ఉగాది విశ్వాసాలు

రంగు పూల వసంతం..

వసంతి సుఖం యథా తథా అస్మిన్నితి’ అంటారు. అంటే, వసంతకాలంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అర్థం. నిజానికి సాధారణ పండుగల్లా ఉగాది ఏ దేవతకో సంబంధించిన పండుగ కాదు. కాలాన్ని ఆరాధించే పండుగ. నిరంతరమూ, నిత్యనూతనమూ అయిన కాలాన్ని కొలుచుకుని అనంత కాలగమనంలో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుని మరొక్కసారి దేవుడు ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మరల్చుకునే ప్రయత్నానికి నాంది పలికే పండుగ- ఉగాది. ఉగాది వసంత కాలంలో వస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా పూలు వసంత కాలంలోనే పూస్తాయట. ఎర్రటి ఎండాకాలంలో సుకుమారమైన మల్లెపూలు పూయడం, చుక్క నీరు లేని చోట రసాలు నిండిన మధుర ఫలాలు గుత్తులుగా విరగకాయడం ఈ మాసానికే సొంతమైన ప్రకృతి వింతలు. వసంతం అనే పదానికి ఏడాది అనే అర్థం ఉంది. ఒక్క తెలుగు వారే కాదు.. చాంద్రమానాన్ని పాటించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలూ చైత్ర శుక్ల పాడ్యమిని సంవత్సరానికి తొలి దినంగా భావిస్తారు. కృత యుగంలో కార్తీక శుద్ధ అష్టమిని ఉగాదిగా జరుపుకునే వారట.
త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజు సంవత్సరాది పండుగ వచ్చేది. దానినే మనం ఇప్పుడు అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాం.
ద్వాపర యుగం మొదలైంది మాఘ బహుళ అమావాస్య నాడు. అయితే అన్ని యుగాల ఆరంభమూ వసంత మాసంలోనే జరిగిందని చెబుతారు.
ఆయా యుగాల్లో వసంతం ఆయా మాసాల్లో వచ్చేదట. మోడువారిన చెట్లు చిగురిస్తూ, పచ్చని ప్రకృతి మనిషిని పరవశానికి గురి చేసే కాలం, ఏ యుగంలోనైనా, కొత్త ఉగాదికి నాంది పలికేదిగానే ఉంటుంది
ఏ నెలలో పుడితే
ఎలా ఉంటారంటే..?
తెలుగు నెలలు చైత్ర మాసంతో ప్రారంభమవుతాయి.
మరి, ఏ మాసంలో జన్మిస్తే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారో పరిశీలిద్దామా..
చైత్రం: బలంగా ఉంటారు. త్వరగా నేర్చుకుంటారు.
వైశాఖం: మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
జ్యేష్ఠం: తెలివిగలవారై ఉంటారు. ముందుచూపు ఉంటుంది.
ఆషాఢం: కష్టాలకు బెదరక, అనుకున్నది సాధిస్తారు.
శ్రావణం: ప్రముఖులు అవుతారు. సంప్రదాయంగా జీవిస్తారు.
భాద్రపదం: అందం, కలివిడితనం ఉంటుంది.
ఆశ్వయుజం: దయ గలవారై ఉంటారు. విలాసవంతమైన జీవనం గడుపుతారు.
కార్తీకం: మంచి మాటకారులై ఉండి, ఎదుటి వారిని ఆకట్టుకుంటారు.
మార్గశిరం: పరిశోధనల్లో ఆసక్తి చూపుతారు. ఎక్కువ ప్రాంతాలను సందర్శిస్తారు.
పుష్యం: రహస్యాలను ఎవరికీ చెప్పరు. బాగా సంపాదిస్తారు.
మాఘం: చదువంటే చాలా ఇష్టం ఉంటుంది. మంచి ఆలోచనలు
బ్రహ్మ మంత్రివర్గం
ఏడాదికి తొలిరోజుగా ఉగాదిని ప్రతిపాదించిన బ్రహ్మ ఆ సంవత్సరాన్ని ఎవరు పరిపాలించాలీ, ఏయే శాఖలకు ఎవరెవరు మంత్రులుగా ఆధిపత్యం చెలాయించాలీ అనే వ్యవహారాన్ని నవ గ్రహాలకు అప్పగించాడు. దాని ప్రకారమే ఆయా శాఖల అధిపతులు స్వభావాన్ని బట్టి ఆ ఏడాది వారు ఆధిపత్యం వహించే అంశం ఎలా ఉంటుందనేది నిర్ణయమవుతుంది. ఈ ఏడాది ఎంత వర్షం కురుస్తుందీ; ఏయే పంటలు బాగా పండుతాయి? ధరలు ఎలా ఉండబోతున్నాయి? వంటి అంశాలన్నీ ఈ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాయి. ఈ మంత్రివర్గంలో మొత్తం నవ నాయకులు ఉంటారు. వాళ్లను ఎలా నిర్ణయిస్తారంటే..
చాంద్రమానాన్ని అనుసరించి ఏ వారం ఉగాది వచ్చిందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు.
సౌరమాన సంవత్సరం ప్రారంభమైన రోజు ఏ వారం వస్తే ఆ వారాధిపతి మంత్రి.
సూర్యుడు సింహరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారాధిపతి ఆ సంవత్సరానికి సేనా నాయకుడు.
సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించేటప్పుడు వారానికి అధిపతి సైన్యాధిపతి.
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారానికి అధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి.
సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించే నాటి వారాధిపతి అర్ఘాధిపతి (ధరలకు వాణిజ్యానికీ అధిపతి)
సూర్యుడు ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశించే నాటి వారానికి అధిపతి మేఘాధిపతి.

Review ఉగాది విశ్వాసాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top