ముగ్గూ ముచ్చటా.

బ్రహ్మ దేవుడు నుదుటి రాతను గీతలుగా రాసినట్టే, ఇంటి ముందు వేసే ముగ్గు ఆ ఇంటి వారి సంస్కారాన్ని, సంస్క•తిని తెలుపుతుందని అంటారు.
ముగ్గు లేకుండా సంక్రాంతి లేదు. ముగ్గులు మన సంస్క•తిలో విడదీయరాని భాగం. ముగ్గు వేయడం అనేది అపురూపమైన కళ. ఇది తరతరాలుగా అమ్మమ్మలు, బామ్మల నుంచి వారసత్వంగా వస్తోంది. సంక్రాంతి వేళ ఇంటి ముంగిట ముగ్గులు వేసే విషయంలో తెలుగు పడుచులు, అమ్మాయిలు ముద్దుగుమ్మలైపోతారు. సూర్యుడు ఉదయించడానికి ముందే నిద్రలేచి, ఇంటి ముంగిట ఆవు పేడతో కళ్లాపి చల్లి రంగురంగుల రంగవల్లికలను తీర్చిదిద్దడం ఒక కళ. ముగ్గుల మీద ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచుతారు. దానిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. ఉమ్మెత్త, బంతి, గుమ్మడి, చామంతి, మందార పూల సింగారాలతో గొబ్బిళ్లు పవిత్రతను ఆవిష్కరిస్తాయి. ముగ్గుల మధ్యలో ఉంచే పెద్ద గొబ్బిని కృష్ణుడిగానూ, చుట్టూ ఉన్న చిన్న గొబ్బెమ్మలను గోపికలగానూ భావిస్తారు. ఈ గొబ్బెమ్మల చుట్టూ యువతులు ఆడుతూ పాడేవే గొబ్బి పాటలు. ముగ్గులు గొప్ప ఆధ్యాత్మిక, కళ, సంస్క•తుల అపూర్వ సమ్మేళనం.
ముగ్గును సంస్క•తంలో ‘రంగవల్లి’ అంటారు. రంగవల్లి అంటే మనసును రంజింపచేసే తీగ అని అర్థం. రకరకాల ఆకారాల్లో చుక్కలను పెట్టి, ఒక క్రమ పద్ధతిలో ఆ చుక్కల్ని కలిపి, అందమైన, అద్భుతమైన రంగవల్లులను తీర్చిదిద్దడం మన తెలుగింటి ఆడపడుచులకు చేయి తిరిగిన కళ. నలు దిశలా చుక్కలు.. వాటిని కలుపుతూ మెలి••లు తిరుగుతూ సాగే ముగ్గు పోత.. వాటి మధ్యలో కొలువుదీరే రంగులు.. ఆ వంపు సొంపుల ముగ్గుల్లో ఉన్న ఆకర్షణ ఎంత చూసినా తనివి తీరనిది. మరపురానిది.
ముగ్గులు ఖగోళంలోని చుక్కలకు ప్రతీక అని మన పెద్దలు చెబుతుంటారు. కుటుంబం ముగ్గు పిండి అయితే, ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు చుక్కలు. ఆ చుక్కల్ని అందంగా కలిపే ముచ్చటైన గీతే ఆనందాన్ని నింపే సంక్రాంతి పండుగ

Review ముగ్గూ ముచ్చటా..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top