మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా
ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.
‘జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టు’’
పూర్వ కాలంలో సన్యాసులు ఒంటికి బూడిద రాసుకునే వారు. ఒక సారి ఓ సన్యాసి మరో సన్యానికి ఉప కారం చేశాడట. ఉపకారం చేసిన సన్యాసి.. ‘అయ్యో కృతజ్ఞతగా ఇద్దా మంటే నా దగ్గర ఏమీ లేదే’ అంటూ ఆవేదన చెందాడట. దానికి రెండో సన్యాసి.. ‘అన్నింటినీ వద్దనుకునే కదా మనం సన్యాసులం అయ్యాం. మన దగ్గర ఏముంటుంది? బూడిద తప్ప..’ అంటూ నవ్వుతూ బదులిచ్చాడట. అప్పటి నుంచి ఈ ప్రయోగం సామెతగా స్థిరపడిందని అంటారు.
ఎందుకూ కొరగాని ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఉన్నా ఒక్కటే. కలిసి ఉన్నా ఒక్కటే. వారి వల్ల వారికీ ఉపయోగం ఉండదు. ఇతరులకూ ఉప యోగం ఉండదు. అందుకే అటు వంటి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను
ఉపయోగిస్తుంటారు.
Review నా దెగ్గరేముంది ? బుడదా తప్ప…..