ప్రపంచం వేగంగా మారుతున్న క్రమంలో, ఆ వేగాన్ని పరిపుష్టం చేసుకోవడం కోసం, మరింత ముందుకెళ్ళడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాలెడ్జ్ సొసైటీగా పిలవబడుతున్న ఈ కాలంలో ప్రతి విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించడం అలవాటయింది. వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తువైపు దూసుకెళుతున్న మనిషి, తనకు ఊతంగా పనికి వచ్చే ప్రతి విషయం కోసం మూడు కాలాల్లోకి తొంగి చూస్తున్నాడు.
తన మేథస్సుకు పనికి వచ్చే కొత్త విషయాల కోసం, తన ఉనికిని మరింత శక్తి వంతంగా చాటడానికి పనికి వచ్చే సాంస్క•తిక శకలాలకోసం మనిషి మూలాల్లోకి ప్రయా ణిస్తున్నాడు. అందులో భాగంగానే తాళపత్ర గ్రంథాలు, రాత ప్రతుల శోధన మొదలు పెట్టాడు. రాతప్రతులకోసం రాష్ట్రవ్యాప్తంగా, విస్త•తంగా గాలిస్తున్నారు. అచ్చు యంత్రాలు అందుబాటు లేని కాలంలో, కాగితం కూడా కనిపెట్టని సమయంలో మనిషి తన జ్ఞానాన్ని ఆకులపై భద్ర పరచుకున్నాడు. సమస్త శాస్త్రాలు తాటి ఆకులలో కనిపించినవి. ప్రాచీన కాలంలో విద్య బ్రాహ్మణుల ఆధీనంలో ఉంది. దాన్ని రుజువు పరుస్తున్నట్టుగానే తాళపత్రాలు చాలాచోట్ల అగ్రవర్ణాల వారి ఇండ్లలోనే దొరికినవి. మంత్ర, తంత్ర, ఆయుర్వేద, శ్రాద్ధకర్మలకు చెందిన గ్రంథాలే కాక, రామాయణ, భారత, భాగవతాలు, కావ్యాలు, ఇతర విషయాలకు చెందిన గ్రంథాలు కూడా లభించాయి. వీటిని ఆ ఇంటివారు పదిల పరచుకున్న వైనం చూస్తే ముచ్చటేస్తుంది. ప్రతీ దాన్ని ప్రయోజనమనే రిక్టర్ స్కేల్‍పై తూచే నేటి కాలంలో, తాళపత్రాలను దాచుకున్నవారిని చూస్తే అబ్బురమనిపిస్తుంది. ఇతరులు వాటిని తాక బోయినప్పుడు వారించిన వారి కంఠ స్వరంలోని ధ్వని, వాటిపై వారికున్న మక్కువకు ఇందుకు తార్కాణం. వివరాల సేకరణకోసం వెళ్ళిన మమ్మల్ని సేకరణకు చెందిన జ్ఞానం తొందర పెట్టింది. ఆ విషయాల్నే కదిపితే గతంలో తమవద్ద నుండి రాతప్రతుల్ని తీసుకెళ్ళిన వారి చిరు నామాలు పెదవులపై తారాడాయి. నాటి విష యాలు కథలు, కథలుగా వారి మాటల్లో దొర్లాయి. తాళపత్ర గ్రంథాల్ని కాక కేవలం వాటి వివరాల సేకరణకు వెళ్ళిన మాపై వారికి గురి కుదిరింది.
తాళపత్రాలపై వారికున్న భక్తిశ్రద్ధలను చూస్తే ముచ్చటేసింది. ఎక్కడో అటకపై ఉన్నవాటిని తీసి, దుమ్ము దులిపి, వరుసలు వరసలుగా పేర్చి వాటిని గురించి చెబుతున్న వారి కళ్ళలో తొణికిసలాడిన తృప్తి చూస్తే ఆనందమనిపించింది. దాదాపు అరవై తాళపత్ర గ్రంథాల ప్రాశస్త్యాన్ని ఏకబిగిన చెప్పిన రామశర్మగారి వాగ్దాటి అమోఘమనిపించింది. ఘనాపాఠిగా ఆ ప్రాంత ప్రజల్లో వారికున్న పేరు సార్థకమైనదేననిపించింది. తాళపత్ర గ్రంథం, మా ఇంటి లక్ష్మీస్వరూపం అని ఒక స్త్రీమూర్తి నిర్వచిస్తే, కష్టాల సుడిగుండాల్లో సర్వం పోగొట్టు కున్నా, మిగుల్చుకున్నది మాత్రం ఈ గ్రంథాల్నే అని ఒక పెద్దాయన సెలవిచ్చాడు. మల్టీ కలర్ విజువల్స్ మెరుపుల్లో అక్షరాలు రంగవల్లిక లౌతున్న వేళ, ఈ తరంలో కొందరు తాళపత్రాలను చూడడానికి సుముఖంగా లేరు. తాళ పత్రాలున్న కుటుంబా ల్లోని యువకుల ఒత్తిడిని భరించలేక, పెద్దవారు వాటిని వదిలించుకున్న వైనం విని అవాక్క య్యాము. వాటిపై వారికి గల భక్తిశ్రద్ధలకు కదలి పోయాము. కొన్ని నమ్మకాలు, మనుషుల్ని ఎంతటి సంస్కారవంతులుగా నిలబెడతాయో గ్రహింపు కొచ్చింది. తాళపత్రాల్ని సరస్వతీ స్వరూపంగా భావిస్తూ ఇన్నాళ్ళు వాటిని భద్రపరచినవారు, వాటిని బయట తొక్కుళ్ళలో, పెంట బొందలలో పారేయలేక, గోదావరి పుష్కరాలలో నిమజ్జనం చేశామని తెలిపారు. కరడుగట్టిన మెటీరియలిస్టిక్ దృక్పథం కల్చర్‍గా మారిన ఈ రోజుల్లో వారి చర్య ఉన్నతమైనదే. పుష్కరాలవరకు ఆగలేనివారు తిథి, వార నక్షత్రాల్ని చూసుకొని అగ్నికి ఆహుతి చేశారనే విషయం కూడా తెలిసింది.
ప్రాచీన కాలం నుండి, సమాజంలో కింది కులాల వారిగా పరిగణింపబడ్డవారి ఇండ్లలోనూ, వారి ఉపకులాల వారిగా బతికి నడక్కలి, ఒగ్గు, మాదిగ గురువులు… లాంటి వారి ఇండ్లలోనూ తాళపత్రాలు బయటపడ్డవి. ఊరికి దూరంగా, చింత చెట్ల మధ్య గిజిగాడి గూళ్ళ లాంటి గుడిసెల్లో జీవనం గడుపుతున్న డక్కలి వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి పలకరించినపుడు ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. ఎవరికి వారే బతుకుతున్న వార్ని ఒక తాళపత్రం గ్రంథం కలపడం వింత కదూ!
ఏడుగురు అన్నదమ్ములు విడివడిగా బ్రతు కుతూ, తమ కులవృత్తి అయిన పటం వేసి పురాణం చెప్పడం కోసం ఒకే తాళపత్ర గ్రంథంపై ఆధారపడుతూ కలిసిమెలిసి ఉండటం కని పించింది. బ్రాహ్మలకు అగ్రహారాలు దాన మివ్వడం, రాసివ్వడం చరిత్రలో కనిపిస్తుంది. దాని తాలూకు రికార్డులు ఈ విషయాల్ని స్పష్టం చేస్తు న్నాయి. ‘బాబాజీ’ మఠం, తన మఠం సభ్యులకు కొన్ని ప్రదేశాలను దత్తం చేస్తూ రాగి రేకులపై రాసి ఇచ్చింది. సంచార జాతులుగా చెప్పు కొంటున్న వీరు ఆనాడు ప్రజలకు మూలికా వైద్యాన్ని అందించారు. తాయత్తులను కట్టి ప్రజ లకు సేవలందించి జీవనం గడిపారు. ఈ విషయాలన్ని రాగి రేకులపై పొందు పరిచి ఉన్నవి. సామాజిక ఉపరితల వర్గాల్లో అమలైన ధోరణి, కింది కులాల్లో సమాంతరంగా అమ లవ్వడం గమనించాం. అన్ని సౌకర్యాలను అందు బాటులో ఉంచుకొని పై మెట్టుపై కూర్చొని ప్రవచ నాలను వల్లించిన వర్ణాలు ఒకవైపు. అవసరాలకు వెలియై, జీవనమే బరువైన వర్ణం మరో వైపు స్పష్టాతిస్పష్టంగా కనిపించాయి. కాని సాహితీ, సాంస్క •తిక వైభవంలో ఈ రెండు వర్గాలు పోటీ పడ్డాయని ఈ శోధనలో తేలింది. కింది కులాల్లో సైతం తాళపత్ర గ్రంథాలు అందుకే కనిపించాయి. అయితే వ్యాప్తిలో మాత్రం తేడా ఉంది. ప్రాచీన సామాజిక నిర్మాణానికి చెందిన అమరికను తాళపత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. తాళపత్రాల తయారీలో నాటి వ్యక్తుల శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. దొండ, కాకర, వాయిలి వంటి ఆకుల్ని నీళ్ళలో వేసి బాగా మరగబెట్టి, ఆ నీళ్ళలో సైజులుగా కత్తిరించిన తాటి ఆకులను వేసి నానబెట్టేవారట. దాంతో తాటి ఆకుగంటంతో రాయడానికి అనుకూలంగా తయారయ్యేదట. నీళ్ళలో నాన్చి ఆరబెట్టిన ఆకులపై రకరకాల గంటాలతో అందంగా రాసేవారు. కేవలం మూడు వేళ్ళ వెడల్పు ఉన్న తాటి ఆకుపై పధ్నాలుగు లైన్లతో, రెండువైపులా అంటే మొత్తం ఇరవై ఎనిమిది లైన్లు రాసి ఉండడం విశేషంగా కనిపించింది. ఆ రాత ముత్యాల పేరును మురి పించింది. ఇలా రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు దాని వెనక ఉన్న పరిశ్రమను, దీక్షను తప్పకుండా ప్రశంసించాల్సిందే. రిమోట్ సైజ్‍లో ఉన్న తాళపత్ర గ్రంథం అందంగా, కళాత్మకంగా, చూడముచ్చటగా ఉంది. దీన్ని ‘ఘటిక’ అని అంటారని చెప్పుకొచ్చారు. ఈ ఘటి కలు ఆనాటి మనుషుల సృజనాత్మకతకు అద్దం పడతాయి. ఈస్థటిక్స్ అనేవి అనాదిగా మానవు నితో సహ జీవనం చేస్తూనే ఉన్నాయి. ఇక ముందు కూడా చేస్తాయని ఈ సందర్భంగా మరోసారి రుజువయింది.
Review పవిత్ర ప్రతులు తాళ పత్రాలు.