ఏ తిథిలో ఏ దైవాన్ని పూజించాలంటే..

అజ్ఞానంతో కూడిన మనసులో జ్ఞానదీపం వెలిగించే మాసం కార్తీకం.
‘న కార్తీక సమో మాస:’
మాసాలలో కార్తికాన్ని మించినది లేదని అర్థం. ఇది స్కాంద పురాణోక్తి.
ఈ మాసంలో మహా విష్ణువుకు కార్తీక దామోదరుడని పేరు.
ఇక, పరమశివుడు కార్తీక మహాదేవుడిగా పూజలందుకుంటాడు.
‘విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచమ్‍’ అనే విష్ణత్వ వైభవం, ‘శివతరాయచ’ అనే పరమశివ వైభవం అంటూ అంతర్యామికి చెందిన రెండు వైభవాలను వేదం వర్ణించింది. అటువంటి శివకేశవులకు పరమప్రీతిపాత్రమైన కార్తీకంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. ఈ మాసంలో వచ్చే తిథుల్లో ఏ తిథి నాడు ఎవరిని పూజించాలంటే..

కార్తీక శుద్ధ పాడ్యమి: లక్ష్మీదేవిని ఆరాధించాలి. అలాగే, కేరళవాసులు ఈనాడు బలి చక్రవర్తిని కూడా పూజిస్తారు.
కార్తీక శుద్ధ విదియ: యముడు తన సోదరి ఇంటికి భోజనానికి వచ్చిన రోజు ఇది. ఈనాడు ఆయనను పూజించడం వల్ల యమగండాలు, దోషాలు తొలగిపోతాయి.
కార్తీక శుద్ధ తదియ: లక్ష్మీ, గౌరీదేవిని, విష్ణువును పూజించాలి.
కార్తీక శుద్ధ చతుర్థి: ఇది నాగుల తిథి. కాబట్టి ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించాలి. ఈయననే కార్తికేయుడు, స్కందుడు, కుమారస్వామి అని కూడా అంటారు. ఈయనను ఆరాధించడం వల్ల సర్పదోషాలతో పాటు కుజ దోషాలు కూడా తొలగి దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సౌభాగ్యం నిలబడుతుందని అంటారు.
కార్తీక శుద్ధ పంచమి: ఇది కూడా నాగారాధనకు ప్రత్యేకించిన తిథి. సాధారణ పూజా విధులు ఈనాడు నిర్వహించాలి.
కార్తీక శుద్ధ షష్ఠి: ఇది కూడా సుబ్రహ్మణ్యుడికి ఉద్దేశించిన తిథి. ఈనాడు ఆయనను ఆరాధించి కు•దోషాలను పోగొట్టుకోవచ్చు.
కార్తీక శుద్ధ సప్తమి: కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఏడో రోజు ఇది. ఈ తిథికి అధిపతి సూర్యుడు. ఈ రోజున ప్రాత:కాలంలోనే నిద్రలేచి నదీస్నానం ఆచరించి, సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆదిత్య హృదయ పారాయణం వల్ల అన్నింటా విజయం చేకూరుతుంది. గోధుమలు, బంగారం, పట్టువస్త్రాలు దానం చేయడం వల్ల
శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక శుద్ధ నవమి: నవమి తిథి దుర్గాదేవి ఆరాధనకు ఉద్దేశించినది. కాబట్టి ఈనాడు అమ్మవారిని పూజించాలి. వస్త్రాలు, బంగారం, వెండి దానం చేయాలి. ఈరోజున దుర్గామాతను ఆరాధించడం వల్ల రాహువు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. దాంపత్యబంధం మెరుగవుతుంది.
కార్తీక శుద్ధ దశమి: ఈ రోజుకు అధిపతులు అష్టవశువులు మరియు పితృదేవతలు. పితృ తర్పణాలు దానం చేయాలి. ఈ రోజు పితృ దేవతలను తలచుకోవడం, వారికి తర్పణాలు విడువడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని అంటారు.
కార్తీక శుద్ధ ఏకాదశి: ఈ రోజుకు అధిపతి దిగ్గజాలు. గుమ్మడికాయ, నూనె దానం చేయడం వల్ల యశస్సు, ధన లాభం కలుగుతాయి.
కార్తీక శుద్ధ ద్వాదశి: శివకేశవులను ఆరాధించాలి.
కార్తీక శుద్ధ త్రయోదశి: శనీశ్వరుడిని పూజించడానికి ఇది మంచి తిథి.
కార్తీక శుద్ధ చతుర్దశి: ఈ రోజుకు అధిపతి శివుడు. శివుడి వద్ద నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల ధనప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతాయి. విభూతి పండుతో పాటు శక్తికొద్దీ దానాలు చేయాలి.
కార్తీక శుద్ధ పూర్ణిమ: ఇది కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు. శివపార్వతులను దీపారాధనతో ఆరాధించాలి. విష్ణువుకు కూడా ప్రీతికరమైన దినమిది.
కార్తీక బహుళ పాడ్యమి: మన్మథుడిని పూజించాలి. మల్లె, జాజి వంటి పువ్వులను స్త్రీలకు దానం చేయాలి. వన భోజనం చేయాలి. మన్మథుడిని ఆరాధించడం వల్ల వీర్యవృద్ధి, సౌందర్యం కలుగుతాయి.
కార్తీక బహుళ విదియ: యముడిని పూజించాలి. నువ్వులు, ఇనుము, గేదె వంటివి దానంగా ఇవ్వాలి. యముడిని పూజించడం వల్ల అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి.
కార్తీకబహుళ తదియ: చంద్రుడిని ఆరాధించాలి. బియ్యం, వెండి దానం చేయాలి.

Review ఏ తిథిలో ఏ దైవాన్ని పూజించాలంటే...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top