ఉత్సాహమే సగం విజయం
ఉత్సాహో బలవాన్ ఆర్య నాస్తి ఉత్సాహాత్ పరం బలం
స: ఉత్సాహస్య హి లోకేషు న కించిత్ ఆపి దుర్లభం
‘‘అన్నయ్యా! స్నేహం, ప్రేమ ఉండాల్సిందే. కానీ, మరీ ఇంత పిచ్చి ప్రేమ అయితే భరించడం కష్టం. నువ్వు ఒక్క విషయం గుర్తు పెట్టుకో అన్నయా! నీకు ఇంత దు:ఖానికి కారణమైన రావణాసురుడు స్వర్గానికే వెళ్లనీ, పాతాళానికే వెళ్లి దాక్కోనీ.. మళ్లీ తన తల్లి గర్భంలో దూరిపోనీ.. వాడిని మాత్రం వదలను. చంపి తీరుతాను. నువ్వు ఈ దు:ఖాన్ని విడిచిపెట్టు. దు:ఖం పొందితే ఉత్సాహం నశిస్తుంది. ఉత్సాహం ఉంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. కానీ, ఉత్సాహం పోతే, తనలో ఎంత శక్తి ఉన్నా అదంతా భయం చేత, దు:ఖం చేత పనికి రాకుండా పోతుంది. అందుకని అన్నయ్యా! ఉత్సాహాన్ని పొందు’’.
(రావణుడు సీతను అపహరించుకు పోయాడు. ఆమె ఎడబాటును భరించలేని రాముడు ఆమెను పదేపదే గుర్తు చేసుకుంటూ కంటతడి పెడుతూ, దు:ఖంలో కూరుకుపోయిన సందర్భంలో లక్ష్మణుడు పలికిన పలుకులివి).
ఆధ్యాత్మిక ఝరి

Review ఆధ్యాత్మిక ఝరి.