‘పడవెళ్లి పోతోందిరా..’
ఈ పాట వినని తెలుగు వారు ఉండరు. అదొక పాట కాదు. మన జీవన విధాన బాట. అందుకే కాబోలు ఆ పాట తరతరాలుగా మన జీవితాలను ఏదో ఒక సందర్భంలో, ఏదో సమయంలో ప్రభావితం చేస్తూనే ఉంది.
‘భక్త తుకారాం’ చిత్రంలోనిదీ పాట. మరాఠీ భాషలో పాండురంగనిపై అభంగాలు రాసి చరితార్థుడైన పరమ భాగవతుడు తుకారామ్. అగ్రవర్ణపు అడ్డంకులను చీల్చుకుంటూ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు. అందులో ‘పడవెళ్లి పోతోందిరా.. ’అనే అభంగమూ ఒకటి.
మానవునికి చేయవలసిన పనిని వదిలి వేరే వాటి మీద దృష్టి పెట్టడం బాగా అలవాటు. మన గమ్యం, మన లక్ష్యం ఆ పరమాత్ముని అనుసరించడమే. ‘జీవితాన్ని ఏ క్షణంలోనూ వృథా చేసుకోకు. పరమాత్ముడు నీకిచ్చిన సమయం ముంచుకొస్తోంది. ఇది గమనించు’ అని హెచ్చరించటమే ఈ పాట లక్షణం.
ప్రతి యుగాంతంలోనూ జలప్రళయం వస్తుందని నమ్మిక. అందుకే ఆ ప్రళయాన్ని సూచిస్తూ
‘పడవెళ్లి పోతోందిరా ఓ మానవుడా
దరిచేరే దారేదిరా నీ బతుకు కెరటాల పాలాయెరా..’
సాక్షాత్తూ ఆ జల ప్రళయంలోనే ఆ పండరినాథుని పరివారమే కొట్టుకు పోయిందే.. నీవెంత? అందుకే దరిచేరే దారి వెతుక్కో మానవా అని తుకారామ్ ఈ అభం గంలో హెచ్చరించాడు.
చిన్న చిన్న చీమలకు చక్కెర దొరుకును
పెద్ద మనుషులకు ఉప్పే కరువు..
దొడ్డమానులను కూల్చు తుఫాను
గడ్డిపోచలను కదల్చగలదా?
అణిగిమణిగి ఉండే వారే అందరిలోకి ఘనులు
ఎంత లోతైన ప్రశ్న? ఎంతటి అద్భుత వర్ణన? బాగా ఎదిగామని విర్రవీగే వారు కుప్పకూలిపోతారని తుకారామ్ హెచ్చ రించాడు.
ఆయన అభాంగాలలోకి పరకాయ ప్రవేశం చేసి చక్కని తెలుగులో తెనుగీకరించారు దీనిని ‘పడవెళ్లి పోతోందిరా’ పాట రూపంలో దాశరథి గారు. మరాఠీ భాషతో దాశరథికి ఉన్న పరిచయం తుకారామ్ మనసును ఆవిష్కరించ డానికి కారణం అయ్యింటుంది.
గాయకుడు రామకృష్ణ తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. నిజానికి ఆయన సినిమాల్లోకి వచ్చిన కొత్త. అందులోనూ ఘంటసాల గారు ఈ సినిమాలోనే, ‘ఉన్నావా.. అసలున్నావా..’ వంటి ఎమోషనల్ గీతం, ‘ఘనా ఘనా సుందరా..’ వంటి పరమ సాత్విక మైన భక్తి గీతం, ‘భలే భలే అందాలు సృష్టిం చావు..’ వంటి జలపాత సదృశ్యమైన పాట పాడితే.. ఆ పాటల మధ్య నిలబడి పది కాలాల పాటు నిలబడే పాట పాడాడు రామకృష్ణ.
పడవ లాగడంతో ఈ పాట మొదలవు తుంది. ఈ పడవ లాగుడు దృశ్యాలు ఇప్పటికీ ఉన్న కొన్ని తరాల వారికి పరిచయమైనవే. ఊరి మధ్యలో ఉన్న కాలువలపై పడవలు ప్రయాణించే దృశ్యాలు ఎంతమందిచూశారో? ఎంతమందికి గుర్తుందో?
ఇప్పుడు అసలు కాలువలే లేకపోవడం విధి విచత్రం. ఒకవేళ ఉన్నా అవన్నీ పారేసిన ప్లాస్టిక్ సామగ్రితో నిండిపోయి కనిపిస్తున్నాయి.
మరి, మన ప్రాప్తం ఏ తీరానికో.. ఏ దరికో. ఏ దశకే..
ఇది చదివిన వారు ఒక్కసారైనా ‘పడవెళ్లి పోతోందిరా..’ పూర్తి గీతాన్ని వినడానికి ప్రయత్నించండి.
ఆ గీతం. అందులోని మార్దవం, అందులోని అర్థం, పరమార్థం.. అవగత మయ్యే కొద్దీ శరీరం జలదరిస్తుందంటే అతిశయోక్తి కాదు.
ప్రళయం ముంచుకొస్తుంది.. త్వరపడి పరమాత్ముని వేడుకుని అందులో నుంచి బయటపడే మార్గం వెతుక్కో అనేది ఈ గీత సారాంశం. అక్కినేని, అంజలి ఈ సి
Review దరిచేరే దారేదిరా.