నేర్చుకుంటే ఎన్ని పాఠాలో..!

తేది : రాహువు కోరల్లో చిక్కిన చంద్రుణ్ణి రక్షించ డానికి వెడుతున్న రోజు
సమయం : ప్రపంచాన్ని నా పంచేంద్రియాల పరిష్వంగంలో ఒదుగుకుంటున్న వేళ
స్థలం : నీ మమతల కాంతులు, దీపావళి మతాబుల్లా, నా మనస్సును ఆక్రమించిన చీకట్లను త•రుముతున్న చోట.
మిత్రుడు
శివారెడ్డికి …
నా తరుణ స్నేహలతికలవాడు పైకి
ప్రాకలేక దిక్కులు సూడ; నీకరాలు
సాచి లేత రేకులకు కెంజాయలద్ది
మించు పందిళ్లపైకి ప్రాకించినావు
-సి. నారాయణ రెడ్డి
ఎలా తెల్పను నా కృతజ్ఞతలు
ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాననా? నీ ఆలోచన. ‘ప్రస్తుతం’ నాకెపుడూ అప్రస్తుతమే. అయినా నీ కొరకు చెప్తున్నాను. •× ••అ• •శీ ••ఱఎ శ్రీఱ•వ • •ఱతీ• శీఅ •ష్ట్రవ •శీ•ఎ శీ• • ••తీవ•ఎబీ × ••అ• •శీ •శ్రీశీ•• శ్రీఱ•వ • శ్రీ••స్త్రష్ట్ర •తీశీఎ •ష్ట్రవ శ్రీఱజూ• శీ• • •తీవ•ఎ. × ••అ• •శీ •శీ•అ• •ష్ట్రవ •••తీ• •ష్ట్రఱ•ష్ట్ర •తీవ శ్రీఱ•వ ఱఎఎశీతీ••శ్రీ అంటే ఆకాశం నల్లబల్లపైన భగవంతుని ‘అదృశ్యహస్తం రాసిన అమృతాక్షరాల్లా’ ఉన్న నక్షత్రాలను లెక్కించటానికి ప్రయత్నిస్తున్నాను.
ఇవీ నేను చేస్తున్న పనులు. ఇవన్నీ సాధ్యమా? సోమరి అసాధ్యాల వైపు పరుగు పెట్టడం భావ్యమా? అధిక ప్రసంగం? పొగరుకాకపోతేనూ? అయినా ఈ గర్వాంధుడు ఇంకా ఏం చేయాలను కున్నాడో తెలుసా? ఒక వక్తయై, ఒక మహాప్రవక్తయై చీకటి కుహరాల్లో చిక్కుకున్న మానవత పై ప్రభాత కిరణ వర్షాలను కురిపించి, అభ్యుదయపథాలపై నడిపిస్తాడట! ఇదీ వీడి వాగుడు! ఇంకా ఏమి పేలుతున్నాడో తెలుసా?!
తన గుండెల్లో భగభగమండే అఖండ ఆధ్యాత్మిక జ్యోతుల వెలుగులతో ప్రపంచాన్ని కమ్ముకున్న అజ్ఞానాంధకార మేఘాలను దిక్కుల కొసల దాకా తరుముతాడట. వీడి మొఖం! ఎలక్ట్రిసిటీ ఫెయిల్‍ అయితే తన రూంలో కొవ్వొత్తి వెలిగించుకోవటం తనకు చేతకాక, భార్యను కేకవేసే బడుద్దాయి. వీణ్ణి నమ్మకు! నేను అసలు చేస్తున్న పని – నీ పెదవుల లోపల ఒదిగిన నవ్వుల సుధాస్రవంతుల్లో జలకా లాడుతున్నాను. శిశిరం నుంచి వసంతానికి, చీకటి నుంచి ప్రభాతానికి, నిరాశనుంచి ఆశాశిఖరానికి, అశ్రుజలధి నుంచి ఆనందతీరానికి నడుస్తున్నాను.
ఇంతకూ నీవెలా ఉన్నావు? నీవెలా ఉన్నావో నాకు మాత్రం తెలియదు కాని నాకు మాత్రం నీవు, ఓ కవి అన్నట్లు, ఇట్లా ఉంటే బాగుంటుంది:
‘‘పాలసంద్రం పొంగి నింగివంటినట్లు
పండు వెన్నెల నింగిని దిగి నేల వాలినట్లు’’.
అలా ఉండాలి తెలుసా! నీ జీవితం – గులాబీల స్నిగ్ధత్వంతో, పారిజాతాల పరిమళాలతో, సన్న జాజుల సౌరభాలతో – నిండాలి. రోజుల విరజాజు లపై నడుస్తూ, పెదవుల నుండి ముగ్ధ మనో హర మధురదరహాసశరశ్చంద్రికలను వెదజల్లాలి. లేదా:
‘‘సాగరగర్భంలోని బడబానలం
సాగే కెరటాలకేం తెలుసు?’’
అని తిరిగి ప్రశ్నిస్తావా?!
ఏది ఏమైనా ఒక్క విషయం మాత్రం గుర్తుం చుకో
నిన్ను మింగే తీపి కన్నా
నీవు మింగే చేదు మిన్న
– సి. నారాయణ రెడ్డి
అంతెందుకు నేనేం చేస్తున్నానో చూడు!
అమావాస్య రాత్రిని
నిందించలేను
దాని గర్భంలో దాగిన
సహస్ర కిరణపిండం కోసం
ప్రతిక్షణం
నా ప్రతీక్షణ
– సి. నారాయణ రెడ్డి
ఈనాడు విన్పిస్తున్న ‘‘నిప్పుల ఉప్పెనల గుండెల చప్పుడు’’ రేపటి కొత్త జగతి’లోని ‘కోట్ల గొంతుల వజ్రగీతం’ అని గట్టిగా తెలుసుకో! ‘విత్తనాన్ని చీల్చిన మొక్కలో’, ‘విహాయసంలో పొడిచిన చుక్కలో’ నేర్చుకుంటే ఎన్ని పాఠాలో!! వాటి కొరకై భగవంతుణ్ణి ప్రార్థించటమో, భగవద్గీతను పఠించటమో చేయకు! ప్రకృతిని పరిశీలించు షేక్స్ పియర్‍ ‘లా! లా (•••) చదవకు జీవన సూత్రా లను అర్థం చేసుకోవటానికి కీ (ఖవ•) ఇవ్వు మొద్దు బారిన మేధస్సు‘కు’కూ (•శీశీ) ంటూ కోయిలల పాటలతో శృతి కలు‘పు’. ‘పూ – పూ (•శీశీష్ట్ర-•శీశీష్ట్ర) అంటూ ‘ఛీ’ కొట్టకు ప్రకృతి పాఠాల్ని. పురి విప్పిన మయూరం, వర్షించే మేఘం వికసించిన వసంతం, ఫె•షించే సముద్రం, భాసించే సూర్య బింబాలు, గళ మెత్తే కలకంఠం, గలగల సాగే జలపాతం – ఇవన్నీ మన గురువులు కావా? ప్రయత్నించు, పరిశ్ర మించు – నీ జీవితంలో విజయదశమి వెళ్లి విరుస్తుంది. మొక్క మహావృక్షం కావటానికి, చుక్క సుధాంశుబింబం కావటానికి, శిల శిల్పం కావ టానికి – ఎంతో కృషి, ఎంతో తపన, ఎంతో మథనం అవసరం. ఇప్పటికి పాతిక భాగం ఉత్తరం పూర్తయింది. కాని ఇపుడే అకస్మాత్తుగా అను కోని పెద్ద పని వచ్చిపడటం వల్ల ఉత్తరాన్ని ముందుకు లాక్కెళ్ళలేక పోతున్నాను. అసలు చెప్ప వలసిన విశేషాలు చెప్పనే లేదు – ••తీ••గా మధ్యలో ముగిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి. వెంటనే కదలాలి – ఉంటాను
=వజూశ్రీ• •శీశీఅ.
కోరు కోవోయ్‍ మనిషీ
కొండ వాగు అనురాగాన్ని
తాను చేరింది ఉప్పునీరైనా
తాదాత్మ్యం పొందాలని
-సి. నారాయణరెడ్డి
మీ శ్రీరామ్.

Review నేర్చుకుంటే ఎన్ని పాఠాలో..!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top