తేదీ: దీపావళి (1990)
స్థలం: దీపావళి దరహాసచంద్రికలు నిండిన హృదయాంగణం
సమయం: సమసిపోని కాలప్రవాహంలో వర్తమాన బిందువెక్కడుందో?!
రాగమయి చెల్లాయి రాజశ్రీకి దీపావళి శుభాకాంక్షలతో..
నేను సాధారణంగా ఏ పండగనూ అంతగా పట్టించుకోను. దీపావళి అంటే మాత్రం చాలా ఇష్టం. అందుకు సాపేక్షమైన కొన్ని అసాధారణ కారణాలున్నాయి. గతంలో ఒక దీపావళి రోజున.. అందరూ మధుర మకరంద రసపానమత్తులైన వేళ.. అర్ధరాత్రి .. జీవితానికి అర్థం దొరక్క నైరాశ్యం మనసంతా ఆషాఢమేఘంలా కమ్మినపుడు.. బయటి చీకటి జీవన కుడ్యాలను కూడా కౌగిలించిన సమయం.. ఒంటరిగా, ఎక్కడో దూరంగా.. నులక మంచంపై పడుకుని మనసులోని నలుసులేరుకుంటూ, లక్షల నక్షత్రాలు ప్రయత్నించినా చీకట్లు తొలగని ఆకాశంలాంటి నా జీవితాన్ని నెమరు వేసుకుంటూ, దూరాన టపాసుల వెలుగులు, వాటి చప్పుళ్లు.. ఒక్కసారిగా మధురబాల్య స్మ•తులు మనో ప్రాంగణంలోకి దండెత్తాయి.
‘‘తల్లి కుమారు నెత్తకొని దవ్వుల దాగుడు మూతలాడు జాబిల్లిని జూపి బువ్వ దినిపింపగ’’,
బాల్యంలోని ఆ ఆనందమంతా ఇపుడెక్కడ దాక్కుందో..? ఈ అమావాస్య రాత్రిలో.. అమ్మదరిలో లేదు. దూరాన ఉన్న జాబిల్లి ఇంకా దూరంగా ఎగిరిపోయాడు.
జాలరి విసరే వలలోంచి ప్రతిసారి రంగుల చేప చేజారిపోతుంది. సూర్యోదయం అవుతుంది. ఉదయం మధ్యాహ్నం అవుతుంది. అలాగే ఒపిగ్గా జాలరి వల విసిరి ప్రయత్నిస్తూనే ఉంటాడు.
మధ్యాహ్నం మెల్లగా సాయంత్రంగా మారుతుంది. అయినా రంగులచేప జాడ లేదు. సాయం సంధ్యా చీకట్లు ముసురుకుంటాయి. రాత్రి తన ముసుగును అందమైన ధరిత్రి ముఖంపై విసురుతుంది… జాలరి వల విసిరినట్లు..
జాలరి అలసి పోతాడు. జాలరికి రంగులచేప లభించదు. జాలరి మనస్సు కల్లరి త్రాచులా శిరసెత్తి, పడగవిప్పి బుస కొడుతుంది. ఆ పడగపై కాలం కత్తివేటు పడుతుంది. పగడంలాంటి జీవితం నేల రాలుతుంది. యుగ యుగాల నుండీ ఇలాగే జాలరి రంగులచేపకై పరుగులు తీస్తూనే ఉన్నాడు.
అలెగ్జాండర్లు అశోకులు అ్ర•హాం లింకన్లు
సోక్రటీసులు ప్లేటోలు సాహరాబులు రుస్తుములు
సీజర్లు నెపోలియన్లు చంఘిజ్ ఖానులు
రాజులు మహారాజులు వక్తలు ప్రవక్తలు.
– కరుణశ్రీ
వీరంతా కాలం కనుల ముందు కదలిపోయారు. ఓ రచయిత అన్నట్లు ఏ ఒక్కరూ కాలప్రవాహానికి ఎదురీదలేక పోయారు. కన్నులు మూసికొని కాలగర్భంలో కలిసిపోయారు. రాజులు, సామ్రాజ్యాలు, రత్నఖచిత సింహాసనాలు, సౌధాలు, కిరీటాలు, జలతారు మేలి ముసుగులు – కరాళకాలజ్వాలల్లో కరిగి నీరైపోయాయి. ధరాపరాగాలుగా మారి – స్వరూపాలు కోల్పోయాయి. కాలం క్షణకాలం ఆగదు. – కాలం దుర్నివారం. అది దూరం తెలియని అపారపారావారం… క్షణాలు, దినాలు, మాసాలు, సంవత్సరాలు, యుగాలు, కల్పాలు, కల్పాంతాలు చరచరా సాగిపోతున్నవి. గిరగిరా తిరిగి పోతున్నవి. అసలు జీవనసంద్రంలో రంగులచేప దొరుకుతుందని జాలరికెవరు చెప్పారో?! జాలరి ఎన్ని కోర్కెలు తెగిపోయాయి? ఎన్ని కలలు కరిగాయి? ఎన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి? ఎన్ని సముద్రాల్లో ఎంతకాలం వల విసిరినా రంగులచేప జాడ జాలరికి దొరుకుతుందా?
అక్కట!మేను డస్సె;మొగమ్ముజిగి తప్పెను; ప్రొద్దువాలె;నీ
వెక్కడి కేగెదో తెరువరీ! క్షణమాగుము; మా కుటీర మం
దిక్కడ సేదతీర్చుకొన మించుక సేపు; భవన్నివాసమేదిక్కున నున్నదో! బయలుదేరినదెప్పుడొ! గమ్యమెద్దియో
– కరుణశ్రీ
జాలరి తన వలను అంత స్సంద్రంలోకి విసరాలి. అక్కడ దొరుకుతుంది రంగుల చేప. మనస్సు మరణించగా మిగిలిందే చిన్మయ రూపమైన మనం వెదికే రంగులచేప. ఈ విషయం జాలరికి తెలుసో తెలియదో? తెలియదు! తెలిసినా జాలరి సముద్రసుందరి ఆకర్షణలో పడి ఆమె మనోగర్భంలోకి చేపకై వలను ఎందుకు విసురుతున్నాడో తెలియదు. బహుశా జాలరి జీవనాడుల్లోకి ప్రవేశించి ప్రవహిస్తున్న ‘మాయ’ చేసే పని అదనుకుంటాను.
జాలరి ‘చేప’కై బాహ్యసంద్రాలకై పరుగెత్తక్కర్లేదు. వల విసరటానికి సముద్రాలు, నదులు, చెరువులు దొరకటం లేదని దు:ఖ పడక్కర్లేదు. లేదా సముద్రాలున్నా విసరటానికి వలలేదని బాధ పడక్కరలేదు. కారణం అసలు ‘రంగులచేప’ సముద్రంలో ఉందన్నది అబద్ధం కనుక. ఎవరైనా అలా చేస్తుంటే – వాళ్లను చూసి నవ్వుకోవాలేగాని, మనసును నలుపుకోకూడదు.
ప్రతి జాలరిలో అంతస్సముద్రముంది. అందులో కావలసిన రంగుల చేపలున్నాయి.
మనస్సు శరన్మేఘశకలంలా ఎక్కడెక్కడో తిరుగుతూంది. రాత్రి నక్షత్రాల వలను ఇంకా విసురుతూనే ఉంది. చుట్టూ చీకటి. ఇంతలో నులకమంచంపై కలత నిద్రలోకి జారుకుంటున్న నన్ను లేపుతూ ‘‘•అ•శ్రీవ, •తీ•••వతీ• కాల్చుకుందామా’’ అంటూ ఓ కాన్వెంటు కుర్రాడు వచ్చాడు.
బయటంతా చీకటి. అయినా ఆ అబ్బాయి తన టపాకాయల వెలుగులో పరవశించి పోతున్నాడు. దూరాన బాణసంచాల సంగీతం వినబడుతూనే ఉంది. వెలుగురవ్వలు కనబడుతూనే ఉన్నాయి. ప్రకృతంతా చిక్కబడుతున్న చీకటి. అయినా ప్రజలంతా వాళ్లు వెలిగించుకున్న దీపాల కాంతుల్లో కేరింతలు కొడ్తున్నారు. బయటి చీకటి వాళ్లను భయపెట్టటంలేదు. వాళ్లకు వాళ్లు వెలిగించుకున్న కాంతి జలపాతాలున్నాయి. అందుకే చీకటి అంటే వాళ్లకు భయంలేదు. నక్షత్రాల నయన కాంతుల రాగమాలికలతో తృప్తి చెందుతున్నారు. ఉదయం ఎలాగూ వాళ్ల తలుపు తడుతుంది.
అది సూర్యుణ్ణి వాళ్లకు కానుకగా ఇస్తుంది. కాంతిసంపదలను వాళ్ల ముంగిళ్లలో కుమ్మరిస్తుంది. అందుకే చీకటన్నా వాళ్లకు భయం లేదు.
తాతయ్య తనువు చాలించారని విన్నాను. చాలా బాధాకరమైన వార్త. అయినా భరించాలి. తప్పదు కనుక. మరణం జీవననాటక భరతవాక్యం కనుక. పడగలెత్తే ముళ్ల మధ్య అడుగులు వేయటమే జీవితం. పాతబంధాలు పోతాయి. కొత్త బంధాలొస్తాయి. ఇది సృష్టి లక్షణం. దీన్ని అర్థం చేసుకోవాలి. అంగీకరించాలి. ఆనందించాలి.
జీవననాటకంలో జరిగే సంఘటనలన్నింటినీ ఆనందంగా ఒక ప్రేక్షకునిలా అనుభవిస్తూ పోవాలి. ఇలాంటి అనుభూతి జీవితంలో ఎపుడో ఒకసారి రావాలి. అప్పుడే ఆనందం తాండవిస్తుంది. హర్షం వర్షిస్తుంది.
మీ ఉత్తరం అందంగా, సంక్షిప్తంగా, చాలా బాగుంది. ఉత్తరం రాసేలోగా అలసిన శరీరం, మనస్సును ఆవరించిన సోమరితనం అడ్డువచ్చాయి. ఈలోగా మీరు ఇండియా వస్తున్నట్లు వార్త వచ్చింది. మాతృమందిరంలో మోగబోయే జేగంట – గురించిన వార్త మనస్సును ఇంకా ఆహ్లాదపరిచింది. మీ ఆరోగ్యం మీరు చెప్పినట్లు వినటం లేదని ‘అమ్మ’ నుంచి వార్త. గతం గూర్చిన బాధ, భవిష్యత్తుపైన భయం, వర్తమానంలోని ఆందోళనలను పక్కకు నెట్టి నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి.
భూత, వర్తమాన భవిష్యత్ కాలాలు – భగవంతుని కనుసన్నల్లో మెలిగే ‘బానిసలు’ వాటి గురించి ఏ మాత్రం భయపడకండి. మంచి ఆహారం తీసుకుంటూ, సరియైన మందులు వాడుతూ, ఆరోగ్యం శ్రద్ధతో, జాగ్రత్తగా చూసుకుంటూ విశ్రాంతి తీసుకోండి. మంచి పుస్తకాలు చదువుకుంటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. అమ్మ, రాము అన్నయ్య – మీకు కావలసినవన్నీ ఎలాగూ సమకూర్చుతూ ఉంటారు.
ఔష్ట్రవఅవఙవతీ •ష్ట్రవ ••తీ•వఅ •వ•శీఎవ• •అ•వ•తీ••శ్రీవ, •ష్ట్రవ శీఎఅఱజూశీ•వఅ• ష్ట్ర•అ• •శీఎవ• •శీ శీ•తీ తీవ•••వ. ఖీశీతీ ష్ట్రవ•ఙవ్ణ• •••వ •శ్ణీ• ష్ట్ర•ఙవ •అ• •శీ••• ••శీ•• ఱ•.
మాతృత్వపు మధురిమల్లో తేలుతూ సంతోషంగా ఉండండి.
మీ బాబు చిరునవ్వుల పసిడి కాంతుల్లో మీరు పులకరించాలి. చిదిమితే తేనె చిన్కులు రాల్చే లేత బుగ్గలతో, అమృత జల్లులు చిల్కరించే బోసి నవ్వుల్తో – బాబు తప్పటడుగులు వేస్తూ అందర్నీ ఆనందపర్చాలి. ఆ ఆనందం మీ జీవనప్రాంగణంలో మాతృత్వపు దీపపంక్తుల్ని దిద్ది తీర్చాలి. ఓ కవి అన్నట్లు..
కారు చీకట్లు చరచర పారి పోవ
ఇంట బయటను దివ్వెలపంట పండె;
తళుకు లొలుకు నక్షత్ర మండబలముతోడ
ఆకసము నేల పయి దిగినట్లు తోచె.
మన అందరి జీవితాల్లో చీకట్లను ప్రత్యూషకాంతులు తరుముతాయి. నవ వసంతం మన సొంతమవుతుంది. ఆర్ద్రమానవ పులకితాంతరానందాశ్రువాహినీ భరితులమవుతాము. రసాప్లావితసుధా మధుర భావతరంగాలు మన హృదయాలను నింపుతాయి. విషాద నరకసంహారం చూస్తాము. సంతోష సత్యాకృష్ణులను దర్శిస్తాము. ఆనంద దీపకాంతుల కరస్పర్శలో పరవశిస్తాము.
మీ కమ్మని కలలపంటలు పండుతాయి.
మాతృ మందిరమ్ములో మరిన్ని జేగంటలు మ్రోగుతాయి.
అవునూ రష్యా విశేషాలేమిటి? అక్కడ అంతా బాగున్నారనుకుంటాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పండి. అమ్మకు నమస్సులు. రాము మిగతా అందరికీ శుభాకాంక్షలు. మీకు, చెల్లాయి మంజులకు ప్రేమాశీస్సులు +
శుభా కాంక్షలు.
ఇంకేం రాయాలి! భావాలను మోసే మనసు అలసిపోతూంది.
యాంత్రిక జీవన తాంత్రిక శక్తులకు మనసు లొంగుతూంది.
ప్రొద్దున్నే స్నానమాడి సరస్సునంతా స్మ•తులపరిమళభరితం చేసే తామర పువ్వులా మీ భావిజీవితం వికసించాలని కోరుతూ, చెల్లాయి రాజశ్రీ మమతల శాద్వలాల అమలిన హాయిలో ఇలాగే ఎల్లవేళలా పరుగులెత్తాలని కాంక్షిస్తూ…
– ప్రేమాశీస్సులతో,
అన్నయ్య శ్రీరామ్




























































































































































































































































































































































































































Review శ్రీరామ్ గారి లేఖలు.