ఎన్నో రోజులుగా ఉత్తరాలు రాయాలని ప్రయత్నిస్తున్నా అలసిన చేతివేళ్లు రాయలేమని మొండికెత్తాయి. మెదడు కూడా సోమరితనపు సోయగాల మాయలో పడి ఏమీ అందివ్వలేనని మొరాయించింది. ఒక్కొక్కసారి నాకలాగే అని పిస్తుంది. ఏమీ చేయబుద్ధేయదు. శారదరాత్రుల్లో, వెన్నెలవేళల్లో అలాగే ఆకాశంవంక చూస్తూ, వెన్నెల దీవికి తగిలి పగిలిపోయే మేఘ నౌకల్లో ఊగుతూ, అక్కడక్కడ గతస్మ •తుల్లా మిణుక్కుమనే నక్షత్ర సౌవర్ణ కాంతుల్లో కలలు కంటూ, ఓంకారం మరచిన వంకర జీవిత వంపులను ప్రేమతో నిమురుతూ, ఇంతటి అద్భుతాలు స•ష్టించే పరమాత్మ లీలలను, లీలా మాత్రంగానైనా అర్ధం చేసుకోవాలని విఫల ప్రయ త్నాలు చేస్తూ ‘అర్థరహిత’ నిస్సార జీవితాన్ని గడుపుతూ ఉంటాను.
ఎంత ప్రయత్నించినా స•ష్టి రహస్యాన్ని ఛేదించలేము. ఎంతమంది వాదించినా, ఎంత మంది బోధించినా దైవరహస్యాన్ని ఛేదించలేక పోతున్నారు. అన్నీ చదివిన వ్యక్తులే పరస్పర విరుద్ధమైన సత్యాలను కనుగొంటారు. ఆధ్యాత్మిక శిఖరాలకు ఎగబాకిన మహానుభావులే చివరికి శీర్షాసనము వేస్తూ లోయలోకి జారిపోతారు. వేదాంత భాస్కర వివేకా నందుని అంతటి వ్యక్తికే రామక•ష్ణ పరమహంస చనిపోయేముందు అతను నిజంగా భగవంతుడేనా అన్న అనుమానం ఆయన మేధోనాడుల్లోకి ప్రవేశిస్తుంది. కానీ బయటకు చెప్పడు. ఆ ఆలోచన రాగానే వెంటనే రామక•ష్ణ పరమహంస, అమర లోక ఆహ్వానానికి సిద్ధంగా ఉండే తరుణంలో, శరీరంలోని శక్తినంతా కూడదీసుకుని మెల్లగా వివేకానందుడి వైపు తలను తిప్పి ‘‘ఇంకా నన్ను అనుమానిస్తున్నావా? త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీక•ష్ణుడు నేనే…సాంకేతికంగా అలంకారికంగా కాదు సుమా! నిజంగా అక్షరాలా నేనే!’’ అనే మాటలు అంటాడు. అవి వినేసరికి సిగ్గుతో వివేకానందుడు తలను దించుకుని దూకు తున్న కన్నీటిరెప్పల మాటున దాచుకుంటాడు. అలాంటి మహానుభావుణ్ణే బుగ్గిపాలు చేయటానికి ప్రయత్నించిన మాయ మనల్ని వదులుతుందా? ఎంత చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని అనుభవాలు ఉన్నా, ఎన్ని అనుభూతుల విభూతులను నుదు టను దాల్చినా ఎక్కడో మనకు తెలియకుండానే ఇదంతా నిజమా?! భ్రమ కాదు గదా! భగవంతుడు నిజంగా ఉన్నాడా? మనలను ఓదార్చుకోవడానికి ఎవరో స•ష్టించుకున్న వ్యక్తి కాదు కదా! అతను నిజంగా ఉంటే మన కనుల కొలనుల్లోంచి దొర్లే భాష్పాలు ఆయన దోసిలిలోకి జారుతాయా? జాలితో ఆయన మనం మోయలేని భారాలను, భరించలేని బాధలను తరుముతాడా? అదే నిజమైతే నా బాధలు ఇంకా తగ్గవేం?! నేను రోజూ ఆయన్ని అలసిపోయే దాకా వేడుకుంటూనే ఉన్నాను కదా! కానీ బాధాసర్పాల కోరల నాడి తగ్గదే?! జీవన ప్రాంగణంలో వడగాడ్పులు ఇంకా వీస్తున్నాయి కదా! ఇంకెంత కాలం వేచి ఉండాలి?! లేదా ఇదంతా భ్రమా?! అనవసరంగా కాల యాపన చేస్తూ, జీవితాన్ని వ్యర్ధం చేయటం లేదు కదా! తలలో తెల్ల వెంట్రుకలు తొంగి చూస్తు న్నాయి. జీవితం తెలవారుతూంది. నా ముందు వాళ్లంతా ఎంతో ముందుకు వెళ్లి ఆనంద తీరా లను తాకుతున్నారు. ఇలాంటి ఆలోచనలు.
ఇది ప్రతిమనిషీ ఎన్నో ఏళ్లుగా ధరిత్రిపై సాగిస్తూన్న ప్రయాణం. అందుకే దుఃఖం మనల్ని వీడే ప్రసక్తే లేదు. అనుమానాన్ని, అజ్ఞానాన్ని వేదాంతపు వేటకుక్కలు దిశాంతాల దాకా తరిమితే గానీ, వాటి శాఖలే గాక, వేళ్లు కూడ వాడితే తప్ప, మనం తయారు చేసుకుని ఎండబెట్టుకున్న మట్టి పాత్రను జ్ఞానాగ్నితో మండిస్తే తప్ప ఆనందం మన తలుపు తట్టడం కల్ల. ఏవేవో భ్రమలు కంటూ, ‘ఆయన’పై నమ్మకం కల్గిందని ఊహల్లో తేలటం నవ్వటం, మరుక్షణంలో కన్నీరు కార్చటం వ•ధా ప్రయాస. అలా చేయటం వల్ల వ్యధల కబంధ హస్తాల్లోంచి బయటకు రాలేం. జ్ఞానం, భక్తి రెండూ ఉక్కు కండరాలు పెంచుకుని చేతులు కలపాలి. అనుభవాల వేటకు బయలుదేరాలి. ఓడి పోయిన ప్రతిసారీ, గాయపడ్డ సింహంలా గర్జించాలి. కుపిత సింహకిశోరంలా అనుమాన మద గజ శీర్షంపై లంఘించాలి. జ్ఞాననేత్రం విప్పారాలే గానీ ప్రతి ‘ఓటమి’లో వేయి గెలుపులు దాక్కుని ఉంటాయి. భగవంతుని అసాధారణమైన ప్రేమ తత్వాన్ని కాచివడబోయాలి. అందుకు పుస్తకజ్ఞానం పనిచేయదు. నిత్యమూ వేదాంతపు వేపపుల్లతో దంతధావనం చేసుకునే పండిత ప్రకాండులే , దూది రేకుల్లా అజ్ఞాన ఝంఝామారుతంలో ఎగిరి పోతారు. అనూహ్యమైన భగవత్ క•పా భూయిష్ట మైన జ్ఞానరత్నం వెలుగులో మన అనుభవ పాఠాలను అనునిత్యమూ వల్లె వేయాలి. అపుడు సుడిగుండాల్లోనూ, సడిలేని గంటలు మోగు తాయి. తుఫానుల్ని తవ్వితే తత్వ రహస్యాలు జల పాతాల్లా దూకుతాయి. కన్నీటిలో కన్నయ్య నోటి పాటలు ప్రతిధ్వనిస్తాయి. ఝంఝామారుతంలో ఝం! అనే ఓంకారనాదం ఒళ్లు ఝల్లుమనేలా వినపడుతుంది. క•ష్ణపక్షాల్లో క•ష్ణ గీతలు గజ్జెకట్టి నాట్యం చేస్తాయి. బాధాసర్పాలు, బోధిసత్వుని స్వరూపాలుగా మారతాయి. అపుడు ఈ ప్రాపం చిక పంకంలో నుంచే ప్రపుల్లమైన పంకజం పుట్టు కొస్తుంది. ప్రపంచం ఎప్పటిలాగే ఉంటుంది. అందులో పెద్ద మార్పేదీ లేదు. కానీ ఇప్పుడు ప్రపంచం కోరలు పీకిన సర్పం లాంటిది. నీవు చెప్పినట్లు ఆడుతుంది. ఇప్పటిదాకా వేదనా నీరధి అయిన ఈ ప్రపంచం వేదనాద నిధి అవుతుంది. ఒకే చోట నాటినా, ఒకే రైతు చేతిలోనుంచి జారినా, ఒకే ఎరువు వేసినా, విత్తనం లక్షణాన్ని బట్టి మధురరసభరితమై ఫలరాజములను అందించే మామిడిచెట్టు మొలకెత్తనూవచ్చు. గర ళాన్ని జ్ఞాపకం తెచ్చే వేపచెట్టు పుట్టనూ వచ్చు. నేల ఒక్కటే, వేసిన ఎరువు ఒక్కటే కాని మొలకెత్తిన వ•క్షాలు వేరు, విత్తన లక్షణాన్ని బట్టి. అలాగే ప్రపంచం ఒక్కటే. అందులోని మనుషులు ఒక్కటే. అందులోని మనుషులు, మమకార బంధాలు ఒక్కటే అయినా పరిపక్వ తరంగ ధ•తిని బట్టి ఇదే ప్రపంచం నుంచి జ్ఞాని అమితమైన ఆనం దాన్ని పిండుకుంటాడు. అజ్ఞాని అది కలిగించే దుఃఖ ప్రవాహంలో మ•త్యుతీరానికి కొట్టుకు పోతాడు. జ్ఞానికి అపజయాలు, అవమానాలు, బాధ, వ్యధ, కన్నీరు అన్నీ పన్నీటినే చిలకరిస్తాయి. ఇక్కడ ‘జ్ఞానం’ అంటే పుస్తక పాండిత్యం వల్ల ప్రశంసల వర్షం కురుస్తుందే గానీ, పరమాత్మ దర్శనం కలగదు. కరతాళ ధ్వనులు వింటామే కానీ, కాళరాత్రులు పోవు. పేరు వస్తుందే కానీ, హ•దయంలో పేరుకున్న దుఃఖపు దొంతరలు అలాగే ఉంటాయి. శిష్యులు పెరుగుతారే కానీ, బాధ బుసకొట్టే విషపు జ్వాలలు తరగవు.
నిజమైన జ్ఞానం అంతరంగ మధనంలో ఆత్మ చిందే సుధ. నిజమైన జ్ఞాని మ •త్యువు ఒడిలోకి కూడా మాత• కౌగిల్లోకి వెళ్లినట్టు ఆనందంగా వెళ్తాడు. నిజానికి మ•త్యువంటే మాత•కౌగిలే. ణవ••ష్ట్ర ఱ• అశీ•ష్ట్రఱఅస్త్ర ••• •ఱఙఱఅవ వఎ•తీ•అ•వ ఎపుడైనా ముద్దుగా ఇతర పిల్లలతో ఓ వేసవి సాయంకాలపు నీరెండలో ఆనందంగా ఆడుకునే బాబును, ఆట మధ్యలో అకస్మాత్తుగా వాళ్ల అమ్మ గనక చూస్తే, ఆమె గుండెల్లో మాత• సుధాఝరీ తరంగాలు ఉప్పొంగితే, ఆమెకే తెలియని ఉప్పెనలాంటి ఆ ప్రేమను తట్టుకోలేక, తన బాబు ఆట మధ్యలో ఆనందంగా తోటివాళ్లతో కలిసి ఆడుతున్న విషయం కూడా మరిచి, అమాంతం ఆట మధ్యలోనుంచి తన బాబును లాక్కుని, ఇతర పిల్లలతో ఆట అనుబంధాన్ని తుంచి, వాళ్లకు వేదన కలిగిస్తూ, ఆట మధ్యలో అనందానికి అడ్డుపడ్డందుకు, ఉద్వేగంతో ఊగుతూ బాబు కేక పెడుతూ, ఏడుస్తూ తిరిగి ఆటలోకి పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నా పట్టించుకోనట్టు అమ్మ తన బాబును హ•దయానికి ఆర్ద్రతతో గట్టిగా హత్తుకుని మెత్తగా తలనిమురుతూ, వణుకుతున్న పెదవులలోనుంచి మధురాధిపుడు చిన్ననాట తిన్న వెన్నలాంటి ముద్దులను రాలుస్తూ, కట్టలు తెంచుకుంటున్న ఆనంద భాష్ప తుంగభద్రా తరంగాలను తన నయనాల్లోనుంచి బాబు నుదిటిపై జారవిడుస్తుంది. ఆమె హ•దయంలో ఫెళ్లున గన్నేరుపూలు రాలుతాయి. ఆమె ఆంతర్యపటలంపై ఆత్మీయత ఆనంద తాండవం చేస్తుంది. బాబు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. అమ్మ చేతుల్లోంచి బాబు ఆటలోకి పరిగెత్తాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. మధ్యలో ఆట ముగియ కుండానే తీసికెళ్లినందుకు మిగతా మిత్రులు అమ్మను నిందిస్తూనే ఉంటారు. అమ్మ వాళ్ల నిందలను భరిస్తూనే ఉంటుంది. బాబు ఏడుపు వింటూనే ఉంటుంది. కాని అమ్మ తాను బాబును ప్రేమించడం మానదు. బాబును తన కౌగిల్లోంచి వదలదు.
ఇదీ మ•త్యువంటే.
ణవ••ష్ట్ర ఱ• •ష్ట్రవ వ••••ఱ•• ••అ•వ శీ• •ఱఙఱఅవ శ్రీశీఙవ శీఅ •ష్ట్రవ ష్ట్రవ•తీ• శీ• శ్రీశీఙవ.
ఇది తెలిసిన జ్ఞాని సోక్రటీస్‍లా నవ్వుల సిరులు రువ్వుతూ మ•త్యువును ముద్దిడుతాడు. అందుకే వివేకానందుడు మరణాన్ని అర్థం చేసుకుంటే తప్ప నన్ను అర్ధం చేసుకోలేరు అంటాడు. అలాంటి జ్ఞానికి ప్రపంచం అమ•తాన్ని పంచిపెడుతుంది. మనకు కావలసినది ప్రపంచం నుంచి పారి పోవటం కాదు. ప్రపంచంలోకి పారిపోవటం. దాని లోపలి పీయూష పరిమళాలను ఆఘ్రా ణించటం. అందుకే నాకనిపిస్తుంది
ప్రభూ!
నీవు నాపై కురిపించే ఆనందాలు
నీ ఆత్మీయతల ఆషాఢ మేఘామ •తాలు
నీవు పంపే బాధలు, వ్యధలు
నా ఆత్మను ఆవరించి ఉన్న వ్యాధిని
నయం చేసే ఔషధాలు
సుఖదుఃఖాలు రెండూ
నీ కళ్లలోనుంచి దూకే ప్రభాత కాంతులే.
(శ్రీరామ్ సర్ వివిధ సందర్భాలలో రాసిన లేఖలనుంచి సేకరించిన అంశాలు ఇవి)
Review ఆత్మ చిందే సుధ నిజమైన జ్ఞానం.