సన్నివేశం-1:
పంజరంలో బంధించిన పక్షికి ఒక గిన్నెలో నీరు, మరో గిన్నెలో ధాన్యపు గింజలు వేసి ఉంచారు. పంజరం లోపల అది కూర్చు నేందుకు చిన్న పీట వేశారు.
బయట ఆకాశంలో విహరిస్తూ ఉన్న మరో పక్షిని చూసి, ఈ పంజరంలోని పక్షి.. ‘ఆహా.. ఆనందమంటే ఆ పక్షిదే కదా! ఎటువంటి బంధ నాలు లేకుండా ఎంత స్వేచ్ఛగా విహరిస్తుందో కదా! నాకేమో పంజరమే ప్రపంచం. ఇక్కడ నాకు ఊపిరి సలపడం లేదు’ అని బాధపడసాగింది. వెంటనే బయట ఎగురుతూ ఉన్న పక్షిపై పంజరం లోని పక్షికి ఈర్శ్య భావం ఏర్పడింది.
సన్నివేశం-2:
బయట ఎగురుతూ ఉన్న పక్షి.. ఈ పంజ రంలో బంధించి ఉన్న పక్షిని చూసింది. అది ఇలా అనుకుంది..
‘ఆహా.. సుఖమంటే పంజరంలోని పక్షిదే కదా! దీనికి ఆహారం సంపాదించుకునే చింత లేదు. గాలివానల భయం లేదు. వేటాడే పక్షుల నుంచి, వేటగాళ్ల నుంచి తప్పించుకునే పనీ లేదు. నాకు ఎల్లప్పుడూ ఆహారం సంపాదించుకోవడం, నీరు తాగడం గురించే చింత.. గాలివానలు వచ్చా యంటే చచ్చేంత భయం.. వాటి నుంచి తప్పించు కుని బతకడం ఎంతో కష్టంగా ఉంటుంది. చాలాసార్లు డేగల్లాంటి వేటాడే పక్షుల నుంచి రక్షించుకోవడం ప్రాణాల మీదికి తెస్తుంటుంది కదా.. ఈ పంజరంలోని పక్షికి ఇటువంటి కష్టాలు, ఇబ్బందులు ఏమీ లేవు కదా!’ అని చింతించింది. అలా పంజరంలోని పక్షి సుఖాన్ని తలుచుకుని, తనలో తాను బాధపడుతూ, ఆ పక్షిపైన ఈర్శ్య పెంచుకోసాగింది.
అసలు విషయం..
ఆ పక్షులు రెండూ ఒకదానిపై మరొకటి ఈర్శ్య పడటం ఎంత వరకు సబబు? రెండూ కూడా తనకన్నా మరో పక్షే ఎక్కువ సుఖంగా ఉన్నట్టు భావిస్తున్నాయి. ఒకవేళ రెండింటి ఆలోచ నలు మార్పు చెందితే ఆ రెండు పక్షులు ఇలా ఆలోచించగలిగేవి..
‘పంజరంలో ఉన్న పక్షినైన నేను ఎంత సుఖంగా ఉన్నాను? నాకైతే అన్నీ పంజరంలోనే లభిస్తున్నాయి. కానీ, పాపం తిండి, నీరు వెతుక్కునే చింత, బాధ బయట తిరిగే పక్షికి ఎల్లప్పుడూ ఉంటాయ’ని ఆలోచించగలిగితే బయట పక్షిని దయాభావంతో చూడగలిగేది.
‘బయట స్వేచ్ఛగా తిరగగలిగే విహంగాన్ని నేను. నేనెంత సుఖంగా ఉన్నాను? నేను స్వతంత్రు రాలిని. ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకాశంలో స్వతంత్రంగా ఎగురగలను. ఈ పంజరంలోని పక్షికి ఈ సుఖం లేదు కదా!. దానిని బంధించారు. దీని ప్రపంచం నూతిలోని కప్పవంటిది..’ ఇలాగని బయటి పక్షి ఆలోచిస్తే, పంజరంలోని పక్షిపై దయా భావం కలిగేది.
రెండు పక్షులూ కూడా, తనను తాను సుఖంగా ఉన్నట్టు, రెండవది బాధలో ఉన్నట్టు కనుక అనుభవం చేసుకోగలిగితే, ఆ విధంగా ఆ రెండు పక్షుల ఆలోచనల్లో మార్పు వస్తే ఆ రెండు పక్షుల పరిస్థితులు మారిపోయేవి.
మన జీవితాలూ అంతే..
ప్రతి వ్యక్తి జీవితంలో సుఖదు:ఖాలు రెండూ ఉంటాయి. ఒకవేళ మనం ఎల్లప్పుడూ మంచి విషయాలను బుద్ధిలో ఉంచుకుని సుఖాన్ని అనుభ విస్తూ ఉండాలి. మన అదృష్టాన్ని పొగుడుకుంటూ ఇతరుల చెడు విషయాలను చూసి దయా భావన కలిగి ఉంటే మన మనసులో ఎప్పుడూ ఈర్శ్య, బాధ ఉండవు.
ధనవంతుడైన ఒక వ్యక్తి ధనం ద్వారా సేవ చేస్తే, రెండో వ్యక్తి శారీరకంగా బలవంతుడు. అతను శరీరం ద్వారా సేవ చేస్తాడు. మూడవ వ్యక్తి సమయం, సంకల్పాల ద్వారా సేవ చేస్తాడు. ఒకవేళ శరీరం ద్వారా సేవ చేసే వ్యక్తి ధనం ద్వారా సేవ చేసే వ్యక్తిపై ఈర్శ్య పడితే అతనికి సుఖం పోయి చింత కలగడం మొదలవుతుంది. అందువల్ల అందరూ తమ తమ జీవనాన్ని సౌభాగ్యశాలిగా భావించి, ఇతరుల గురించి కూడా శుభం, శ్రేయస్సు దృష్టితో ఆలోచిస్తే లోక కల్యాణం జరుగుతుంది.
ఈర్శ్య అంటే మరేమిటో కాదు. అనుమానం మాత్రమే. దీనికి చికిత్స దయా స్వభావం కలిగి ఉండటమే.
Review పోలికతో చింత.. సుఖము లేదంట.