పరగడుపున నీళ్లు.. నిండు నూరేళ్లు

పాత్ర:స్నానం:
బలాన్నిస్తుంది. దేహపుష్టి, జఠరదీప్తి, ఆరోగ్యం, ఆయుర్వ•ద్ధి, మనోవికాసాలను కలిగిస్తుంది. పైత్యం, దేహమాలిన్యం, దుస్వప్నాలు, చర్మరోగాలను పోగొడుతుంది.

పొద్దుపొద్దునే నీళ్లు తాగితే..:
బంగారం, వెండి, రాగి, కంచు, ఇనుము, మన్ను, గాజు, పింగాణి తదితర లోహాలతో తయారు చేసిన పాత్రలో రాత్రి నిల్వ చేసిన నీటిని పొద్దునే సూర్యోదయానికి, మలమూత్ర విసర్జనానికి ముందు తాగితే మలమూత్రాలు సునాయాసంగా విసర్జితం అవుతాయి. అన్ని దోషాలు, హృద్రోగం, అతిసారం, అతిమూత్రం, పొత్తికడుపు నొప్పి, గజ్జలలో బిళ్లలు, గళరోగం, శిరోరోగం, కన్ను, చెవికి సంబంధించిన ఇబ్బందులు, ఇంద్రియ నష్టాన్ని కూడా దీనివల్ల నివారించవచ్చు. సంతోషం, బలం, దేహపష్టి, ఆయుర్వ•ద్ధి, వీర్యవృద్ధి పొందవచ్చు. అనారోగ్యం లేకుండా నిండు నూరేళ్లు జీవించవచ్చు. ప్రాత:కాలాన్నే రెండు చెంచాల నీటిని ముక్కు రంధ్రాల ద్వారా పీల్చి తాగినట్టయితే ఇంద్రియ స్కలనం కడుతుంది. ఆయుర్వ•ద్ధి కూడా కలుగుతుంది. అనేక రోగాలను నివారించవచ్చు. అయితే ఈ నీరు పీల్చడాన్ని కొద్ది కొద్దిగా క్రమక్రమంగా అలవాటు చేసుకోవడం మంచిది.

పొద్దు తిరుగుడు చెట్టు:
దీనిని ‘సూర్యావర్తి’ అని కూడా వ్యవహరిస్తారు. చేదుగా, కారంగా ఉంటుంది. దీని కషాయం లేదా చూర్ణం దగ్గు, క్షయను పోగొడుతుంది. దీని ఎండిన కాడల్ని ఆవాలుతో మిళితం చేసి కషాయం కాచి తీసుకుంటే కుష్టువ్యాధి పోతుంది. దీని ఎండిన ఆకుల చూర్ణం కడుపునొప్పిని పోగొడుతుంది. మూత్ర విసర్జన అనాయాసంగా కలుగుతుంది. చెవిపోటు పోతుంది. నరాల బలహీనత కూడా మటుమాయం అవుతుంది.

బచ్చలి:
దీని తీగలు ఎరుపు, తెలుపు రంగులలో దొరుకుతాయి. దీని ఆకులు, కాడలు వండితే రుచిగా బాగుంటాయి. చలువ చేస్తుంది. విరేచనకారి. దగ్గు, మదం, తాపం, దాహాలను అణచివేస్తుంది. జఠరదీప్తిని, వీర్యపుష్టిని కలిగిస్తుంది. అయితే జ్వరంతో బాధపడుతున్న వారికిది అపథ్యం. అంటే దీనిని తీసుకోకూడదు. ఇందులో ‘మట్టు బచ్చలి’ అని దుబ్బుగా పెరిగే ఇంకో జాతి కూడా ఉంది. దీన్ని కూడా కూర వండుకోవచ్చు. బాగానే ఉంటుంది. అలాగే దీని ఆకుల రసాన్ని గాని, లేదా ఆకులను నూరిన ముద్దను కాని కాలిన గాయాలైన చోట పూస్తూ మంట తగ్గి చల్లగా ఉంటుంది. పొక్కులు త్వరగా మానుతాయి. ఆకును నూరి కణతలకు పూసుకుంటే వేడి తగ్గి నిద్రపడుతుంది.

బఠాణీలు:
వీటిని వేయించి పై పొర తీసి తింటే రుచిగా ఉంటాయి. వాతాన్నీ, చలువనీ కలుగచేస్తాయి. పైత్యాన్నీ, కఫాన్నీ హరిస్తాయి. వీర్యవృద్ధి, బలం, దేహపుష్టిని కలిగిస్తాయి. రక్తంలోని దోషాలను పోగొడతాయి. విరేచనకారి. పచ్చ బఠాణీలు కూరలలో వేసుకుని తినడం కూడా ఆరోగ్యదాయకం.

పెరుగన్నం:
తియ్యగా, రుచిగా, పుల్లగా ఉంటుంది. మేహశాంతిని, చలువను కలగుచేస్తుంది. రక్తంలోని అతి వేడిని, పైత్యాన్ని, కాకను అణచివేస్తుంది. జబ్బుపడి కోలుకున్న వారు, నీరసంగా ఉన్న వారు దీనిని తీసుకుంటే రక్తవృద్ధి కలిగి ఆరోగ్యవంతులు అవుతారు. రుచిని పుట్టిస్తుంది. మూత్ర విసర్జనను సులభతరం చేస్తుంది. జ్వరంతో బాధపడుతున్న వారు దీన్ని తీసుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. గుండెకు ఇది మంచిది. బలాన్ని చేకూరుస్తుంది.

బాదం గంజి:
బాదం పప్పును నీళ్లతో నూరి, ఆ నూరిన దానిని పలుచగా చేసి, నేతితో పొగచి ఉడికిస్తే గంజి తయారవుతుంది. ఇది తీసుకుంటే చలువ చేస్తుంది. పొట్టకు బలాన్నిస్తుంది. తేనెతో కలిపి దీనిని తీసుకోరాదు.

బాదం నూనె:
శరీరాన్ని మృదువుగా చేస్తుంది. దగ్గును పోగొడుతుంది. బ్లాడర్‍లోని పుండ్లను మాన్పుతుంది. మెదడు, గుండె, కళ్లు.. వీటికి మేలు చేస్తుంది. ఈ నూనెతో తలంటుకున్నా, మర్దన చేసుకున్నా తలలోని పోటు, వేడిమి, వికారాలు పోతాయి.

బాదంకాయలు:
బాదంపప్పు సమశీతోష్ణమయినది. కొత్త కాయల్లోని పప్పు చాలా శ్రేష్ఠమైనది. ఇది వీర్యవృద్ధి, శరీరపుష్టిని కలుగచేస్తుంది. రొమ్ముకు బలాన్నిస్తుంది. బ్లాడర్‍లోని పుండ్లను మాన్పుతుంది. అన్ని అవయవాలకు సత్తువనిస్తుంది. గొంతును, రొమ్మును మృదువుపరుస్తుంది. దగ్గు, కాలేయం, నొప్పి, క్షయను అణచివేస్తుంది. పొట్టకు, మూత్రపిండాలకు బలాన్నిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. పళ్లనొప్పి, శిరోరోగాలను పోగొడుతుంది. పొట్టు తీసిన బాదంపప్పు వీర్యవృద్ధిని కలిగిస్తుంది. విడిచి విడిచి వచ్చే జ్వరాన్ని పోగొడుతుంది.

Review పరగడుపున నీళ్లు.. నిండు నూరేళ్లు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top