ఓంకార రూపం త్య్రహమితి చపరం యత్స్వరూపంతురీయం ।।
త్రైగుణ్యాతీత నీలం కలయతిమనస స్తేజసిస్థూర మూర్తిమ్ ।।
యోగీన్ద్రా బ్రహ్మరన్ద్రే సకల గుణమయం శ్రీహరేన్ద్రేణ సంగం ।।
గం గంగంగం గణేశంజముఖమభితో వ్యాపకం చిన్తీయన్తి ।।
ఓంకార స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు, త్రిగుణాత్మకమైన ఈ అఖిలాండకోటి బ్రహ్మాండమైన ప్రకృతికి పరమైన వాడు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను దాటిన తురీయరూపుడు, మనసును దేదీప్యమానంగా ప్రకాశింపచేసేవాడు, తేజ స్వరూపుడు, సింధూర వర్ణకాంతి గలవాడు, సకల గుణ గణాలు కలిగిన వాడు, గజముఖం గలవాడు, సర్వవ్యాపి అయిన గణపతిని ఏ యోగీంద్రులు సహస్రార కమలమునందు ధ్యానించెదరో అట్టి విఘ్నేశ్వరుడిని ధ్యానించెదను.
గణపతిని పూజిస్తే సమస్త విఘ్నాలు హరిస్తాయని చెబుతోన్న ‘గణపతి అథర్వశీర్షోపనిషత్తు’లో ఆయనను త్రిమూర్తి స్వరూపంగా వర్ణించారు.
మహా విఘ్నాత్ ప్రముచ్యతే మహా దోషాత్ ప్రముచ్యతే
వినాయకుడిని పూజిస్తే మహా విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మహా దోషాలన్నీ అంతమైపోతాయి.
మానవులే కాదు.. ్ర•హ్మాది దేవతలు తమ పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేందుకు గజవదనుడిని భజిస్తారని కింది శ్లోకం చెబుతోంది.
వాగీశాద్యా స్సుమనస:సర్వార్థానా ముపక్రమే।
య: నత్వా కృతకృత్యా: స్యుస్తం నమామి గజాననమ్ ।।
గణపతి తత్త్వం సులభంగా బోధపడదు.
ఆయన రూపాల మాదిరిగానే గుణాలు, గణాలు కూడా వేనవేలు.
విఘ్నేశ్వురుని ప్రధానంగా ద్వాదశ నామాలతో పూజిస్తారు.
ఆ శ్లోకమిది..
వినాయకో విఘ్నరాజో
దైమాతుర గణాధిప
అప్యేవదంతో హేరంబో
లంబోదర గజాననా
వినాయకుడు, విఘ్నరాజు, ద్వైమాతురుడు, గణాధిపతి, ఏకదంతుడు, హేరంబుడు, లంబోదరుడు, వ్రాతపతి, ప్రమదపతి, విఘ్ననాశి, శివసుతుడు, వరదమూర్తి.. ఇవి వినాయకుని ద్వాదశ (12- పన్నెండు) నామాలు.
వినాయక నామాల్లో ఏకదంతుడు అనేది ఒకటి. ఏకదంత నామంలో ఉండే మరో అంతరార్థాన్ని తెలిపే శ్లోకం ఇది..
ఏకశబ్దాత్మికా మయాతస్య: సర్వం సముద్భవం
భ్రాతి మోహదం పూర్ణం నానా ఖేలాత్మికం కిల
ఏక అంటే మాయ.
దంత అంటే నిజంగా ఉండేది.
సత్తాధారుడిగా, చాలకుడిగా గణపతి ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఆనందిస్తుంటాడు.
మాయతో ప్రపంచాన్ని నడిపేవాడు చాలకుడు.
కృష్ణుడికి అష్టమి, రాముడికి నవమి, దుర్గాదేవికి దశమి.. ఇలా ఒక్కో దేవతకు ఒక్కో తిథి ప్రత్యేకం.
ఈ కోవలో వినాయకుడికి చవితి అత్యంత ప్రీతిపాత్రమైనది.
భాద్రపద శుక్ల చవితి నాడు మధ్యాహ్నం వినాయకుడు జన్మించాడు.
ఈ చవితి ఆదివారం కానీ, మంగళవారం కానీ వస్తే ఇంకా ప్రశస్తం.
గణపతికి చవితి అంటే ఎంత ఇష్టమో వరాహ పురాణంలో వివరించారు.
అందులో సకల దేవతలూ గణపతిని కింది విధంగా స్తుతిస్తారట.
నమోస్తుతే విఘ్నకర్త్రే
నమస్తే సర్పమేఖల
నమస్తే రుద్రవక్త్రోత్థ
ప్రలమ్బజఠరాశ్రిత
అంటే- ‘శివుడి ముఖం నుంచి వినాయకుడు పుట్టాడు. అలాంటి గజనాయకుడిని చవితి నాడే పూజించాలి’ అని పై శ్లోకానికి అర్థం.
త్రిపుర సంహారం అనంతరం సాక్షాత్తూ పరమేశ్వరుడే గణపతిని ఇలా ఆశీర్వదించాడట..
శై వై స్వదీయైరుత వైష్ణవశ్చ,
శాక్తైశ్చసౌరైరపి సర్వకార్యే ।
శుభాశుభే లౌకిక వైదికేచ,
త్వమర్చనీయ: ప్రథమం ప్రయత్నాత్ ।।
శైవం, వైష్ణవం, శాక్తం అనే మత సంప్రదాయాలకు చెందిన వారందరూ, లౌకిక, వైదికాది సమస్త శుభాశుభ కార్యాలు, కర్మలు ప్రారంభించడానికి ముందు పప్రథమంగా నిన్ను భక్తిశ్రద్ధలతో పూజింతురు గాక!).
గణపతి మూల మంత్రమిది. సర్వ కార్యసిద్ధికి ఈ మంత్రజపం ఉపకరిస్తుంది.
ఓం గం గణపతయే నమ:
‘గణేశ’ శబ్దం వ్యుత్పత్తి ఇది..
గణానాం జీవజాతానం య:
యీశ: స్వామి స: గణేశ: ।
సమస్త జీవజాతికి ఈశుడు- స్వామి. అధిపతి గణేశుడు. ఆయనను పూజించడం వల్ల సమస్త విఘ్నాలు తొలగుతాయని అర్థం.

























































































































































































































































































































































































































Review మంత్రపుష్పం.