అంగుత్తరనికాయ
గౌతమబుద్ధుడు చెప్పిన ఐదు లక్షణాల సిద్ధాంతమే ‘అంగుత్తరనికాయ’. ప్రతీ మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే..
1. ఏదో ఒకరోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
2. ఏదో ఒకరోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
3. ఏదో ఒకరోజున నన్ను మృత్యువు కబళిస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
4. నేను అమితంగా ప్రేమించి, నావి అని భావించే వస్తువులు, సంపద, ఆస్తి.. అన్నీ ఏదో ఒకరోజున మార్పునకు, నాశనానికి లేదా ఎడబాటుకు లోనయ్యేవే. దాన్ని నేను తప్పించుకోలేను.
5. నేను చేసిన పనుల (స్వకర్మల) ఫలితం వల్లే నేను ఇలా తయారయ్యాను. నా పనులు ఎటువంటివైనా, మంచివైనా, చెడువైనా.. వాటికి నేను వారసుడిని కావాల్సిందే.
అనారోగ్యాన్ని గుర్తుంచుకోవడం ద్వారా ఆరోగ్యం వలన కలిగే అహంకారాన్నీ,
వృద్ధాప్యాన్ని గుర్తుంచుకోవడం ద్వారా యవ్వనం వలన కలిగే అహంకారాన్నీ,
మృత్యువును ధ్యానించడం ద్వారా జీవన విధానం వలన కలిగే అహంకారాన్నీ,
ప్రతి వస్తువులో కలిగే మార్పునీ, నాశనాన్ని ధ్యానించడం ద్వారా అన్నీ నాకే కావాలనే బలమైన కోరికను అణచివేయవచ్చు లేదా కనీసం తగ్గించవచ్చు.
మనం చేసే పనుల ఫలితాన్నే మనం అనుభవిస్తామన్న సత్యాన్ని మననం చేసుకోవడం ద్వారా ఆలోచనలలో, మాటలలో, పనులలో చెడు చేయాలనే దురా
జాబాలి చదువు
మనకు ఎదురయ్యే ఆటంకాలకు లొంగిపోతే జ్ఞానశూన్యుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. కష్టాన్ని తట్టుకుంటేనే విజ్ఞానపు లోకానికి దారి తెలుస్తుంది.
జాబాలికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి జాబాల అతడికి ఉపనయన సంస్కారం చేసి, గురువు హరిద్రుమతుడి వద్దకు విద్యాభ్యాసం కోసం పంపించింది.
తండ్రి ఎవరో తెలియకపోవడంతో తోటి పిల్లల వద్ద, సమా•ంలోనూ జాబాలి ఎన్నో అవమానాల పాలయ్యాడు. విద్య నేర్చుకునే సమయం వచ్చే వరకు గోవుల్ని మేపుతూ అడవిలోనే ఉండాలని గురువు గారు అతడిని ఆదేశించారు.
జాబాలి మరో మాట మాట్లాడకుండా గోవుల్ని తీసుకుని అడవికి బయల్దేరాడు. కానీ, అతని మనసు మాత్రం నిత్యం జ్ఞానాన్వేషణ కోసం పరితపిస్తూనే ఉంది. అతని సత్యనిష్టకు మెచ్చుకున్న దేవతలే స్వయంగా అతడు మేపుతున్న గోవుల్లో చేరి, బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఆశ్రమానికి చేరుకున్న జాబాలి ముఖంలోని దివ్య తేజస్సును చూపి గురువు ఆశ్చర్యపోతాడు.
అప్పటి నుంచి సత్యకామ జాబాలిగా జాబాలి లోక ప్రసిద్ధి పొందాడు. విద్యార్థికి నేర్చుకోవాలనే తపన, స్థిరచిత్తం ఉంటే దైవమే దిగి వస్తుందనడానికి జాబాలి కథ చక్కని ఉదాహరణ.
నేటి తరం పిల్లలు తల్లిదండ్రులు అన్నీ అమర్చిపెట్టినా, అన్నీ సమకూరుస్తున్నా కూడా చదువుల్లో ప్రతిభ చూపలేకపోతున్నారు. విద్య యొక్క ఔన్నత్యాన్ని, ప్రాముఖ్యతను గుర్తించలేక చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారు. జాబాలిని ఆదర్శంగా తీసుకుంటే, స్వశక్తితో, స్వసంకల్పంతో చదువుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చు.
ముక్త్తిస్థితి
మనసు మూగబోవడమే ముక్తస్థితి..
మనిషి బతికున్నాడు అంటే.. అతను చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని అర్థం.
మనిషి మరణించాడు అంటే.. అతను చేయాల్సిన పనులు పూర్తయిపోయాయని అర్థం.
ఈ ‘పనుల యొక్క అర్ఘ్యం’ వ్యక్తి యొక్క గత జన్మల కర్మ విశేషాలు కావు. ఈ పనులు ఈశ్వర సంకల్పాలు. ప్రతి ఒక్కరూ తమకు అప్ప గించిన పని చేస్తుండటమే నిజంగా ‘ఈశ్వర పూజ’.
ఎరుక లేని జీవుడు చేసే ప్రయాణమే- జన్మ పరంపరలు.
ఎరుకతో ఉన్న జీవుడు చేసే ప్రయాణమే- అవతారాలు.
‘అయోమయం’లో నుంచే ప్రశ్న కలుగు తుంది. ‘అనుభవం’లో నుంచే సమాధానం లభిస్తుంది.
Review అవి ఇవి...