ఉరుములే తప్ప వర్షం లేదు!

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.

హైదరాబాద్‍లో దక్కనీ ఉర్దూ భాషకు సాహి త్యాల్లో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. భాషా సాహిత్యంలోనూ, వాడుకలోనూ సమయాను కూలంగా, సందర్భానుసారంగా ఉపయోగించే సామెతలు ఆ సాహిత్యానికి అదనపు సొబ గులు అద్దాయి. దక్కనీ జన జీవితంలో ఉన్న ఉర్దూ సామెతల సమాహారమే.. ఉర్దూ భాషా సౌందర్యానికి ప్రతీక. జీవన విలువలను, వ్యక్తిత్వ పాఠా లను నేర్పే ఆ సామెతలివిగో..

జల్దీ పర్‍ నమక్‍ చిడ్‍ఖానా

పుండు మీద కారం చల్లినట్టు లేదా అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అనే అర్థంలో పై సామెతను వాడతారు. తెలంగాణ ప్రాంతంలో ఈ సామెత బాగా వాడుకలో ఉంది. ‘దూద్‍ సె జలాతో చాంజ్‍ భీ పూక్‍ పూక్‍కర్‍ పీతేహై’ అనే సామెత కూడా దాదాపు ఇటువంటి అర్థాన్నే ఇస్తుంది. వేడిపాలతో నాలుక కాలినాక చల్లను కూడా ఊదుకుంటూ తాగినట్టు అని దీని భావం.

జైసా దేస్‍ వైసా బేస్‍

రోమ్‍లో ఉన్నప్పుడు రోమన్‍ లాగే ఉండు అని అర్థం. మన వేషభాషలు మనం ఉండే దేశానికి తగినట్టు ఉండాలి. కొంతమంది స్థాయికి మించి ప్రదర్శన చేస్తుంటారు. లేని గొప్పలు చాటుకోవా లని అనుకుంటారు. అటువంటి వారిని ఉద్దేశించి అనడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

కర్‍ బురాతో హోయ్‍ బురా

చెరపకురా చెడేవు అని తెలుగులో మంచి ఉపమానం ఉంది. సరిగ్గా దానికి సమానార్థంలో ఉండే ఉర్దూ సామెత ఇది. మనం చేసే పనులను బట్టే ఫలితం లభిస్తుంది. చెడు పనులు చేస్తే జీవితం చెడుగానే ఉంటుంది. అటువంటి చెడు పనులు చేస్తే చెడిపోతావనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.

జో గరజ్‍తేహై వో బరస్‍తే నహీ

ఉత్త ఉరుములే తప్ప వర్షం కురవదు. మొరిగే కుక్క కరవదు. ఈ సామెతను వట్టి గొడ్డుకు అరుపు లెక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కోసారి దట్ట మైన మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు, మెరుపులతో ఆకాశం భీతావహం సృష్టిస్తుంది. కానీ, క్షణాల్లో అవన్నీ తేలిపోతాయి. చినుకు కూడా రాలదు. మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి హడావుడినే చేస్తుంటారు. అటువం టప్పుడు వారిని ఉద్దేశించి వాడే సామెత ఇది.

డూబ్‍ తే కో టింకే కా సహారా

వరదలో కొట్టుకుపోయే వాడు ఆసరాగా గడ్డిపోచను పట్టుకున్నట్టు అనే అర్థాన్నిచ్చే సామెత ఇది. సహాయ సహకారాలు తగు సామర్థ్యం ఉన్నవారి నుంచి మాత్రమే పొందాలని కూడా ఈ సామెత బోధిస్తుంది. ఉదాహరణకు మనం ఏదైనా కష్టాల్లో పడితే.. అందుకు తగిన మార్గమేదో గట్టిగా ఆలోచించాలి. వరద నీటిలో కొట్టుకుపోయే వాడు గడ్డిపోచ పట్టుకుంటే ఆగుతాడా? అలాగే, మనల్ని ఆ కష్టం నుంచి గట్టెక్కించే మంచి ప్రయత్నం చేయాలి తప్ప సామర్థ్యం లేని సహకారాన్ని ఆశ్రయించ కూడదనే పాఠం ఈ సామెత నుంచి నేర్చుకోవాలి.

లోహె కా చనే చబానా

ఇనుప గుగ్గిళ్లను అనవసరంగా నమల వద్దు. లేదంటే పళ్లు ఊడిపోతాయి అని హెచ్చ రిక చేసే సామెత ఇది. తగని పనులు చాలామంది నెత్తిన వేసుకుంటారు. ఆనక వాటిని చేయలేక బోల్తా పడుతుంటారు. అటువంటి పనులు తల నొప్పులు తెస్తాయి తప్ప వాటి వల్ల ఏం లాభం ఉండదనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.

Review ఉరుములే తప్ప వర్షం లేదు!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top