అమ్మవారిల్లు..మణిద్వీపం

శ్రీచక్ర బిందు రూపిణి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీదేవి, శ్రీ మహావిద్య, శ్రీ మహాత్రిపుర సుందరి, శ్రీ లలిత అయిన జగన్మాత నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. పద్నాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో అమ్మ కొలువై ఉంది. యావత్తు జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ మణిద్వీపం ఉద్భవించింది. నాలుగు వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న మణిద్వీపం గురించి వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితjైు ఉంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించి వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలవంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. దసరా సందర్భంగా ఆ ద్వీపం గురించి తెలుసుకుందాం.

పరమేశ్వరుడి నివాస స్థానం` కైలాసం.
మహా విష్ణువు కొలువుండేది` వైకుంఠం.
బ్రహ్మదేవుడు ఉండేది` సత్యలోకంలో..
సూర్యచంద్రుల కొలువు` ఆకాశం.
మరి సర్వలోకాలను ఏలే ఆ జగన్మాత ఎక్కడ ఉంటారు? ఆమె నివాస స్థానం ఏది? అది ఎక్కడ ఉంది? అది ఎలా ఉంటుంది? అక్కడకు ఎలా చేరుకోవాలి? అలా చేరుకునే మార్గంలో ఏమేం ఉంటాయి?
వైకుంఠం, కైలాసం కంటే కూడా అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్తు విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండగలగడమే మహా వరం. అందుకనే మణిద్వీప వర్ణనను నిత్య పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. సకల

వైకుంఠం, కైలాసం కంటే కూడా అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్తు విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండగలగడమే మహా వరం. అందుకనే మణిద్వీప వర్ణనను నిత్య పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అటువంటి శుభకరమైన చోటే` మణిద్వీపం. అమ్మవారు కొలువుండే నివాస స్థానం.
మణిద్వీపం గురించి, దాని వర్ణన గురించి, అక్కడ ఎలా చేరుకోవాలి? మణిద్వీపంలో అమ్మవారి ఎక్కడ ఉంటారనే ప్రశ్నలకు దేవీ భాగవతంలో సమాధానం లభిస్తుంది. శ్రీదేవీ భాగవతంలో మణిద్వీపం గురించి అత్యద్భుత వర్ణన ఉంది. ఈ వర్ణన.. రామాయణంలోని సుందరకాండలా నిత్య పారాయణకు అనుకూలమైన అధ్యాయం. నూతన గృహ ప్రవేశ సందర్భంలో మణిద్వీప వర్ణన గురించి పారాయణం చేయడం సంప్రదాయంగా ఉంది.
ఇల్లు (గృహం) అనేది కారాగారం కాదు. అది బంధన కారణం కూడా కాదు. మనసే అన్నిటికీ కారణం. అది బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలోనే ఉండి మోక్షాన్ని సాధించవచ్చు. ఈ విషయాన్నే మణిద్వీపం తెలియచెబుతుంది.
మణిద్వీపం అమ్మవారి స్వస్థలం. లలితా సహస్రంలోని ‘సుమేరు శృంగ మధ్యస్థా, శ్రీమన్నగర నాయికా, చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మా సంస్థితా, మహా పద్మాటనీ సంస్థా, కదంబ వన వాసినీ, సుధా సాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ’ అనే ఈ నామాలు అమ్మవారి నివాస స్థానాన్ని గురించి చెబుతాయి. మణిద్వీప వర్ణన అధ్యాయం చదువుతుంటే గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది.
మొత్తం ఇరవై ఐదు (25) భారీ ప్రాకారాలు..
ప్రతి రెండు ప్రాకారాల మధ్య ఒక్కో విశాల ఆవరణ..
24వ ఆవరణలో చింతామణి గృహం ఉంది.
చింతామణి గృహానికి నాలుగు ద్వారాలు.. దానికి మధ్యలో శ్రీనగరం ఉంది. అక్కడే జగదంబిక భువనేశ్వరీ దేవి ముక్కోణాకారపు పానుపుపై సుఖాశీనురాలై ఉంటుంది.
ఈ మణిద్వీపాన్నే వ్యాస మహర్షి ‘సర్వలోకం’గా అభివర్ణించారు. అమృతసాగరమే ఈ మణిద్వీపానికి అగడ్త.
మణిద్వీపానికి గల ఇరవై నాలుగు ప్రాకారాల్లో మొదటిది ఇనుప ప్రాకారం. ఇక్కడ భూమండలంలోని రారాజులు ఉంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను లోనికి పంపిస్తుంటారు.
అనంతరం వచ్చే కంచు ప్రాకారం.. పచ్చటి అరణ్యాలతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ప్రతిధ్వనిస్తుంటుంది.
ఆ తరువాత వరుసగా ఇంకా రాగి, సీసం, ఇత్తడి ప్రాకారాలు దాటిన తరువాత పంచలోహ ప్రాకారం వస్తుంది.
దీని తరువాత రజత, స్వర్ణ ప్రాకారాలు ఉంటాయి.
ఇవి కూడా దాటిన తరువాత మహా మరకత, పగడ,

ఇవి కూడా దాటిన తరువాత మహా మరకత, పగడ, నవరత్నాలతో కూడి సర్వాంగ సుందర ప్రాకారాలు వస్తాయి.
ఇలా అనేక ప్రాకారాలు దాటుకుంటూ వెళ్లిన తరువాత దేవీ మందిరమైన చింతామణి గృహం వస్తుంది.
అమ్మవారి తత్త్వం పది మెట్లుగా ఉంటే చింతామణి గృహం అఖండ శక్తివంతమై అలరారుతూ ఉంటుంది.
చింతామని గృహంలో శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత మంటపాలు ఉంటాయి.
శృంగార మంటపంలోని దివ్య సింహాసనంపై జగదంబ ఆశీనురాలై అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటారు.
ముక్తి మంటపంలో శ్రీమాతగా బ్రహ్మాండమంతటా నిండి ఉన్న పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది.
జ్ఞాన మంటపంలో శ్రీదేవిగా జ్ఞానోపదేశం చేస్తుంది.
ఏకాంత మంటపంలో అనంగ కుసుమ ఇతర అమాత్యులతో సమావేశమై లోకరక్షణ కోసం శ్రీమహారాజ్ఞిగా మంత్రాంగం నిర్వహిస్తుంటుంది.
సృష్టి ఆరంభంలో దేవి రెండు రూపాలుగా మారిందట. కుడి భాగం భువనేశ్వరుడిగా, ఎడమ భాగం భువనేశ్వరిగా అవతరిస్తుంది.
భగవతిలోని సగ భాగమే భువనేశ్వరుడు. ఆయన ఎడమ తొడపై భగవతి ఆశీనురాలై ఉంటుంది.
ఆత్మ సాక్షాత్కారం కోపం పరితపించే వారు అంతర్యాగం చేస్తారు. అంటే` అంతరంగంలో యాగం చేస్తారు. అటువంటి సాధకుడికి శరీరమే శ్రీచక్రం. అరిషడ్వర్గాలను జయించిన హృదయమే సుధా సముద్రం. ఆ హృదయం మధ్య స్థానమే మణిద్వీపం. అందులోనే మహాశక్తి కొలువుదీరి ఉంటుంది.
వేయి స్తంభాలతో చింతామణి మంటపం..
దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ జగత్తునంతటినీ పాలించే భువనేశ్వరీ దేవి చింతామణి మంటపంలో కొలువై ఉంటుందని తెలుసుకున్నాం కదా!. మరి, చింతామణి గృహం ఎలా ఉంటుందంటే..
చింతామణి మంటపం వేయి స్తంభాల మండపాలతో అలరారుతూ ఉంటుంది. ఇలాంటి మంటపాటు నాలుగు ఉంటాయి. అవి` శృంగార మంటపం, ముక్తి మంటపం, జ్ఞాన మంటపం, ఏకాంత మంటపం. కోటి సూర్యప్రభలతో ఇవి వెలుగొందుతుంటాయి. వాటి చుట్టూ కాశ్మీరం, మల్లిక, కుంద వనాలు పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. ఆ వనాలలో కస్తూరి మృగాలు సంచరిస్తుంటాయి. అక్కడే సుధారసపూర్ణంగా ఉంటే ఒక పెద్ద సరోవరం ఉంటుంది. ఆ

చింతామణి మంటపం వేయి స్తంభాల మండపాలతో అలరారుతూ ఉంటుంది. ఇలాంటి మంటపాటు నాలుగు ఉంటాయి. అవి` శృంగార మంటపం, ముక్తి మంటపం, జ్ఞాన మంటపం, ఏకాంత మంటపం. కోటి సూర్యప్రభలతో ఇవి వెలుగొందుతుంటాయి. వాటి చుట్టూ కాశ్మీరం, మల్లిక, కుంద వనాలు పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. ఆ వనాలలో కస్తూరి మృగాలు సంచరిస్తుంటాయి. అక్కడే సుధారసపూర్ణంగా ఉంటే ఒక పెద్ద సరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు, సోపానాలన్నీ అనేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. సరోవరం మధ్యలో ఓ మహా పద్మవనం, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ ఉంటాయి.
చింతామణి గృహంలో పది మెట్లతో కూడిన ఓ వేదిక ఉంటుంది. ఆ వేదికకు ఉన్న పదిమెట్లూ పది శక్తి స్వరూపాలు. దానికి ఉంటే నాలుగు కోళ్లపై ఉండే ఫలకమే భువనేశ్వరుడైన సదాశివుడి ప్రతిరూపం. ఆ ఫలకం మీద భువనేశ్వరుడి వామాంకంలో అమ్మవారు కూర్చుని ఉంటారు.
అమ్మవారు రత్నాలు పొదిగిన వడ్డాణం, వైఢూర్యాలు తాపడం చేసిన అంగదాలతో అలరారుతుంటారు. శ్రీచక్ర రూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం కళకళలాడుతుంటుంది.
చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండ్లలా ఉండే పెదవులు, కస్తూరి కుంకుమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన చూడామణి, ఉదయభాస్కర బింబంలాంటి ముక్కుపుడక.. ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు, మైపూతలతో శ్రీమాత ప్రకాశిస్తుంటుంది. ఆ మాతకు పక్క భాగంలో శంఖ, పద్మ నిధులు ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్లు తొక్కుతూ అమృత సముద్రంలోకి చేరుతుంటాయి. జగజ్జనని భువనేశ్వరుడి పక్కన కొలువైంది కాబట్టే ఆయనకు అంతటి మహాద్భాగ్యం కలిగిందని, శక్తియుక్తులు లభించాయని అంటారు.
ఐశ్వర్యానికి, యోగానికి పరమావధి.. ‘చింతామణి’
జగన్మాత నివసించే చింతామణి గృహం వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గృహానికి ఉత్తరంగా అనేకానేక శాలలు, ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ అమ్మవారి శక్తి ప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవీ ఉపాసకులంతా చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో మాత తన బిడ్డల వంక చూస్తూ ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి అనే దేవాంగనలు ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, అహోర, మంగళ, దోగ్ధి అనే తొమ్మిది పీఠా శక్తులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ ఉండటం మణిద్వీపంలో కనిపిస్తుంది.
కేవలం దేవీ ఉపాసకులకే కాకుండా నిరంతరార్చన తత్పరులకు ఇక్కడే స్థానం లభిస్తుంది. ఈ ప్రదేశంలో మరో విశేషం ఏమిటంటే` పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి, చెరకు రసాల జీవనదులు ఇక్కడ ప్రవహిస్తుంటాయి. కోర్కెలను తీర్చే మహత్తర వృక్షాలు ఇక్కడ ఎన్నెన్నో ఉంటాయి.
ఈ ప్రాంతంలో నివసించే వారికి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఉండవు. అంతా నిత్య యవ్వనంతో, ఆనందంతో ప్రకాశిస్తుంటారు. వారంతా భువనేశ్వరి మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా ఇక్కడకు వచ్చి అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపమూ, అందులోని చింతామణి గృహమూ ఒక్కోసారి ఒక్కో విధంగా పవిత్రకాంతులను వెదజల్లుతూ ఉంటాయి. ఐశ్వర్యానికి, యోగానికి అన్నిటికీ అది పరమావధి. జగత్తునంతటినీ తానై యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం గురించి దేవీ భాగవతం పై విధంగా వర్ణించింది.
మణిద్వీపంలోని అమ్మవారిని ఆరాధించడం ఎలా?
ఈ బ్రహ్మాండానికి కనురెప్ప పాటులో సృష్టించి లయం చేయగల ముప్పది రెండు మహా శక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వమూ ఉండటం వలన ఆ జగన్మాతను ముప్పది రెండు రకాల పూలతో, పసుపు, కుంకుమలతో, నవరత్నాలతో, రాగి, కంచు, వెండి, బంగారం మొదలైన లోహాలతో యథాశక్తి అమ్మను పూజించాలి.
ముప్పై రెండు రకాల నైవేద్యాలను సమర్పించాలి.
మొగలి, బంతి పూవులను అమ్మవారి పూజకు వినియోగించకూడదు.
మందారాలలో, గులాబీలలో చాలా రకాలు ఉన్నా .. 32 రకాల పుష్పాలలో వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించాలి. కింద తెలిపిన పూలను అమ్మవారి పూజకు వినియోగించాలి. అవి`
మల్లె, గులాబి, సన్నజాజి, విరజాజి, సెంటుమల్లి, డిసెంబరం పూలు, చామంతులు, లిల్లీ, ముద్దగన్నేరు, నందివర్దనం, పారిజాత పూలు, చంద్రకాంతం, సువర్ణ గన్నేరు, కలువ, పాటలీపుష్పాలు, ముద్ద నందివర్దనం, గన్నేరు, కదంబ, మందార, తామర, కనకాంబరం, దేవగన్నేరు, అశోక, నిత్యమల్లె, కుంకుమపువ్వు, పొన్న, మంకెన, రాధామనోహరాలు, కాడమల్లె, నాగమల్లె, విష్ణుక్రాంతం, రామబాణాలు లేదా నూరు వరహాలు, దేవకాంచన, చంపక (సంపంగి), పున్నాగ పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి.

Review అమ్మవారిల్లు..మణిద్వీపం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top