త్రిమూర్తి స్వరూపంగా కొలువుదీరి, భక్తుల కోర్కెలను ఈడేర్చే స్వామిగా నిత్య పూజలు అందుకుంటున్నాడు అన్నవరంలో వెలసిన అనంతలక్ష్మీ సత్యవతీ సమేత శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామి. ఈ స్వామి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్నా.. అన్నవరంలో నవ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా.. వైవాహిక బంధంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఏటా వైశాఖ మాసంలో నిర్వహించే స్వామి కల్యాణోత్సవం (2026, ఏప్రిల్ 27, వైశాఖ శుద్ధ ఏకాదశి, సోమవారం) చూసి తరించాల్సిందే..
పంపానదీ తీరంలో.. రత్నగిరి కొండపై వెలసిన అనంతలక్ష్మీ సత్యవతీ సమేత శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామి దర్శనం సకల శుభాలనూ కలిగిస్తుంది. ఆంధప్రదేశ్‍లోని కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రమని కూడా పిలుస్తారు. స్వామి మూల భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో మహేశ్వరుడు, పై భాగంలో విష్ణుమూర్తి కొలువుదీరగా, ఆలయ నిర్మాణం యావత్తూ రథాకారంలో దర్శనమిస్తుంది.
అంకుడుచెట్టు పొదలో..
పురాణాల ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకటైన మేరు పర్వతం భార్య మేనక ఒకనాడు మహా విష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేసిందట. దాంతో స్వామి మేరు, మేనక దంపతులకు భద్రుడు, రత్నాకరుడు అనే ఇద్దరు కుమారులను ప్రసాదించాడట. భద్రుడు విష్ణుమూర్తి అనుగ్రహంతో రామచంద్రమూర్తి నివాస స్థలమైన భద్రాచల శిఖరంగా మారితే.. సత్యనారాయణ స్వామి రత్నాకరుడిపైన వెలిసాడని ప్రతీతి. ఇది జరిగిన కొన్నాళ్లకు ఇద్దరు భక్తులకూ స్వామి ఒకేసారి కలలో కనిపించి తన ఉనికిని తెలియచేశాడ. ఆ మరునాడు వాళ్లిద్దరూ కలిసి అన్నవరం చేరుకున్నప్పుడు అంకుడు చెట్టు పొదలో స్వామి పాదాలు కనిపించాయట. వెంటనే ఆ పొదను తొలగించి అక్కడున్న స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకు వచ్చి ఆలయాన్ని నిర్మించి అందులో స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కథనం.
రెండంతస్తుల్లో ఆలయం
ఈ ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తు భాగంలో నారాయణ యంత్రాన్నీ, పై భాగంలో దేవతామూర్తులనూ దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీసత్యనారాయణ స్వామి అనంతలక్ష్మీ, సత్యవతీ-పరమేశ్వర సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి రాముడు క్షేత్రపాలకుడిగా, వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లు క్షేత్ర రక్షకులుగా ఉంటారు. ఈ క్షేత్రంలో రెండుచోట్ల దుర్గ ఆలయాలనూ, కొండపైన సీతారామచంద్రమూర్తి గుడినీ దర్శించుకోవచ్చు. అన్నవరంలో గోధుమలూ, నెయ్యీ కలిపి చేసే స్వామి
ప్రసాదానికి విశేషమైన గుర్తింపు ఉంది.
పెళ్లిళ్లూ, వ్రతాలకు ప్రసిద్ధి
వివిధ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది భక్తులు ఇక్కడ పెళ్లిళ్లూ లేదా నవదంపతులుగా సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేయించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం తెలిసిందే. అలా వ్రతం చేయించుకునే భక్తులు కేవలం కొబ్బరికాయలూ, అరటిపండ్లూ తెచ్చుకుంటే.. ఇతర ఏర్పాట్లన్నీ దేవస్థానమే చేస్తుంది. ఇక, స్వామి వారికి రోజు వారీ చేసే పూజలు ఒక ఎత్తయితే, వైశాఖ మాసంలో శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు నిర్వహించే కల్యాణోత్సవం మరో ఎత్తు. కన్నులపండువగా జరిగే స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా తరలివస్తారు. ఈ సమయంలో నిర్వహించే ప్రతి ఘట్టం నయనానందకరంగా ఉంటుంది. ఈ ఏడాది, అంటే 2026 సంవత్సరంలో అనంతలక్ష్మీ సత్యవతీ సమేత శ్రీసత్యనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం ఏప్రిల్ 27, సోమవారం, వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు అంగరంగ వైభవంగా జరగనుంది.
సత్యదేవుని కల్యాణానికి సీతారాములే పెళ్లిపెద్దలు
కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం స్వామినీ, దేవేరినీ వధూవరులుగా అలంకరిస్తారు. అదే విధంగా అర్చకులూ, పండితుల బృందం రెండు వర్గాలుగా ఉండి స్వామి – దేవేరుల కీర్తి ప్రతిష్ఠలనూ, గుణగణాలనూ ఛలోక్తులతో కీర్తించే విధానం ఆద్యంతం అలరించేలా సాగుతుంది. అలాగే తాంబూలాలు మార్చుకుని శుభ ఘడియలను నిర్ణయించే వైనం చూసి తరించాల్సిందే. ఆ మరునాడు రాత్రి ఆనవాయితీ ప్రకారం గ్రామంలోని విశ్వబ్రాహ్మణుడి వద్దకు వెళ్లి స్వయంపాకం ఇచ్చి మంగళసూత్రాలూ, యజ్ఞోపవీతాన్ని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ తంతు పూర్తయ్యాక అరుంధతీ నక్షత్ర దర్శనం, నవ దంపతులకు పండితుల చేత ఆశీర్వచనం, వన విహారం, పుష్పయాగం వంటివన్నీ ఎంతో ఆసక్తికరంగా నిర్వహిస్తారు. ఈ ఘట్టంలోనే సత్యదేవుడికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సీతారాములను ఆంజనేయ వాహనంపైన, సత్యదేవుడిని గరుడ వాహనంపైన, అమ్మవార్లను గజవాహనంపైన ఊరేగిస్తారు. అలాగే రావణబ్రహ్మ వాహనం, పొన్న వాహనంపైన కూడా దేవతామూర్తులను ఊరేగించడం, రథోత్సవం వంటివీ ఈ కల్యాణంలో ప్రధాన ఘట్టాలు.
ఎలా వెళ్లాలి?
అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి వారి ఆలయం ఆంధప్రదేశ్‍లోని కాకినాడ జిల్లా అన్నవరంలో ఉంది. హైదరాబాద్‍తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచైనా ఈ ఆలయానికి చేరుకోవడానికి రైలు, బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
కల్యాణం చూతము రారండీ!
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిని పెళ్లి కొడుకుగా చేయడం, విఘ్నేశ్వర పూజ, ముత్తయిదువులకు వాయనాలు ఇవ్వడం, రాత్రి పెళ్లి పెద్దలు సీతారాములు ఆంజనేయ వాహనంపై గ్రామంలోకి వెళ్లి సత్యనారాయణ స్వామి వారి దివ్య కల్యాణోత్సవానికి గ్రామంలోని భక్తులను, యాత్రికులను ఆహ్వానించడం.. వంటివన్నీ నేత్రపర్వంగా సాగుతాయి. సాధారణంగా ఈ కల్యాణోత్సవం ఆరు రోజుల పాటు జరుగుతుంది.
గతంలో స్వామి వారి కల్యాణం ఏటా మాఘ శుద్ధ ఏకాదశి (జనవరి – ఫిబ్రవరి) నాడు జరిగేదట. కానీ, భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం ఆ తేదీని వైశాఖ శుద్ధ ఏకాదశి (ఏప్రిల్ – మే)కి మార్చారు.
ఇక, ఈ ఏడాది 2026లో వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు అంటే ఏప్రిల్ 27న జరిగే కల్యాణోత్సవంలో ఏ రోజు ఏ తంతు నిర్వహిస్తారంటే..
వైశాఖ శుద్ధ ఏకాదశి (ఏప్రిల్ 27):
శ్రీసీతారాముల వారి సమక్షంలో, వారే పెళ్లిపెద్దలుగా శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కల్యాణం వైభవోపేతంగా జరుగుతుంది.
వైశాఖ శుద్ధ ద్వాదశి:
స్థాలిపాకం హోమం నిర్వహిస్తారు. అనంతరం స్వామి దంపతులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయిస్తారు. ఆ రాత్రికి రావణ వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు.
వైశాఖ శుద్ధ త్రయోదశి:
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కల్యాణ సదస్యం, శ్రీరామ సభాపతి, పండితసభ, మహదాశీర్వాదం, సభా సత్కారం వంటివి పగటి పూట నిర్వహిస్తారు. రాత్రికి స్వామి వార్లను పొన్న వాహనంపై ఊరేగిస్తారు.
వైశాఖ శుద్ధ చతుర్దశి:
రత్నగిరికి ఉత్తరాన ఉన్న తోటలో ప్రభువును విహరింప చేస్తారు. అనంతరం తిరిగి రత్నగిరికి తీసుకువస్తారు. మహా నివేదన, ప్రభువు సన్నిధిలో ప్రత్యేక వీణ ప్రదర్శన ఉంటాయి. రాత్రి రథోత్సవం నిర్వహిస్తారు.
వైశాఖ శుద్ధ పూర్ణిమ:
చక్రతీర్థం, నాకబలి, స్వామికి శ్రీపుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తారు































































































































































































































































































































































































Review తిథి ప్రత్యేకం.