దీన్‍ రూమీ.
ఈ సాధనని అసిధారా వ్రతమన్నాయి ఉప నిషత్తులు. ఈ మార్గం ఎంత కఠోరమైనా, ఈశ్వర కరుణ సాధకుడి వెంట నడుస్తూ వుండటం వల్ల మార్గం మధుర స్వరాలతో లాలిస్తూ వుంటుంది..’’
ఇవీ చలం మాటల్లో కొన్ని. ఏమ్మా! ఇంకేమి రాయాలి? ఇంకేమిటి అనంతపూర్‍ విశేషాలు? అన్నయ్యలు హరి, నాగరాజ్‍ – ఎలా ఉన్నారు? వాళ్ళ ఉత్తరాలు కూడా మధుర శరదృతువులా మీద విరుచుకు పడుతున్నాయి. అమ్మా నాన్నా బావున్నారనుకుంటాను. నీవు ఉదయ్‍కు ముద్దుగా రాసిన ఉత్తరం కూడా చేరింది. చిన్మయజ్యోత్స్నలు వెదజల్లె అందమైన బాబా ఫొటోస్‍ను పంపి నందులకు ప్రతిగా ఏమివ్వాలి? మీరంతా దూరాన ఉన్నా, రోజూ జ్ఞాపకం వస్తూ నిరుపమ మాధురీ నిలయమైయున్న మీ మమతల మయూ ఖాలు మనస్సును తాకుతూనే ఉంటాయి.
దేనికీ దిగులు చెందకుండా, చేయగల్గిన దంతా, చేయవలసినదంతా చేయగల్గిన మేరకు చేస్తూ సాగు. చేరవలసిన ఆనంద తీరాలకు ‘ఆయనే’ చేరవేస్తాడు. బాధల బందీఖానా నుండి ‘ఆయనే’ చెరవిడిపిస్తాడు. తన వ్రేలునిచ్చి, జీవన రహదారుల వెంట నడిపిస్తాడు. జ్ఞానాన్ని గుండెల్లో దాచుకుని గలగలా నవ్వాలి.
ఇంట్లో అందరికీ శుభాకాంక్షలు. త్వరలో మీ మమతల వాకిళ్ళలో వాలుతానని ఆశిస్తూ, నా జీవన శిథిలాలయంలో శర్వరీ తమోరాశిని తరు ముతూ, నా హృదయాంతర వీధులయందు నీవు వెల్గిస్తున్న వాత్సల్య దీపకాంతుల్లో పరవశిస్తూ…..
(శ్రీరామ్‍ సర్‍ వివిధ సందర్భాలలో రాసిన

Review ఎంత కఠినమైనా ఈశ్వరకృపతో సాధ్యం..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top